హైదరాబాద్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నెల్లూరులోని కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు ఇళ్ల వద్ద భద్రత పెంచారు. సమైక్యవాదులు వీరి ఇళ్లను ముట్టడించే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమైక్యవాదానికి మద్దతివ్వకుండా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పనబాక లక్ష్మి పలుమార్లు స్పష్టం చేయడంతో ఆమె తీరును సమైక్యవాదులు ఖండిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో లోక్ సభలో ఆమోదం పొందింది.