టీడీపీ టికెట్ల లొల్లి: బాలసాని.. నామా బాహాబాహీ | balasani, nama groups clash in khammam over tdp tickets | Sakshi
Sakshi News home page

టీడీపీ టికెట్ల లొల్లి: బాలసాని.. నామా బాహాబాహీ

Published Wed, Apr 9 2014 11:56 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

టీడీపీ టికెట్ల లొల్లి: బాలసాని.. నామా బాహాబాహీ - Sakshi

టీడీపీ టికెట్ల లొల్లి: బాలసాని.. నామా బాహాబాహీ

ఖమ్మం జిల్లాలో టీడీపీ టికెట్ల కేటాయింపు ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ముందుగా కొత్తగూడెం స్థానానికి తన పేరు ప్రకటించి, ఆఖరి నిమిషంలో తనకు మొండిచేయి చూపడంతో ఆ పార్టీ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో జిల్లాలో అన్ని స్థానాలను దాదాపుగా  ఒకే సామాజికవర్గానికి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఎంపీ నామా నాగేశ్వరరావుపై విమర్శలు సంధించారు. తనను కాదని కోనేరు సత్యనారాయణకు బీ ఫారం కూడా ఇచ్చేసినట్లు తెలియడం ఆయన ఆగ్రహానికి కారణమైంది.

ఈ విషయం తెలిసిన నామా నాగేశ్వరరావు, ఎలాగోలా బాలసానిని బుజ్జగించి తన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తీసుకెళ్లాలని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే, అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలసాని వర్గీయులు నామా రాకను అడ్డుకున్నారు. రెండు వర్గాల నాయకులు బాహాబాహీ తలపడ్డారు. దీంతో బాలసాని లక్ష్మీనారాయణ ఇంటివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement