అమరుల కుటుంబాలకు వరాలు | Governor Narasimhan speech at Telangana assembly | Sakshi
Sakshi News home page

అమరుల కుటుంబాలకు వరాలు

Published Wed, Jun 11 2014 11:18 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

అమరుల కుటుంబాలకు వరాలు - Sakshi

అమరుల కుటుంబాలకు వరాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉభయ సభలు బుధవారమిక్కడ ప్రారంభం అయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు వరాల జల్లు కురిపించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.

*తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులకు రూ.10లక్షల పరిహారం
*కుటుంబసభ్యునికి ప్రభుత్వోద్యోగంతోపాటు...
*అమరవీరుల కుటుంబానికి ఉచిత విద్య
*తెలంగాణ అమరవీరుల త్యాగాలను కొనియాడిన గవర్నర్
*తండాలను పంచాయతీలుగా మార్చుతాం
*విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ
*తెలంగాణలో లక్షల కుటుంబాలు...దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి
*బీసీ, ఎస్టీ, ఎస్టీ సంక్షేమానికి రూ.లక్ష కోట్లు
*కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య
*ఒక్కో ఇంటిని రూ.3లక్షల వ్యయంతో...పేదలకు ఇళ్లు
*న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు
* జర్నలిస్టులకు కార్పస్ ఫండ్ రూ. 10 కోట్లు
* వికలాంగులకు రూ.1,500 పింఛన్
*వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛన్
* ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్లు, హెల్త్ కార్డులు
*హైదరాబాద్లో ఎక్స్ప్రెస్ రహదారులు
*ర్యాపిడ్ మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు
*హైదరాబాద్ శాంతి భద్రతలు,మహిళలకు భద్రత
*కాజీ పేట వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంతో సంప్రదింపులు
*తెలంగాణ విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది
*వచ్చే మూడేళ్లలో విద్యుత్ కొరతను అధిగమిస్తాం
*ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు
*గొలుగుకట్టు చెరువులు, ఆనకట్టల పునరుద్ధరణ
* ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు లక్ష ఎకరాలకు సాగునీరు
* జామాబాద్లో చెరుకు పరిశోధనా కేంద్రం
*భారత దేశ విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement