తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగిదంటే...
గవర్నర్కు తగిలిన రేవంత్ విసిరిన కాగితాలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే సభలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. పార్టీ ఫిరాయింపులపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. రెండు నిమిషాల్లోనే వెల్ లోకి దూసుకొచ్చారు. ప్రసంగం కాపీలను చించేసి ఆయనపైకి విసిరారు. రేవంత్ రెడ్డి విసిరిన రెండు కాగితాలు రెండుసార్లు గవర్నర్ ను తాకాయి. టీఆర్ఎస్ సభ్యులు మానవహారంగా ఏర్పడి టీడీపీ సభ్యులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
గవర్నర్ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీలపై అధికార సభ్యులు దాడికి దిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సభలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. తమ సభ్యులకు సర్దిచెప్పాలని కడియం శ్రీహరి, హరీశ్ రావులకు సూచించారు. వీరు సర్దిచెప్పడంతో టీఆర్ఎస్ సభ్యులు వెనక్కు తగ్గారు.