terrace
-
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్‌లో చూసి ‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
ఖర్చు లేకుండా.. మిద్దె తోటతో ఆరోగ్యం
ప్రజల అవసరాల దృష్ట రోజు రోజుకు కాంక్రీట్ మయంగా మారుతున్నాయి పట్టణాలు. పట్టణ ప్రజలకు సరిపడా కూరగాయలు లభించడం లేదు అని చెప్పవచ్చు. దింతో ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టడంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం... సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సిద్దిపేటలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దింతో పట్టణంలో బహుళ అంతస్తుల బిల్డింగుల నిర్మాణం కావడంతో, పట్టణం కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పచ్చదనం వైపు అడుగులు వేస్తూ, తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో రోజురోజుకు మిద్దె తోటల పెంపకం కల్చర్ పెరిగిపోతుంది. కరోనా మానవుని జీవితంలో పెను మార్పులకు కారణమయ్యింది. పట్టణ ప్రజలలో తమ ఆరోగ్యాల పై శ్రద్ధ పెరగటంతో, ఫ్రెష్ గా దొరికే కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో కాముని అశోక్, రాజేశ్వరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు , మిద్దె తోటను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అశోక్ ఇల్లు పచ్చని చెట్లతో ఒక పొదరిల్లుగా దర్శనమిస్తుంది. కరోనా సమయంలో యూట్యూబ్ లో చూసి మిద్దె తోటను పెంచడం జరిగిందని కాముని అశోక్ తెలిపారు. ఇండ్లలో పాడైన, పనికిరాని వస్తువుల తో తక్కువ ఖర్చులోనే మిద్దే తోటను ఏర్పాటు చేయడం జరిగిందని అశోక్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్, నూనె క్యాన్లు,పాడైన వస్తువులలో మట్టిని నింపి కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని అశోక్ తెలిపారు. మిద్దె తోటలో పాలకూర, కొత్తిమీర, మెంతం, పుదీనా, చుక్కకూర, తోటకూర, ఎర్ర బచ్చలి, టమాట, వంకాయ, బెండకాయ, మిర్చి, క్యాబేజీ, క్వాలి ఫ్లవర్, వంటి అన్ని రకాల కూరగాయలు పండించడం తో పాటు మునిగే చెట్టు, కరివేపాకు చెట్టు, నిమ్మచెట్టు పెంచడం జరుగుతుందని అశోక్ దంపతులు తెలిపారు. శ్రీనివాస్ అనే మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిద్దె తోటను పెంచుతున్నారు. తమ మిద్దే తోటలో అన్ని రకాల కూరగాయలు పండించడంతో, తమ ఇంటి అవసరాలకు సరిపోవుగా, ఇరుగుపొరుగు వారి కూడా కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ బడి పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్చ్ బడిలో తయారైన, వర్మి కంపోస్టు ఎరువును కూరగాయల మొక్కలకు వేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, మిద్దె తోటల పెంపకం పై కూడా స్వచ్ఛ బడిలో అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మేమంతా ప్రభుత్వ ఉపాధ్యాయులం కావడంతో, సాయంకాలం వేళ మిద్దె తోటలో ఒక గంటసేపు గడపడంతో స్వచ్ఛమైన గాలితో పాటు ప్రకృతి వనంలో ఉన్నట్టు అనిపిస్తుందని ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. వర్మి కంపోస్ట్ తో పండించిన కూరగాయలు ఫ్రెష్‌గా, ఎంతో రుచికరంగా ఉంటాయని ఆమె అన్నారు. స్వచ్ఛమైన కూరగాయలు తినడంతో తాను 6 నెలలకు ఒక్కసారి కూడా టాబ్లెట్ వాడడం చాలా తక్కువ అని రాజేశ్వరి తెలిపారు. మనసుంటే మార్గం ఉన్నట్లు,పట్టణ ప్రజలు తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కూరగాయ మొక్కలు పెంచుకోవాలని రాజేశ్వరి సూచించారు. -
బిల్డింగ్‌పై బ్యూటీషియన్ మృతదేహం.. రూమ్మెట్ క్షణికావేశంలో..!
దేశ రాజధానిలో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీ, మజ్ను కా తిల్లాలోని ఓ భవనంపై మహిళ మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది. పార్టీలో జరిగిన గొడవలో బాధిత మహిళను తన రూమ్మెంట్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రాణి(35) గురుగ్రామ్‌లోని బ్యూటీ పార్లలో పనిచేస్తోంది. సాప్న(36) వెయిటర్ వృత్తి చేస్తోంది. వీరిరువురూ ఒకే గదిలో రెంట్‌కు ఉంటున్నారు. నిన్న జరిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న సాప్న.. తన తండ్రిని దుర్భాషలాడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే గొడవ మరుసటి రోజు ఉదయం 4గంటలకు మళ్లీ మొదలైంది. విచక్షణ కోల్పోయిన సాప్న రూమ్‌లో ఉన్న కత్తితో రాణిపై దాడి చేసింది. రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రాణి మృతదేహం భవనం టెర్రస్ పైన పడి ఉందని పోలీసులు తెలిపారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న సాప్నకు ఓ కుమార్తె కూడా ఉన్నట్లు వెల్లడించారు. సాప్న నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..! -
రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు..మమ్మల్ని చూసి: సిద్ధూ
చండీగడ్: పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ.. పాటియాలలోని తన ఇంటి వద్ద భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చాడని వెల్లడించారు. పని మనిషి అతడ్ని చూసి తనను అప్రమత్తం చేశాడని చెప్పుకొచ్చారు. టెర్రస్‌పైకి వచ్చిన ఆగంతుకుడు బ్లాంకెంట్ కప్పుకుని ఉన్నాడని, అతని తీరు చూస్తే లోపల ఆయుధం కలిగి ఉండవచ్చనే అనుమానం కల్గిందని సిద్ధూ పేర్కొన్నారు. తాము బయటకు వెళ్లి చూడగానే అనుమానిత వ్యక్తి పక్కింటిపైకి దూకి పారిపోయాడని వివరించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. Today on the terrace of my residence an unknown suspicious character wrapped in grey blanket was noticed around 7:00 PM , the moment my servant went out raised the alarm and called for help , he immediately ran and escaped. Have spoken to @DGPPunjabPolice and SSP Patiala has… — Navjot Singh Sidhu (@sherryontopp) April 16, 2023 ఈ విషయాన్ని వెంటనే పాటియాల ఎస్ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానని, పంజాబ్ డీజీపీతో కూడా మాట్లాడానని సిద్ధూ చెప్పారు. అనంతరం ఎస్ఎస్పీ వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను సేకరించి అనుమానిత వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానితుడు తన ఇంటి టెర్రస్‌పైకి వచ్చినప్పుడు సిద్ధు కాంగ్రెస్ నేతలతో ఇంట్లోనే సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. పాటియాల మాజీ ఎంపీ ధర్మవీర గాంధీ, ఇతర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. పని పనిషి ఆగంతకుడ్ని చూసిన విషయాన్ని సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పారని గాంధీ వివరించారు. తాము వెంటనే బయటకు వెళ్లి చూడగా.. అతడు పక్కింటిపైకి దూకి పారిపోయాడని తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
Terrace Gardens: డాబాలే.. పొలాలై..
ఉదయం లేచింది మొదలు ఈ రోజు ఏం కూర వండాలని తెగ ఆలోచిస్తుంటారు ఆడవాళ్లు. కానీ డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వల్లూరి సత్యవేణి మాత్రం డాబా మీదకు వెళతారు. అప్పుడే తాజాగా కాసిన కూరగాయలు తెచ్చి వంట కానిచ్చేస్తారు. అక్కడేమి అద్భుతం ఉండదు. సత్యవేణి ప్రేమగా పెంచుకుంటున్న గార్డెన్ ఉంటుంది. ఆమె ఒక్కరే కాదు.. ఇప్పుడు చాలా ఇళ్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది. కోవిడ్ తర్వాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో చాలా ఇళ్లపై డాబాలు మినీ వనాలను తలపిస్తున్నాయి. వీటితో పాటు పొలం గట్లు, దిమ్మలు కూరగాయల పాదులు, ఆకుకూరలతో నిండిపోతున్నాయి. గతంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయం చేయడం వలన కౌలు రైతులు పెద్దగా ఉండేవారు కాదు. పొలాల్లో దిమ్మలపై పశువుల మకాంలు ఏర్పాటు చేసుకుని ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పొలం గట్లపై కందులు సాగు చేసేవారు. తద్వారా ఇంటి అవసరాలు తీరడంతో పాటు మార్కెట్లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేవారు. మరోపక్క గృహిణులు ఇంటి పెరటిలో కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచేవారు. కాలక్రమంలో వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోగా కౌలు రైతులు పెరిగారు. శిస్తు చెల్లించే క్రమంలో సాగు విస్తీర్ణం పెంచుకునేందుకు కౌలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. పారలంకతో గట్లు కుచించుకుపోతుండగా దిమ్మలు కరిగిపోయి పొలాల్లో చాలా వరకూ కూరగాయల సాగు తగ్గిపోయింది. మరోపక్క ఇళ్ల వద్ద పెరడులు కనుమరుగైపోయి మార్కెట్లో దొరికే ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు, ఆకుకూరల పైనే ఆధారపడాల్సి వస్తోంది. వెలగతోడులో పొలం గట్లపై వేసిన బెండ మొక్కలను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయాధికారి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా సేంద్రియ పద్ధతిలో ఇళ్ల వద్ద, పొలాల్లోను కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లోని డ్వాక్రా మహిళలకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేంద్రియ సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ ఇస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా వారికి వంగ, మిరప, టమాటా, ఆనప, బెండ వంటి కూరగాయలతో పాటు గోంగూర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరల విత్తనాలు అందజేస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. మార్కెట్లో రసాయనాలు వినియోగించిన కూరగాయలు కొనే కన్నా ఇంటి వద్ద సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీలైనంతలో ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు, మేడ పైన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటున్నారు. మరోపక్క పొలంబడి ద్వారా రైతులకు శిక్షణ ఇచ్చి గట్లు, దిమ్మలపై కూరగాయల సాగును కూడా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోత్సహిస్తోంది. ఆకుకూరలు, కాయగూరలతో పాటు మునగ, బొప్పాయి విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే వనరులతో కషాయాల తయారీపై శిక్షణ ఇస్తూ సేంద్రియ పద్ధతిలో రైతులతో సాగు చేయిస్తున్నారు. ఆయా పంటలను ఎప్పటికప్పుడు వ్యవసాయ సిబ్బంది పరీక్షించి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఈ తరహాలో పండించిన వాటికి మంచి డిమాండ్ ఉంటోంది. మార్కెట్ ధరలతో పోలిస్తే సేంద్రియ కూరగాయలను రెట్టింపు ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వినియోగదారులు వెనుకాడటం లేదు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలోని 14,800 మంది మహిళలు కిచెన్ గార్డెన్ ద్వారా సేంద్రియ పద్దతిలో ఇళ్ల వద్ద కూరగాయలు పెంచుతుండగా, 5,400 మంది రైతులు పొలం గట్లు, దిమ్మలపై వీటిని సాగు చేస్తున్నారు. మరింత మందితో సాగు చేయించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకృతి వ్యవసాయ అధికారులు తెలిపారు. మా ఇల్లే మినీ వనం ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలతో సేంద్రియ సాగుపై అవగాహన పెంచుకుని మేడపై సాగు చేయడం మొదలు పెట్టాం. ఆకుకూరలు, కూరగాయలతో పాటు డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, అంజీర వంటి పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాం. ఇంట్లో కూరల కోసం వీటి నుంచి వచ్చిన కూరగాయలు, ఆకు కూరలనే వినియోగిస్తుంటాం. ఎక్కువగా కాపుకొచ్చినప్పుడు ఇరుగుపొరుగు వారికి ఇస్తూంటాం. – వల్లూరి సత్యవేణి, అర్తమూరు ఆరోగ్యవంతమైన జీవనం పొలం గట్లు, ఇళ్ల వద్ద సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు శిక్షణతో పాటు విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నాం. సేంద్రియ సాగు వలన ఆరోగ్యవంతమైన జీవనంతో పాటు పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుంది. గట్లపై కందులు, కూరగాయల సాగుతో వరిపై మొవ్వు, పచ్చదోమ వంటి చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. – బి.జగన్, మండల ప్రకృతి వ్యవసాయ అధికారి, మండపేట -
ఆ అన్న లేకుంటే తమ్ముడి పరిస్థితి ఏంటో?
వైరల్: సీసీటీవీ ఫుటేజీ ఘటనలు వైరల్ అవ్వడం షరామాములు అయ్యింది. మీడియా కంటే సోషల్ మీడియాలోనే వాటికి క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అందునా రెప్పపాటు ఘటనలు శరవేగంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతుంటాయి కూడా. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ మలప్పురంలో జరిగింది. ఓ వ్యక్తి ఇంటిపైన భాగంలో శుభ్రం చేస్తుండగా.. పట్టుతప్పి కిందపడిపోయాడు. ఆ సమయంలో అతని సోదరుడు కింద ఉన్నాడు. టెర్రెస్ పైనుంచి కింద పడిపోతున్న సోదరుడిని గమనించి.. అతను క్యాచ్ పట్టేశాడు. ఈ ఘటనలో పైనుంచి పడిన వ్యక్తి పైకిలేచి మాములుగా కనిపించగా.. అతని అన్న మాత్రం కాసేపటికి పైకి లేచాడు. ఆ అన్న గమనించకపోయినా.. స్పందించకపోయినా ఆ తమ్ముడికి కచ్చితంగా ఏదో ఒకగాయం అయ్యి ఉండేది. జులై 31న ఈ ఘటన జరిగినట్లు సీసీఫుటేజీ ద్వారా తెలుస్తోంది. pic.twitter.com/wJjBad1kuT — Vishal Dharm (@VishalDharm1) August 3, 2022 -
Sugandha Devi: మిద్దె మీద వరి చేను.. ఏడాదికి 45 కేజీల బియ్యం.. వారెవ్వా!
Sugandha Devi: Kerala HomeMaker Grows Paddy On Terrace: మిద్దె పైకి వెళ్దాం పద... కొత్త మాట. ఒకప్పుడు సేద్యం అంటే పొలం అనే భావన. ఇప్పుడు అది మారింది. టెర్రస్ కూడా పంట చేనే అనే ధోరణి పెరిగింది. అయితే ఇన్నాళ్లు కూరగాయలు ఆకుకూరలు మాత్రమే టెర్రస్ మీద పండించడం చూశాం. కాని కేరళలోని స్త్రీలు కొందరు మిద్దె మీద ఏకంగా వరే పండించేస్తున్నారు. కుండీల్లో వరి పండి కంకులుగా కోతకు సిద్ధం కావడం విశేషమే.ఆడవాళ్లు ఇప్పుడు ఆధునిక సేద్యవనితలు. మిద్దె మీద వరి చేను ప్రత్యక్షం కావడం కొంత వింతగానే ఉండొచ్చు. పూల కుండీలు, వంకాయలు, బెండకాయలు మిద్దె తోటల్లో కనిపించడం సాధారణం. కొందరు ఆకుకూరలు, సొరకాయలు, పొట్ల కాయలు కూడా పండిస్తున్నారు. కాని వరిని కూడా మిద్దె మీద పండించవచ్చని కేరళ మహిళలు పదేళ్లుగా నిరూపిస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ మూలంగా ఇళ్లకే పరిమితం కావాల్సి రావడం వల్ల ఈ మిద్దె వరి సేద్యం ఇంకా పెరిగింది. కుండీల్లో వరి తిరువంతపురం సమీపంలోని శ్రీకారయంకు చెందిన అంబిక అనే గృహిణి ఐదేళ్ల క్రితం తన టెర్రస్ మీద ప్లాస్టిక్ కుండీల్లో వరి పండించి అందరి దృష్టినీ ఆకర్షించింది. తన మిద్దె మీద మొత్తం 100 ప్లాస్టిక్ కుండీలు పెట్టి వాటిలో సేంద్రియ ఎరువు నింపి, ఒక్కోకుండీలో మూడు నాలుగు వరి మొలకలు నాటి ‘ఉమ’ అనే వరి వంగడాన్ని 110 రోజుల్లో పండించింది. ఆమె తన పైరు ఎదగడానికి బెల్లం, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆకుపచ్చ కసువు, కోడిగుడ్ల సొనలు కలిపి తయారు చేసిన ‘హృదయామృతం’ అనే ద్రావణాన్ని ఉపయోగించింది. చీడ పీడలకు వేప గింజల పొడిని ఉపయోగించింది. మిద్దె ఎక్కితే వంగిన వరి కంకులతో నిండిన పంట కనపడటం ఎంత ఆనందంగా ఉంటుంది. పైగా అది ఇంట్లో రోజూ తినే బియ్యంగా మారినప్పుడు. బాటిళ్లలో వరి ఇది ఇలా ఉంటే కొట్టాయంకు చెందిన సెలెని అనే గృహిణి తన భర్త శామ్ జోసఫ్ సహకారంతో ఇటీవలి కోవిడ్ కాలంలో తన టెర్రస్ మీద ఖాళీ వాటర్ బాటిల్స్‌లో (లీటర్‌వి) వరి పండించి ఆశ్చర్యపరిచింది. వాడి పడేసిన 175 ఖాళీ లీటర్ బాటిల్స్‌ను ఆమె తన వరి సేద్యానికి ఉపయోగించింది. వాటర్ బాటిల్స్‌ను సగానికి కోసి మట్టి, పేడలతో నింపి నీరు ఆరకుండా చూస్తూ వరి పండించింది. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా చక్కగా ఈ బాటిల్స్‌లోనే ఆమె నాలుగు కేజీల వరిని పండించింది. కాలక్షేపానికి కాలక్షేపం... రెండు రోజులకు సరిపడా అయినవే కావచ్చు... కాని మన బియ్యం మనం తిన్నాం కదా అంటుంది. 45 కేజీల పంట కొళ్లాంకు చెందిన సుగంధా దేవి మిద్దె మీద వరి పంట పండించడంలో మేటిగా మారింది. ఆమె ఏకంగా ప్రతి సంవత్సరం 40 కిలోల బియ్యం దిగుబడి వచ్చేలా టెర్రస్ మీద వరి పండిస్తోంది. పదేళ్ల క్రితం మొదలెట్టిన ఈ పనిలో ఇప్పుడు ఆమె నిష్ణాతురాలిగా మారింది. 56 ఏళ్ల సుగంధా దేవి తన ఇంటి మీదే కాక కూతురి ఇంటి మీద కూడా సేద్యం చేస్తోంది. ‘నేను సంవత్సరానికి ఒకసారి, అదీ వర్షాకాలంలో మాత్రమే వరి పండిస్తాను. ఎందుకంటే వరికి తేమ జాస్తిగా కావాలని మనకు తెలుసు. అందుకే జూన్ నుంచి మొదలెట్టి సెప్టెంబర్ మధ్య కాలంలో వరి పండిస్తాను’ అంటోంది సుగంధా దేవి. కేరళలో వ్యవసాయాన్ని, మిద్దె తోటల్ని ప్రోత్సహించేందుకు గ్రామ పంచాయతీల్లో ఎరువు, మట్టి సంచులు అమ్ముతారు సబ్సిడీకి. ప్రతి సంవత్సరం ఈ సంచులు కొని వాటిలోనే వరి పండిస్తుంది సుగంధా దేవి. మిద్దె మీద బల్లలాంటివి ఏర్పాటు చేసి ఆ బల్లల మీద ఈ సంచులను ఉంచి వాటిలోనే వరి నాటి పండిస్తుంది. మిద్దె మీదకు వెళితే దట్టంగా ఎదిగిన వరి కనిపిస్తుంది. ‘120 రోజుల్లో 45 కిలోల వరి పండిస్తాను’ అంటుందామె. మిగిలిన కాలంలో ఆమె తన మిద్దె మీద, కూతురి మిద్దె మీద కూరగాయలు పండిస్తోంది. ‘నేను నా చిన్నప్పటి నుంచి పంట చేలలో పని చేశాను. ఆ అనుభవం వృధా పోలేదు. ఇప్పుడు నేను, నా కూతురి కుటుంబం కల్తీ లేని భోజనం చేస్తున్నాం. ఈ కరోనా కాలంలో మేము ఆరోగ్యం గా ఉన్నామంటే మేము పండించుకునేది తినడం వల్లే’ అంటోందామె. మట్టి, కలప రజను, పేడను సమ పాళ్లలో కలిపిన మిశ్రమాన్ని ఆమె వరి పండించడానికి వాడుతుంది. పంటకు తేమ పోకుండా ఉండటానికి రోజుకి రెండుసార్లు నీరు స్ప్రే చేస్తుంది. మూడు నాలుగు రోజులకు ఒకసారి వేప నూనెను క్రిమి సంహారకంగా ఉపయోగిస్తుంది. ‘మా బియ్యం ఎవరికీ అమ్మం. కాని ఒక కేజీ రెండు కేజీలైనా ఇమ్మని వారూ వీరూ అడుగుతుంటారు. ఒక్కోసారి ఇస్తాం’ అంటుందామె గర్వంగా. సుగంధాదేవికి ఇటీవలే ఆమె ఊరి పంచాయతీ ‘ఉత్తమ రైతు’ పురస్కారం ఇచ్చింది. ఒకప్పుడు వడియాలు, బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే టెర్రస్‌ను ఉపయోగించే మహిళలు ఇవాళ ఆ చోటును ఆకుపచ్చగా మారుస్తున్నారు. వరినే మిద్దెకు ఎక్కిస్తున్నారు. శభాష్. చదవండి: Guntur: భారీ స్ప్రేయర్.. 10 గంటల్లో 100 ఎకరాలు పూర్తి.. పెట్రోలు ఖర్చు రూ. 300 లోపే -
‘ఐ లవ్యూ’.. భర్త రావడం చూసి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకిన భార్య
న్యూఢిల్లీ: భర్త ఇంటికి రావడం చూసి ఓ భార్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ముఖర్జీ నగర్‌లోని నిరంకారి కాలనీలోని ఒక అపార్ట్మెంట్ భవనంలో 52 ఏళ్ల నేహ, ఆమె భర్త ధరమ్ వర్మ నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా ప్రస్తుతం వాళ్లిద్దరు అమెరికాలో నివసిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు విడిపోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేహ బయటకు వెళ్లిన తన భర్తకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పెట్టింది. అతను ఇంటికి తిరిగి వస్తుండగా చూసి అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తుపై నుంచి కిందకు దూకింది. వైద్యం కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా తీవ్రంగా గాయపడడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనంతా సీసీ కెమెరాలో రికార్డయింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని, మహిళ మొబైల్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. యూఎస్‌లో ఉన్న ఆమె కుమారుడు, కుమార్తె ఢిల్లీకి చేరుకున్న తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం జరపనున్నట్లు తెలిపారు. -
మిద్దె తోటల సాగుపై 54 వాట్సప్ గ్రూప్‌లు
ప్రకృతి/ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు, మిద్దె తోటల సాగుపై నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఊపందుకుంటున్నది. మిద్దె తోటల నిర్మాణంపై మౌలిక అవగాహన కల్పించడంతోపాటు రోజువారీ నిర్వహణ, చీడపీడల సమస్యలపై సందేహాలు తీర్చుకునేందుకు మాటసాయం కల్పిస్తే సేంద్రియ ఆహారాన్ని ఉన్నంతలో స్వయంగా పండించుకోవటం నేర్చుకునే పట్టణ ప్రాంతీయులకు మేలు జరుగుతుంది. ఈ లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని 46 జిల్లాలు, దేశంలోని ఆరు మెట్రో నగరాలలో నివాసం ఉండే తెలుగు వారి సౌకర్యార్థం మిద్దె తోటల నిపుణుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి జిల్లాకూ ఒక గ్రూపు ఏర్పాటైంది. కృష్ణా జిల్లాకు రెండు గ్రూపులు అదనంగా ఏర్పాటు చేసినట్లు తుమ్మేటి తెలిపారు. ఏ జిల్లాలో నివాసం ఉండే వారు ఆ జిల్లా వాట్సప్ గ్రూపులో చేరవచ్చు. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగు తప్ప ఇతర విషయాలకు ఈ గ్రూపులలో తావుండదు. ప్రభుత్వాల నుంచి, స్థానిక సంస్థల నుంచి రాయితీలు పొందడానికి సమష్టి గొంతుకను వినిపించడానికీ ఈ గ్రూపులు వేదికగా ఉపకరిస్తాయి. ఫేస్‌బుక్‌లోని తన వాల్‌పై అన్ని జిల్లాల గ్రూపు అడ్మిన్ల నంబర్లను తుమ్మేటి పేర్కొన్నారు. https://facebook.com/ragotamareddy.tummeti చాలా గ్రూపులకు రఘు అడ్మిన్‌గా ఉన్నారు. ఆయన మొబైల్ నంబరు 90001 84107. గ్రూపులో చేరే ఆసక్తిగల వారు ఏ జిల్లావారైనా ఆయనను వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు. -
Terrace Garden: ఎవరికి వారు పండించుకొని తినాలి!
‘‘డబ్బు సంపాయించుకుంటే చాలు ఆహారం కొనుక్కొని తింటే సరిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ప్రజల్లో ఈ ధోరణి పాతుకుపోయింది. ఈ కారణంగానే మార్కెట్లో అమ్మే కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఎక్కువ మోతాదులో వాడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అవకాశం ఉన్న వారంతా తమ ఇళ్లపైన, పెరట్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకోవటమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ఈ పని నేను చేస్తూ ఇతరులకూ చెప్పాలనుకున్నాను. మూడేళ్ల క్రితం కొత్త పక్కా భవనం నిర్మించుకునేటప్పుడే మిద్దె తోటలకు తగిన (వాటర్ ఫ్రూఫింగ్, సిమెంటు తొట్లు నిర్మించటం..) ఏర్పాట్లు చేసుకున్నాను.. ’’ అంటున్నారు కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి. నల్లగొండ జిల్లా నకరేకల్‌లో స్వగృహంలో తమ ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్న విద్యాసాగర్ రెడ్డి, కోకిల దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. సేంద్రియ ఇంటిపంటల సాగుపై చాలా మక్కువ. 2 వేల చదరపు గజాల టెర్రస్‌పై గత మూడేళ్లుగా ఇంటిపంటలు పండించుకొని తింటున్నారు. ఆకుకూరలు కొనటం లేదు. పాలకూర, బచ్చలికూర, పొన్నగంటి, మునగ వంటి ఐదారు రకాలు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. దొండ, బీర, వంకాయలు వంటి కనీసం మూడు, నాలుగు రకాల కూరగాయలతోపాటు పచ్చిమిర్చి ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి. టమాటో, బెండ, గోకర (గోరుచిక్కుడు).. వంటివి ఇప్పుడు విత్తబోతున్నారు. ప్రణాళికాబద్ధంగా పంటలు దఫ దఫాలుగా విత్తుకోవటం/నాటుతున్నారు. పోషకాల లోపం రాకుండా, చీడపీడల బెడద తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసి, మొక్కలకు అప్పుడప్పుడూ వేస్తుంటారు. మడుల్లో మట్టిని వేసవిలో తీసి.. పశువుల ఎరువు, కొబ్బరి పొట్టు, జీవన ఎరువులు కలుపుతారు. సేంద్రియ పద్ధతుల్లో పండించుకునే ఇంటిపంటలకు చీడపీడలు రాకుండా ముందే∙జాగ్రత్తపడాలంటారు విద్యాసాగర్‌రెడ్డి. నిత్యం మొక్కలను గమనిస్తూ ఉండాలి. పసుపు నీళ్లు, వేపాకు రసం/కషాయం, మిగిలిపోయిన వంట నూనె, వెల్లుల్లి రసం, పుల్లటి మజ్జిగ, పచ్చిమిర్చి రసం వంటి ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు. అన్ని పట్టణాల్లో సబ్సిడీ ఇవ్వాలి మిద్దె తోటల్లో దేశవాళీ విత్తనాలు వాడితేనే రుచి బాగుంటుందని ఆయన అంటారు. పిల్లలు, పెద్దలు మిద్దె తోటల పనుల్లో నిమగ్నం కావటం వల్ల టీవీ, ఫోన్ల వాడకం తగ్గిందన్నారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేస్తున్నారు. డ్రమ్ముల్లో పట్టి ఉంచి మొక్కలకు పోస్తుండటం, ఇంట్లో ఏసీ పెట్టుకోకపోవడం విశేషం. ప్రతి నగరం, పట్టణంలో మిద్దె తోటల సాగుకు అవసరమైన సామగ్రి, పరికరాలు, సంప్రదాయ విత్తనాలను సబ్సిడీపై అందుబాటులోకి తెస్తే మరింత మంది ఇంటి పంపటలు సాగు చేసుకోగలుగుతారని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విద్యాసాగర్‌రెడ్డి (98498 21212) ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. -
పండంటి పొదరిల్లు.. ఎంత బాగుందో!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మనకు కావాల్సిన పళ్లు, కూరగాయలను మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. కానీ అవన్నీ మన ఇంటి వద్దే పండించుకుంటే.. ఆ ఆనందమే వేరు కదా. ఓ మాజీ సైనికుడు అదే చేస్తున్నాడు. డాబా పైనే రకరకాల పండ్లను పండిస్తూ తన ఇంటినే ఓ పండ్ల తోటల వనంగా మార్చేశాడు. ఆ మొక్కలకు వర్మీ కంపోస్ట్ ఎరువునే వినియోగిస్తూ పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని కాపాడటంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆన్లైన్ నుంచి మొక్కల కొనుగోలు విశాఖ జిల్లా కొత్తపాలెం దుర్గానగర్‌కు చెందిన పూజారి శ్రీనివాసరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. 2017లో రిటైర్డ్ అయిన ఆయన ప్రస్తుతం ఆర్సీసీవీఎల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు మొక్కల పెంపకంపై మక్కువ. మరీ ముఖ్యంగా పండ్ల తోటలు పెంచడం అంటే చాలా ఇష్టం. ముందుగా 2018 నుంచి ఇంటి చుట్టూ పూల మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆన్లైన్ నుంచి మొక్కలు తెప్పించి మేడపై పెంచడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు పలు రకాల పండ్ల మొక్కలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఫైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, తీపి బత్తాయి, ద్రాక్ష, మిరియాలు, లిచి, మామిడి, దొండ, అరటి చెట్లు, తైవాన్ జామ తదితర మొక్కలతో పాటు, బోన్సాయ్ మొక్కలనూ పెంచుతున్నారు. ఇంట్లోనే వర్మీ కంపోస్ట్ తయారీ.. పాడైపోయిన ప్లాస్టిక్ బకెట్లను మొక్కల పెంపకానికి అనువుగా తీర్చిదిద్దడం విశేషం. మొక్కలకు వర్మీ కంపోస్టునే ఎరువుగా వినియోగిస్తున్నారు. పొడి వ్యర్థాలను మాత్రమే జీవీఎంసీ సిబ్బందికి ఇచ్చేసి తడి వ్యర్థాల సాయంతో ఇంట్లోనే వర్మీ కంపోస్టును తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు శ్రీనివాసరావు ఇల్లు పచ్చదనంతో కళకళలాడిపోతోంది. ఎంతో ఆనందంగా ఉంది.. మా ఇంటి మేడపైనే పండ్ల మొక్కలు పెంచడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటిల్లిపాదీ తినగా మిగిలిన పండ్లను స్నేహితులు, బంధువులకు ఇస్తుంటాను. తెలంగాణకు చెందిన ఓ స్నేహితుడి వద్ద వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయడం నేర్చుకుని మరీ మొక్కలకు వినియోగిస్తున్నాను. – పూజారి శ్రీనివాసరావు, కొత్తపాలెం దుర్గానగర్, విశాఖ జిల్లా -
మిద్దె తోటల మాధవి.. ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో
తోటపని ఆందోళనను దూరం చేస్తుంది.తోటపని ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తోటపని ఏకాగ్రతకు దారి చూపుతుంది.తోటపని ఆరోగ్యాన్నిఇస్తుంది.తోటపని సంతృప్తినీ, సంతోషాన్నీ మూట గట్టి ఇస్తుంది. విశాఖపట్నం వాసి మాధవి గుత్తికొండ పదేళ్లుగా చేస్తున్న డాబాగార్డెన్ ఐదేళ్లుగా ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో యూ ట్యూబ్ ద్వారా కూరగాయల పెంపకాన్నీ ప్రోత్సహిస్తోంది. లక్షలాది వ్యూవర్స్‌కి తనదైన వాణీ వినిపిస్తోంది. ఇంటికి అవసరమైన కూరగాయల సాగును సొంతంగా తామే ఎలా సాగు చేసుకోవచ్చో చిన్న చిన్న సూచనల ద్వారా వ్యూవర్స్‌ని ఆకట్టుకుంటోంది మాధవి గుత్తికొండ. సాగులో మెలకువలను చెబుతూ నెటిజనులను ప్రోత్సహిస్తున్న మాధవి తాను చేస్తున్న పని గురించి చెబుతూ... ‘‘తోటపని నాకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిరుచి. కుండీల్లో మొక్కలు పెంచేదాన్ని. ఇండోర్, ఔట్‌డోర్ డెకొరేటివ్ మొక్కల పెంపకాన్ని ఇష్టంగా చేసేదాన్ని. పెళ్లి, పిల్లల బాధ్యతల నడుమ రోజులు గడుస్తున్నప్పటికీ మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదు. పదేళ్ల కిందట సొంతంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగుచేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలకు వెళుతున్నారు. నాకు కాస్త తీరిక దొరికింది. దీంతో మేడ పైన కూడా మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకం చేసేదాన్ని. ఒత్తిడి నుంచి విశ్రాంతి వైపు.. పిల్లలు మేడ పైన చదువుకునేటప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనీ నాతోపాటు వాళ్లూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్ మా పిల్లలు, వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూ ట్యూబ్‌లో గార్డెన్‌కి సంబంధించిన ఛానెల్స్ సెర్చ్ చేశాను. తెలుగులో ఏవీ కనిపించలేదు. దాంతో నేనే చానెల్ మొదలుపెట్టాను. ఫోన్‌తోనే షూట్.. ఏ సీజన్లో ఏ విత్తనాలు, మట్టి రకాలు, ఎరువు, నీళ్లు ఎంతలా పెట్టాలి.. ఇలా అన్ని సూచనలతో ఫోన్లోనే గార్డెనింగ్‌కు సంబంధించిన వన్నీ షూట్ చేస్తుంటాను. తీసిన వీడియోలను మొదట్లో పిల్లలే ఎడిట్ చేసేవారు. ఇప్పుడు నేనే స్వయంగా ఛానెల్ వర్క్ కూడా చేస్తున్నాను. కాలక్షేపం... పేరు, ఆనందం టైమ్ పాస్‌కు మొదలుపెట్టిన ఈ తోట పని ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పిల్లలు కూడా కాస్త టైమ్ దొరికితే చాలు తోట పనిలోకి వచ్చేస్తున్నారు. మేం బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా, వాటిని తీసుకురావడం మొదలైంది. బంగాళదుంప.. పసుపు నేను ప్రయత్నించని సాగు అంటూ లేదు. బీర, సొరకాయలు, పచ్చిమిరప నాలుగైదు రకాలు, టొమాటో నాలుగు రకాలు, మునగ.. బంగాళదుంపల సాగు కూడా చేశాను. వెల్లుల్లి ట్రై చేశాను. పసుపు కొమ్ములూ పండించాను. అరటిమొక్కలు పెంచుతున్నాం. వీటి పనిలో సాయంగా ఉండటానికి ఒక హెల్పర్‌ని పెట్టుకున్నాను. ఘనమైన రుచి.. ఆరోగ్యం.. ఖర్చు గురించి ఆలోచన లేదు. ఎందుకంటే, ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. మా అవసరాలకు మించిన కూరగాయలను చుట్టుపక్కలవాళ్లకు, బంధువులకు కూడా పంపిస్తుంటాను. కాలానుగుణంగా మూడు నెలలకు ఒకసారి పంటసాగు పని ఉంటుంది. ఇప్పటికి నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ముందు నుంచీ ఛానెల్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయినవారున్నారు. కొత్తగా జాయినైనవారున్నారు. మా ఛానెల్ ద్వారా మిద్దె తోట గురించి తెలిసినవారు, సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లు కూడా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని మాకు పంపించేవారు, లేదా ఆ వీడియోలు షేర్ చేసేవారు ఉంటారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. కొంతమందైనా స్ఫూర్తిగా తీసుకొని కూరగాయల సాగు చేయడం సంతోషాన్ని ఇస్తుంటుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆ ఆనందం తెలియదు. ఇప్పుడు మా ఇంటిపైన కాసే కూరగాయలతో వంటలు కూడా చేసి, వాటిని పోస్ట్ చేస్తుంటాను. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంతో ఇంతో ఆదాయమూ వస్తోంది’’ అని ఆనందంగా వివరించారు మిద్దె తోటల మాధవి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు
భోపాల్ : ప్రపంచంలోని ఒకప్పటి ఏడు వింతల్లో బాబిలోనియాలోని హ్యాంగింగ్ గార్డెన్స్ గురించి విన్నాం. అచ్చంగా అలాంటిది కాదు, కానీ... ఇప్పుడు మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఒక వేళ్లాడే తోటను చూస్తున్నాం. సాక్షి భరద్వాజ్ ఇంటి మీద వేళ్లాడే ఈ తోటలో నాలుగు వందల యాభై రకాల మొక్కలున్నాయి. దేశీయ విదేశీ మొక్కలన్నీ కలిపి మొత్తం నాలుగు వేలున్నాయి. మైక్రో బయాలజీ చదివి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సాక్షి... స్టూడెంట్స్‌కి చెప్పబోయే పాఠాలను ప్రయోగాత్మకంగా తన ఇంటి ఆవరణలోనే పెంచి చూసేది. అది చివరికి ఒక తోటగా మారింది. నేల మీద కుండీలు, సిమెంట్ తొట్టెల్లో పెంచుతుంటే... మొక్కలకు ఎరువుగా వేసిన బత్తాయి, కమలా తొక్కలను తినడానికి వచ్చిన చీమలు మొక్కల వేళ్లను కూడా తినేస్తున్నాయి. ఈ చీమల బెడదను తప్పించి మొక్కలను కాపాడడానికి ఆమె చేసిన మరో ప్రయోగమే ఖాళీ కొబ్బరి బోండాల్లో మొక్కలను పెంచడం. అది విజయవంతమైంది. అలా ఆమె ఇంటి మీద వేళ్లాడే తోట ఆవిష్కారమైంది. పాఠాల తోట సాక్షి భరద్వాజ్ మైక్రోబయాలజీ పూర్తి చేసి రెండేళ్ల కిందట మన్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరింది. మొక్కల జన్యుకణాల గురించి థియరీ చెప్పి ఊరుకోవడం కాదు, దానిని ఆచరణలో చూపించాలనుకుంది. అంటుకట్టడం, బత్తాయి వంటి పుల్లటి పండ్లతొక్కల నుంచి బయో ఎంజైమ్‌ల తయారీ, వేప– బొప్పాయి ఆకులతో వర్మీ కంపోస్టు తయారీ వంటివన్నీ స్వయంగా చేసి చూసుకుంది.‘‘మొదటగా సిమెంట్ తొట్టెల్లో చేసిన ప్రయోగం ఎర్ర చీమల కారణంగా విఫలమైంది. ప్రత్యామ్నాయం ఏమిటా... అని ఆలోచిస్తున్న సమయంలో కొబ్బరి బోండాం గుర్తుకు వచ్చింది. నాకు రోజూ కొబ్బరి బోండా తాగే అలవాటుంది. ఖాళీ బోండాలనే మొక్కల పాదుల్లా మలుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది అన్నారు. (చదవండి: మూడు దశాబ్దాలుగా పీడిస్తున్న పీడకల) ‘‘దాంతో బోండాలను కడిగి ఆరబెట్టి, రెండు రంధ్రాలు చేసి ఇనుప తీగె కట్టి, వరండా పైకప్పుకి హుక్కులు వేయించి కొబ్బరి బోండాలను వేళ్లాడదీసి చూశాను. కొబ్బరి బోండాంలోని సహజమైన పోషకాలు కూడా మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అప్పటి నుంచి చీమల బెడద మాత్రమే కాదు తెగుళ్ల బాధ కూడా లేదు. ప్రయత్నం సఫలమైన తర్వాత కొబ్బరి బోండాలు ఆకర్షణీయంగా కనిపించడానికి రంగులు కూడా వేశాను. అలాగే వాడిపారేసిన మంచినీళ్ల సీసాల అడుగు తీసేసి అందులోనూ మొక్కలను నాటాను. ఇప్పుడు నా దగ్గర నాకిష్టమైన మాన్స్టెరా ఎదామ్సోనాయ్ ఇండోనేసియా నుంచి తెప్పించిన అరుదైన ఫిలోడెండ్రాన్ కూడా ఉంది. మొక్కల పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. నా తోట పాఠ్య పుస్తకానికి జీవరూపం’’ అన్నారు సాక్షి భరద్వాజ్. -
మయూరంలా...
లాక్డౌన్ టైమ్‌లో టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టారు సమంత. వంట చేయడం నేర్చుకుంటున్నారు. అలాగే కొంత సమయాన్ని యోగాకి కేటాయిస్తున్నారు. యోగాసనాల్లో చాలా క్లిష్టమైన ‘మయూరాసనం’, ‘శీర్షాసనం’ వేశారామె. ఆ ఫొటోలను షేర్ చేశారు సమంత. ‘‘నేను, నాగచైతన్య (సమంత భర్త) కలిసి యోగా చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు సమంత. -
హ్యాపీ గార్డెనింగ్
‘‘నా తొలి పంట నా చేతికి వచ్చింది’’ అని సంబరపడిపోతున్నారు సమంత. ఇటీవల ఆమె టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘క్యాబేజ్ మైక్రోగ్రీన్స్’ని పండించారు. మైక్రోగ్రీన్స్ అంటే సూక్ష్మ మొక్కలు అని అర్థం. రెగ్యులర్ క్యాబేజ్కన్నా ఈ మైక్రోగ్రీన్స్‌లో పోషకాలు ఎక్కువ. ఇక ట్రేల్లో పండించిన క్యాబేజీ ఫొటోను షేర్ చేసి, ‘ఒకవేళ మీకు గార్డెనింగ్ మీద ఆసక్తి ఉంటే.. క్యాబేజీ మైక్రోగ్రీన్స్‌ని ఎలా పండించాలో’ నేను చెబుతా అన్నారు సమంత. చక్కగా స్టెప్ బై స్టెప్ చెప్పారామె. ‘‘ఈ పంటకు మీకు కావాల్సిందల్లా ఒక ట్రే, కోకోపీట్ (కొబ్బరి పొట్ట ఎరువు), విత్తనాలు, చల్లని గది.. అంతే. నా బెడ్రూమ్ కిటికీ సూర్యరశ్మి పాక్షికంగా వస్తుంది. ఒకవేళ ట్రైకి తగినంత సూర్య రశ్మి రాకపోతే దానికి దగ్గరగా ఒక బెడ్ ల్యాంప్ ఉంచవచ్చు. ఇక పంట ఎలా వేయాలంటే.. 1. ట్రేని కోకోపీట్‌తో నింపాలి. 2.విత్తనాలు చల్లండి 3.కోకోపీట్ మొత్తం తడిచేవరకూ నీళ్లు చల్లి, ఆ తర్వాత ట్రేని కవర్ చేయండి. కిటికీకి దగ్గరగా ఇంట్లో చల్లని ప్రాంతంలో ఈ ట్రేని ఉంచండి. సూర్యరశ్మి తక్కువగా ఉందనిపిస్తే.. బెడ్‌సైడ్ ల్యాంప్ ట్రే దగ్గర ఉంచండి. నేను అలానే చేశాను. నాలుగు రోజులు ట్రే కదిలించకుండా అలానే ఉండనివ్వండి. ప్రతి రోజూ మీరు గమనిస్తే మొలకలు కనబడతాయి. ఐదో రోజు ట్రే మీద ఉన్న కవర్ తీసి, రోజుకోసారి నీళ్లు చల్లండి. ఎనిమిదో రోజుకల్లా మీ మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోతాయి’’ అని మొత్తం వివరించి, ‘హ్యాపీ గార్డెనింగ్’ అన్నారు సమంత. -
హ్యాపీ ప్లేస్
సుకుమారి సమంత తన సున్నితమైన వేళ్లతో చక్కగా మట్టిలో విత్తనాలను నాటుతున్నారు. ఇది ఏ సినిమాలోని పాత్ర కోసమో కాదు.. నిజ జీవితంలోనే. ఇంతకీ విషయం ఏంటంటే...సమంత తన ఇంటి టెర్రస్‌పై ఓ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు. ‘‘హ్యాపీ ప్లేస్. ఇలా మట్టిలో విత్తనాలు నాటడం నా హృదయాన్ని సంతోషంతో నింపివేసింది. మా టెర్రస్‌పై గార్డెనింగ్ చేయడానికి సాయం చేసినవారికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు సమంత. -
ఇంట్లో పెళ్లి.. డాబాపై రిసెప్షన్
లాలాపేట: పెళ్లి కుమారుడు వంశీకృష్ణ గ్రూప్–1 అధికారి, పెళ్లి కూతురు హర్షవర్థిని గ్రూప్–2 ఆఫీసర్. వీరిద్దరి వివాహం శుక్రవారం తార్నాక విజయపురి కాలనీలోని వధువు నివాసంలో ఇరు కుటుంబాలు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఇంట్లో పెళ్లి జరిగిన అనంతరం ఇంటి డాబాపై రిసెప్షన్ వేడుకలను నిర్వహించారు. వధూవరులను కలిసే వారు తప్పకుండా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు హాజరైన కొద్దిమంది సన్నిహితులు ముఖానికి మాస్కులు ధరించారు. దీనికి తోడు పెళ్లికి హాజరైన వారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు.గంటగంటకు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. (ఇక వేసవిలో మూడు ముహూర్తాలే..) మాస్కులు ధరించి పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు -
లాక్డౌన్ : వినూత్నంగా బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి..
న్యూఢిల్లీ : బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 2 విజేత అశుతోష్ కౌశిక్ ఓ ఇంటివాడయ్యాడు. అలీఘర్కు చెందిన అర్పితను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. నోయిడాలోని అశుతోష్ ఇంటి టెర్రస్‌పై జరిగిన ఈ పెళ్లికి పురోహితుడు కాకుండా కేవలం నలుగురు అతిథులు మాత్రమే హాజరయ్యారు. వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అశుతోష్ తన ఫేస్బుక్లో షేర్ చేశారు. తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా అయిన డబ్బులను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు అశుతోష్ తెలిపారు. అయితే ఆ మొత్తం ఎంత అన్నది అతను వెల్లడించలేదు. అలాగే తన యూట్యూబ్ చానల్ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా చారిటీకి ఇవ్వనున్నట్టు చెప్పారు. టెలివిజన్ రియాలిటీ షో స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశుతోష్.. రోడిస్ సీజన్ 5, బిగ్‌బాస్ సీజన్ 2 టైటిల్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా తాను కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. పెళ్లి అనేది వ్యక్తిగత అంశమని.. దానికి పెద్ద సంఖ్యలో జనాలు, మ్యూజిక్, డ్యాన్స్‌లు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కొందరు పెళ్లిలు చేసుకున్నప్పటికీ.. అతికొద్ది సమక్షంలో నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. చదవండి : 'ఇంకోసారి నోరు జారితే డెడ్‌బాడీ కూడా దొరకదు' చిరు ఎంజాయ్ చేస్తున్న పాట ఇదే.. -
అజ్ఞాతి
ఆ టులెట్ బోర్డు చూడగానే సడన్‌గా తన స్కూటర్ ఆపాడు భాస్కరం. ‘మేడ మీది గది’ అద్దెకు ఇవ్వబడును అనే బోర్డు. ఆ ఆవరణలోకి ప్రవేశించగానే ఆనందపడ్డాడు. కారణం, అది నగరానికి దూరంగా ఉన్న కాలనీ, శబ్ద, వాతావరణ కాలుష్యాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. సమీపంగా సముద్రం. ఆ ఇంటి గేటు దగ్గర నిలబడి ‘‘ఏమండీ!?’’ అని పిలిచాడు. అయిదు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఒక పెద్దావిడ. అరవయ్యేళ్లు దాటి ఉంటాయి అనుకున్నాడు. కళ్ళజోడు సర్దుకొని, ‘‘ఏం కావాలి బాబూ?’’ అంది. ‘‘పై పోర్షన్, అద్దెకు’’ అన్నాడు. ‘‘సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, బ్యాచులర్లకు మాత్రమే సరిపోతుంది’’ అంది. అతడిని పరిశీలనగా చూసి, ‘జుట్టు పల్చబడింది. బహుశా యాభై ఏళ్లు ఉంటాయేమో’’ అనుకుంది ఆవిడ. ‘‘నేను ఒక్కడినే, నాకు సరిపోతుంది’’ అన్నాడు.‘‘సరే, రండి’’ అంటూ మెట్లెక్కి పైకి నడిచింది. ఆవిడ ముందు నడుస్తుంటే ఆమెను అనుసరించాడు. ఆ పోర్షన్పైన టెర్రస్ విశాలంగా ఉంది. పైకి వెళ్లిన భాస్కరానికి ఒక్కసారిగా ఒక శీతలపవనం తాకినట్టయింది. ‘‘అద్దె ఎక్కువయినా ఫరవాలేదు, ఈ ఇల్లు వదులుకోకూడదు’’ అనుకున్నాడు. ఆవిడ తాళం తీసి, లోపలికి రమ్మంది. ఒక విశాలమైన బెడ్రూమ్, దానికి ఆనుకునే కిచెన్. టెర్రస్ మీద వాష్‌రూమ్. అంతే! ఇల్లంతా పరిశీలనగా చూసి ‘‘నేను రేపు వచ్చి చేరుతాను. ప్రసుత్తం మా బ్యాంక్‌వారి అతిథిగృహంలో ఉంటున్నాను. ఈ ఊరొచ్చి పదిరోజులయింది. బదిలీ మీద వచ్చాను. అద్దె, అడ్వాన్స్ ఎంతో చెప్పండి’’ అన్నాడు. ఆమె చెప్పింది. వెంటనే జేబులోంచి డబ్బులు తీసి లెక్కపెట్టి ఆమెకు అందించాడు. తరువాతి రోజు ఉదయం ఒక మినీవేన్లో సామాను తెచ్చాడు భాస్కరం. ఒక పరుçపు, రెండు కుర్చీలు, ఒక గ్యాస్‌స్టవ్, కొన్ని వంటపాత్రలు, ఒక ట్రంకుపెట్టె, నాలుగు అట్టపెట్టెల నిండా పుస్తకాలు. వాటిని సర్ది, వంట చేసుకుని తినేసరికి అలిసిపోయాడు. నిద్ర పట్టేసింది. లేచేటప్పటికీ సాయంత్రం అయింది. అప్పుడే, డోర్‌బెల్ మోగింది. తలుపు తీసేసరికి ఎదురుగా ఇంటి ఓనరు కాఫీ కప్పుతో–‘‘అమ్మా... ఎందుకీ శ్రమ నేను కాచుకుంటాను, నాకు అలవాటే’’ అన్నాడు.‘‘అయ్యో... భోజనం పంపుదామనుకున్నాను. వంటమనిషి సెలవు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉదయమే ఉద్యోగాలకు వెళ్లిపోతారు. నేను, మనవరాలు ఇద్దరమే. తనూ పదిగంటలకు కాలేజీకి వెళ్లిపోతుంది’’ అలా అంటూ, అల్మారాలో అతను చక్కగా సర్దిన నవలలు, వీక్లీల వంక చూసి,‘‘ఓహో.. మీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో తెలుగు కథలు, నవలలు చదివేది నేనొక్కదాన్నే. కనీసం పేపర్ కూడా తెప్పించరు, మా మనవరాలికి అలవాటు చేశాను. తెలుగు మరిచిపోతే ఎలాబాబూ?’’ అంటూ, టీపాయ్ మీద ఉంచి ఫొటో చూసి మాట్లాడటం ఆపింది.‘ఒక ఫ్యామిలీ ఫొటో, ఇతగాడు, భార్య, ఇద్దరబ్బాయిలు’వెంటనే అంది. ‘‘మీ వాళ్లంతా ఎక్కడ?’’ అని.‘‘మా ఆవిడకు హైదరాబాద్‌లో ఉద్యోగం. పిల్లలిద్దరూ ఒకడు బెంగళూరు, ఒకడు ఢిల్లీ, నలుగురం నాలుగు చోట్ల’’ అన్నాడు.‘‘ఓహో తప్పదు కదా...’’ అంటూ ఆల్మరాలోని పుస్తకాలను తిరగేస్తోంది. పావుగంటసేపు పరిశీలించి–‘‘భలే ఉదయ్‌గారి నవలలు ఉన్నాయి. అలాగే ఆయన కథలున్న వీక్లీలు, మీరు ఉదయ్‌గారి అభిమానా?!’’ అంది.‘ఔను’ అన్నట్లు తల ఊపాడు.‘‘మావారు ఉన్నప్పుడు తెచ్చేవారు. ఇప్పుడు తెచ్చేవాళ్ళెవరు? మనవరాలు అన్నీ నెట్లో చదువుతుంది. నాకు చాతకాదు, అయినా చక్కగా పుస్తకం చదవడమే ఇష్టం నాకు, ప్రయాణాలప్పుడు కొనుక్కొని చదువుతాను. మా ఇంట్లో ఒక్క కాగితం ముక్క కనిపించదు’’ అంది నిట్టూర్పు విడుస్తూ.‘‘ఫరవాలేదమ్మా ఈ పుస్తకాలు తీసుకువెళ్ళి చదవండి.’’ ఆ మాటలకు ఆనందపడి కొన్ని నవలలు, వీక్లీలు తీసుకుని ‘‘చాలా సంతోషం, ఉదయ్‌గారి నవలలు, కథలు అంటే మా ‘రోజా’ సంతోషంతో గంతులేస్తుంది. అదే మనవరాలు, నా పేరే పెట్టారు. నాపేరు సరోజ, మనవరాలు ఊళ్లో లేదు, ఎడ్యుకేషనల్ టూర్, రెండు రోజుల్లో వస్తుంది’’ అంటూ అక్కడి నుంచి బయటకు కదలింది. రెండురోజుల తర్వాత సరోజమ్మగారి మనవరాలు రోజా వచ్చింది, ఆ అమ్మాయి నాన్నమ్మకు ఫొటోకాపీ అనుకున్నాడు భాస్కరం. అతన్ని చూసి రెండు చేతులు జోడించి, కాళ్లకు నమస్కారం పెట్టింది.‘‘గాడ్‌బ్లెస్ యూ తల్లీ’’ అని దీవించాడు.‘‘అంకుల్ నానమ్మ చెప్పింది. మీరు ఉదయ్‌గారి కథలు, నవలలు బాగా చదువుతారట, మాకూ అంతే, నానమ్మే ఆయనను నాకు పరిచయం చేసింది. మీ దగ్గర నుంచి తెచ్చినవి చదువుతున్నాను. ఆయన రాసిన కథలలో ‘పాపం, మంచివాడు’ చాలా ఇష్టం’’ అంది.‘‘ఎందుకు ఇష్టం?’’ అనడిగాడు భాస్కరం.‘‘అందరితో మంచివాడనిపించుకుందామని టెన్షన్ పడుతూ, ఆఖరికి అదో వ్యసనమై రోగాల బారిన పడతాడు, ఆఖరికి ఐసీయూలో చేరతాడు. ‘పాపం మంచివాడు’ అని ఎవరో అనగానే హాయిగా ప్రాణం విడుస్తాడు. ఎందుకో ఆ కథ చదివి నాకు ఏడుపొచ్చింది’’ అంది.‘‘ఔను, ఆ కథ నాకూ ఇష్టమే!’’ అన్నాడు.‘‘అలాగే ‘అమ్మ ఓటు’ కథ చాలా ఇష్టం. ఇద్దరు కొడుకులు పంచాయతీ ఎలక్షన్లలో నిలబడితే, వారి తల్లి ఆ ఇద్దరికీ సమానంగా ప్రేమ పంచాలి కనుక ఆ ఇద్దరి గుర్తుల మీద ఓటు వేస్తుంది. ఆ ఓటు చెల్లకపోతేనేం, తల్లి ప్రేమను వెలకట్టింది’’ అంది.‘‘ఔను, మంచికథ’’ అన్నాడు భాస్కరం. ఆమె అల్మరాలో వెదికి, మరికొన్ని పుస్తకాలు పట్టుకెళ్లింది. భాస్కరం ఆ ఇంటికొచ్చి నెలరోజులయింది. ఇంటి అద్దె ఇవ్వడానికి వెళ్లాడు. నానమ్మ, మనవరాలు ఇద్దరూ సాదరంగా ఆహ్వానించారు. మనవరాలు కాఫీకప్పుతో వచ్చింది.‘‘చాలా సంతోషం నాయనా, మీ వల్ల ఉదయ్‌గారి సాహిత్యం చదివేశాము. మీ దగ్గరున్నవి అన్నీ అయిపోయాయి చదవటం’’ అంది పెద్దావిడ.‘‘అన్నీ చదివేశారా?! అంత తొందరగా’’ అన్నాడు భాస్కరం ఆశ్చర్యంగా.‘‘ఇంకాలేవా...మీ దగ్గర?’’ అంది మనవరాలు.‘‘లేవు...ఆయన మళ్లీ కొత్తగా రాయాలి, వాటిని పత్రికలు వేయాలి’’ అన్నాడు నవ్వుతూ.‘‘ఈమధ్య ఆయన ఏమీ రాయడం లేదు, దాదాపు రెండేళ్లయింది. కొత్తగా ఏమీ రాయలేదు’’ అంది రోజా.‘‘ఔను...నాకు తెలుసు’’ అంది సరోజమ్మ.‘‘ఏమో వారినే అడగాలి, ఎందుకు రాయడం లేదో!’’‘‘మాకు తెలీదుగా, అయినా ఉదయ్గారిని ఎవరూ చూసిన వాళ్లు లేరు మాకు తెలిసి’’ అంది పెద్దావిడ భాస్కరం మాటలకు. ‘‘ఔను... కనీసం ఆయన ఫొటో కూడా చూడలేదు’’ అంది మనవరాలు.‘‘నిజమే, ఆయన ఫొటోలు పత్రికలో రావు’’ అన్నాడు భాస్కరం.‘‘మీరు ఉండేది హైదరాబాద్‌లోనే కదా, ఇంతకుముందు మీరు చూశారా? ఆయనను’’ అంది మనవరాలు.‘‘అవును ఆయన ప్రగాఢ అభిమాని, చాలా కష్టపడితే ఒకసారి దొరికారు...’’ అన్నాడు.‘‘మైగాడ్’’ అంది మనవరాలు.భాస్కరం ఇద్దరి వంకా చూశాడు. ఆ ఇద్దరి కళ్లు ప్రకాశవంతంగా మారాయి.అతడి వంక ఆరాధనాపూర్వకంగా చూసి ‘‘ఆయన ఎలా ఉంటారు?’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి.ఒక్కక్షణం ఆలోచించి, ‘‘పొడుగ్గా, దానికి తగ్గ లావు, నెత్తి మీద జుట్టు పలచబడింది’’ అన్నాడు.‘‘అయితే మీలాగే ఉంటారు’’ అంది సరోజమ్మ. ‘‘అవునా...ఏమో’’ అన్నాడు భాస్కరం చిన్నగా నవ్వి.‘‘మీకు పరిచయం ఉంది కదా, ఆయనను కథలు మళ్లీ రాయమని చెప్పండి. ఈ ఊళ్లో ఒక నానమ్మ, మనవరాలు చకోరపక్షుల్లా ఆయన కథల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని చెప్పండి’’ అంది మనవరాలు సీరియస్‌గా. ‘‘మనం ఏం చెయ్యగలం, ఆయన మీద ఒత్తిడి తేలేము కదా, సృజన అనేది అసంకల్పితంగా రావాలి. రాయలేకుండా ఉండలేనప్పుడు రాస్తారు ఉదయ్లాంటి రచయితలు కొందరు. ఆయన ఇంటర్వ్యూలునువ్వు చదవలేదా తల్లీ!’’ అన్నాడు భాస్కరం.‘‘ఆయనే కాదు, ఈమధ్య చాలామంది సీనియర్ రచయితలు అస్త్రసన్యాసం చేశారు. ఇలా రాయని కవులు, రచయితల గురించి సి.నారాయణరెడ్డిగారు ఒక కవిత రాశారు వినిపించనా?’’ అంది ఆ అమ్మాయి.‘‘సరే వినిపించండి’’ అన్నాడు భాస్కరం చిన్నగా నవ్వి. నానమ్మ మురిపెంగా మనవరాలి వంక చూసి, ‘‘చెప్పు’’ అంది. రోజా సెల్ఫోన్లోంచి ఆ కవిత చదవడం మొదలుపెట్టింది.‘ఇంకా ఎందుకు రాస్తున్నావ్?/ రాసింది చాలదా!/ ఈ ప్రశ్నలు విని/దూకే జలపాతం గలగలా నవ్వేసింది/ అకుంఠిత ధారారూపంలోనే కదా/ఆ కవీ, నేనూ జీవిస్తున్నది/ ఆగిపోతే మాకు అస్తిత్వమెక్కడిది/అందాక ఎందుకు?/ ఆడే శ్వాస ఎప్పుడైనా/ విశ్రాంతి కోరుకుంటుందా?/నిద్రలోనైనా కునుకు తీయని అవిశ్రాంత గతి దానిది/ శ్వాసకు విరమణ అంటే మరేమీకాదు మరణమే!/ నిరంతర సృజనశీలి అయిన కవీ అంతే/ నేను అంతే!’‘‘బావుంది కవిత, మీ కోసమైనా ఆయన తిరిగి రాస్తారేమో!’’ అన్నాడు భాస్కరం. ‘‘ఔను రాయాలి, రాయమని గట్టిగా చెప్పండి’’ అంది రోజా. ఆ మాటలకు నవ్వుతూ వారి ఇంట్లోంచి బయటకు నడిచాడు భాస్కరం మూడు నెలల తరువాత ఒక సాయంత్రం పూట కాలేజీ నుంచి రాగానే ఉత్సాహంగా పైకి పరుగెత్తింది రోజా. ‘‘ఉదయ్‌గారి కథ వచ్చిందండోయ్’’ అంటూ ఆ పత్రిక చూపించి కథ పేరు ‘దాతృత్వం’ అంది.‘‘నువ్వు చదివిన తరువాత ఇవ్వమ్మా’’ అన్నాడు భాస్కరం.‘‘చూశారా...ఈ ప్రసిద్ధ వారపత్రిక జన్మదిన సంచికలో వేశారు. మిగతా రచయితల ఫొటోలున్నాయిగానీ ఉదయ్‌గారి ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది’’ అంది. ఆ సమయంలో భాస్కరం వంటగదిలో కాఫీ కలుపుతున్నాడు. రెండు కప్పుల్లో కాఫీ కలిపి, తను ఒక కప్పు తీసుకుని, ఇంకోటి ఆ అమ్మాయికిచ్చాడు. భాస్కరం ఒక్కసారి ఆ అమ్మాయి చుడీదార్, పైజామావంక చూసి–‘‘తల్లీ...ఈ డ్రస్ కోసం నువ్వు షాప్ గురించి, ఎక్కడుందో తెలుసుకుని వెళ్ళావ్, అంతే...నీకు కావలసింది ఆ షాపు చిరునామా, అంతేగానీ, ఆ డ్రస్ తయారుచేసే మాన్యుఫాక్చరింగ్ కంపెనీకాదు, అలాగే ఉదయ్‌గారు రాసిన పత్రిక గురించి తెలుసుకుంటే చాలు, ఆయన వివరాలు అనవసరం కదా! అయినా మనం చేసే పనుల్లో మంచి కనబడాలి మనం కాదు, అలాగే రచయిత రచనలేపాఠకులకుకనబడాలి రచయిత కాదు’’ అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆలోచనలో పడింది.‘మరి రచయితలు, కవులు లైమ్‌లైట్‌లో ఎందుకు ఉండాలనుకుంటారు?! సన్మానాలు, శాలువాలు, ఇవన్నీ దేనికీ?!’’ అంది ఆ అమ్మాయి.‘‘ప్రతిభకు నమ్మకం కలిస్తే ఆ కళాకారుడు విజయం సాధిస్తాడు.తనగొప్పదనాన్ని అందరూ కీర్తించాలని ఆశపడనవసరం లేదు’’ అన్నాడు.‘‘పాపం.. అందరికీసన్మానాలు, పేపర్లలో ఫొటోలు.. ఉదయ్‌గారు అలా అజ్ఞాతంగా ఉండిపోవడం బాధగా ఉంది’’ అంది రోజా.‘‘ఎందుకు బాధ, మీ నాన్నమ్మ, నువ్వు మీలాంటి వారి కోసం రెండు సంవత్సరాల తర్వాత కథ రాశారు. అదే అసలైన పురస్కారం ఆయనకు’’ అన్నాడు.‘‘ఏమో! కన్విన్స్ కాలేకపోతున్నాను’’ ఆమె అలా అంటూ అక్కడి నించి కదిలింది. ఆరోజు శనివారం. బ్యాంకుకు సెలవు. భాస్కరం వంట చేసుకుంటున్నాడు.వాళ్లింట్లో చేసిన తినుబండారం పట్టుకొని పైకి వచ్చింది రోజా. ఆయనకు దాన్ని ఇస్తూ, ‘‘ఈరోజు నానమ్మ, నేను ఉపవాసం, అయినామీ కోసం వంట చేయించాము’’ అంది.‘‘నేను ఉపవాసమే, అయినా నేనూ వండుకుంటున్నాను’’ అన్నాడు చిన్నగా నవ్వి.‘‘అర్థమయింది. ఉదయ్‌గారి అభిమానులు అంతా అంతే కదా, ఆయన రాసిన ‘అర్ధనారీశ్వరం’ కథలో నాయకుడు ఉపవాసం రోజున తను తినేది, యాచకులకు దానం చేస్తాడు. మేమూ అదే పని, మీరూ అంతే కదా!’’ అంది.‘‘ఔను...’’ అన్నాడు భాస్కరం.ఆ మాటలకు క్షణం సేపు ఆగి, ‘‘ఈరోజు ఇంట్లో పెద్ద గొడవ, నాన్న ఏడ్చేశారు’’ అంది రోజా.‘‘దేనికి?’’ అన్నాడు భాస్కరం ఆశ్చర్యంగా ఆమె వంక చూసి.‘‘ఇంతకాలం వంట ఇంటికీ, పిల్లల పెంపకానికీ పరిమితమైపోయాను. నేను ఈ సమాజానికి చేసింది ఏమిటీ...’’ అంటూ మొదలుపెట్టింది నాన్నమ్మ’’ అంది ఆ అమ్మాయి.‘‘మై గాడ్ నిజమా...మీ నాన్నమ్మ ఇలా కూడా ఆలోచిస్తుందా?’’ అన్నాడు ఆశ్చర్యంగా.‘‘అవును...అందుకోసం ఆవిడ ఒక పని చేయడానికి పూనుకుంది, తన మరణానంతరం’’‘అంటే?!’’ ఒక్కసారి విస్మయంగా చూశాడు ఆమె వంక.తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం ఇచ్చేస్తుందట కారణం, ఉదయ్‌గారి కథ దాతృత్వం చదివింది’’ అంది ఆ అమ్మాయి.మాటలకు షాక్ తిన్నట్టుగా చూశాడు భాస్కరం ఆమె వంక. ‘‘ఔను. చనిపోయిన తరువాత ఎందుకూ పనికిరాని దేహాన్ని వైద్యకళాశాల విద్యార్థుల కోసం ఉపయోగించుకోవచ్చు కదా...అలా ఎంతమందో చూసి జ్ఞానవంతులవుతారు. అలా తన జీవితానికో అర్థం ఏర్పడుతుంది’’ అంటూ నానమ్మ గట్టిగా వాదించింది నాన్నతో.‘‘ఇంతకీ ఆయన ఒప్పుకున్నారా?’’‘ఏంచేస్తారు? ఆమె అంత పట్టుదలగా ఉంటే’’ అంది మనవరాలు రోజా.ఆ మాటలకు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు భాస్కరం. మెల్లగా నడుచుకుంటూ బాల్కనీ పిట్టగోడ దగ్గరకు వచ్చాడు. అతని కళ్లనించి మెల్లగా వస్తున్న కన్నీళ్లు. ‘‘రచయితల వలన, వారి రచనల ప్రభావం వలన పాఠకులు మారతారు, అయితే ఒక పాఠకురాలు, రచయితను మార్చింది’’అతను మెల్లగా తనలో తాను అనుకున్న మాటలు ఆమెకు వినపడ్డాయి. ఆమె ఏమీ అర్థం కాలేదు.‘‘ఏమయింది సార్?’’ అంది అతడిని పరిశీలనçగా చూసి.‘‘ఉదయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ దేహానికి పేరు ఒక గుర్తు మాత్రమే. నా పేరు అనే యోచన విడనాడాలి. నేను అనేది నీ దేహం నుండి విడనాడాలి. అదే పునరుత్థానం. అందుకే నా రచనలనే పాఠకులకు చూపుతాను నన్ను కాదు. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తరువాతే, నా ఛాయాచిత్రం కనిపిస్తుంది అన్నాడాయన’’ భాస్కరం ఆకాశం వంక చూస్తూ చెప్పాడు.‘‘ఔను...నేను చదివాను ఆ ఇంటర్వ్యూ’’ అంది రోజా.‘‘ఇప్పుడు ఆయన దేహమూ కనబడదేమో!’’ అన్నాడు భాస్కరం మెల్లగా.‘‘అంటే?’’ ఆమె తెల్లబోతూ అతడివంక చూసింది.‘‘ఆయన రాసిన ‘దాతృత్వం’ కథలో నాయకుడు తన దేహాన్ని దానం చేసినట్టు తనూ చేస్తాడేమో!’’ అన్నాడు భాస్కరం‘‘మీకెలా తెలుసు?!’’ అంది ఆ అమ్మాయి అతడి వంకే రెప్ప వాల్చకుండా చూసి.‘‘ఆయన రచనల వలన ఒక పాఠకురాలు మారితే ఆయన మారడా?!’’ అంటూ గబగబా ఇంట్లోకి నడిచాడు భాస్కరం.ఆలోచిస్తూనే క్రిందకు నడిచింది రోజా. ఆమెలో ఎన్నో ప్రశ్నార్థకాలు. సాయంత్రం గడిచింది. రాత్రయింది. ఆకాశంలో మిణుకుమంటున్న నక్షత్రాలు అక్కడక్కడా! రోజాకు నిద్రపట్టడం లేదు. బయటవరండాలోతిరుగుతోంది. ఏవో ఆలోచనలు.ఉదయ్‌గారు రాసిన కథ పడిన వీక్లీ ఆమె చేతిలో, వెంటనే ఆయన నంబర్ చూసి ఫోన్ చేసింది. అవతల రింగు అవుతున్న శబ్దం, ఆమె సమీపంలోనే వినిపిస్తోంది. ఆ రింగ్‌టోన్ మేడ మీద నుంచి వినిపిస్తోంది. ఆమె వేగంగా పైకి వెళ్లింది గబగబా మెట్లు ఎక్కుతూ. భాస్కరం పడుకున్న బెడ్రూమ్ కిటికీ తెరిచే ఉంది. గుడ్డిగా వెలుగుతున్న బెడ్రూమ్ వెలుగులో కనిపించాడాయన నిద్రపోతూ–పక్కన ఆయన ఫోన్ మోగుతూనే ఉంది. ఆయన ఎత్తడం లేదు. గాఢనిద్రలో ఉన్నట్లు ఆమెకు అర్థమయింది. సందేహ నివృత్తి కోసం ఫోన్ కట్ చేసి, మళ్లీ చేసింది.ఫోన్ మోగుతూనే ఉంది. ఆమెలో ఆశ్చర్యం, ఆనందం... ఒక అద్భుతం చూసిన అనుభూతి.ఇంతలో ‘‘రోజా’’ అనే నానమ్మ కేక వినిపించింది.‘రచయితను మార్చిన పాఠకురాలా వస్తున్నాను’ అంటూ ఆమె మెట్లు దిగడం ప్రారంభించింది.ఆ సమయంలో ఆమెకు తను ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చాయి– ‘రచయిత కన్నీరు కార్చకుండా పాఠకుడి కళ్లల్లో నీరు తెప్పించలేడు. రచయిత ఆశ్చర్యానికి లోను కాకుండా పాఠకుడిని ఆశ్చర్యం కలిగించలేడు.’ - డా. ఎమ్.సుగుణరావు -
రెడ్ జామ టేస్ట్ సూపర్!
ఇంటిపంటల్లో విలక్షణ పండ్ల రకాలను పెంచటంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళినికి ఆసక్తి మెండు. 300 పైచిలుకు కుండీలతో కళకళలాడుతూ ఉండే ఆమె టెర్రస్ కిచెన్ గార్డెన్లో అరుదైన పండ్ల మొక్కల్లో రెడ్ మలేసియన్ జామ ఒకటి. ఈ మొక్కను ఆరేళ్ల క్రితం కొని, అడుగున్నర చుట్టుకొలత, అడుగున్నర ఎత్తు గల సిల్పాలిన్ గ్రోబాగ్‌లో నాటారు. కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు, ఎర్రమట్టిని సమపాళ్లలో కలిపిన మట్టిమిశ్రమంలో మొక్క నాటారు. ఎండు గడ్డిను మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన చేశారు. 15–20 రోజులకోసారి జీవామృతం లేదా కంపోస్టు లేదా పశువుల ఎరువు రెండు గుప్పిళ్లు తప్పకుండా వేస్తూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటారు. చీడపీడల జాడ లేదు. చక్కగా కాస్తున్నది. కాయలో గుజ్జు ఎక్కువ. గింజల సంఖ్య తక్కువే. అవి కూడా మెత్తగా ఉంటాయి. రుచి సూపర్‌గా ఉందని నళిని తెలిపారు. తమ కుటుంబానికి అవసరమైన పండ్లు, కూరగాయలను చాలా వరకూ ఆమె స్వయంగా సాగు చేసుకుంటున్నారు. -
‘ఇంటిపంట’ స్ఫూర్తితో బడిపంట!
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్‌గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం.. ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్‌లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్‌లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు. ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్‌ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు. అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు! మా ఇంటిపంటల రుచి బాగుంది! ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్‌లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా. – షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా.. స్కూల్లో గ్రోబ్యాగ్స్‌లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్‌లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను. – వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది. హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా! మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా. ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు చైతన్యం కోసమే ‘బడిపంట’! సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్‌లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం. షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మిద్దె సాగు.. బహు బాగు
సిటీజనులు మిద్దె సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇళ్ల మిద్దెపై ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. పట్టణ ప్రజలకు పోషకాలున్న కూరగాయలను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉద్యాన శాఖ ప్రవేశపెట్టిన ‘మన ఇల్లు – మన కూరగాయలు’ పథకంతో ఇదంతా సాధ్యమవుతోంది. నగరంలో ఈ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దాదాపు 5వేల ఇళ్ల మిద్దెపై పంటల సాగు జరుగుతోంది. నాంపల్లి: 2010లో రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పర్యవేక్షణలో ఉద్యోగులు వేసిన తొలి అడుగు ఇప్పుడు నగరమంతా విస్తరించింది. ‘మన ఇల్లు – మన కూరగాయలు’ పేరుతో ఉద్యాన శాఖ ప్రవేశపెట్టిన పథకం దినదినాభివృద్ధి చెందింది. గ్రేటర్లో 30 లక్షల ఇళ్లు ఉండగా... దాదాపు 5వేల ఇళ్ల మిద్దెపై ఆకుకూరలు, కూరగాయలు సాగు చేయడం విశేషం. ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కలిసొచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా రైతు కావడం, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథికి వ్యవసాయంపై మక్కువ ఉండడంతో ఈ పథకానికి మరిన్ని సొబగులు అద్దారు. ఈ పథకం కింద పరికరాలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులు సబ్సిడీ కింద అందించడంతో పాటు సాగు విషయంలో నిపుణులతో మెలకువలు అందిస్తున్నారు. సిటీజనులకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. శిక్షణ సైతం... వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించి పంటల సాగు చేయడంపై ఉద్యాన శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన మెలకువలను అందించేందుకు నగరవాసులకు శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే 18 వేల మందికి శిక్షణనిచ్చారు. ప్రతిరోజు ఒక గంట సమయం కేటాయిస్తే మిద్దెపై అద్భుతాలు చేయొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. పొట్లకాయ, గోంగూర, తోటకూర, దోసకాయ, మిర్చి, కాకర, టమాట, వంగ, బెండ, బీరకాయ, మెంతికూర, పాలకూరలతో పాటు ఉల్లి, ఎల్లిగడ్డలు మిద్దెపై పండించుకోవచ్చని తెలిపారు. అదే విధంగా ఇంటి ఆవరణలో స్థలం ఉన్నవారు పండ్ల మొక్కలు పెంచుకోవచ్చని సూచించారు. మేలైన జాతి మొక్క కేవలం రూ.30కే అందజేస్తున్నట్లు చెప్పారు. ఉద్యాన శాఖ పర్యవేక్షణలో 20 లక్షల మొక్కలను 17 నర్సరీల్లో పెంచుతున్నారు. పథకంపై ప్రచారం.. ఈ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది అనూహ్య ఫలితాలు సాధించేందుకు వినూత్న తరహాలో ప్రచారం చేయనుంది. ఇందుకు కళా బృందాల ద్వారా సిటీజనులకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఈ కళా బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే దీనిపై ప్రచారం చేయనున్నాయి. పథకం ప్రయోజనాలు ♦ 50–100 చదరపు అడుగుల వరకు పెరటి స్థలం లేదా బాల్కానీ, ఇంటి పైకప్పు ఉండి నీటి సదుపాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి 200 చదరపు అడుగులు. ♦ ఈ పథకం కింద కూరగాయల సాగుకు కావాల్సిన సిల్పాలిన్ కవర్స్, మట్టి మిశ్రమం, విత్తనాలు, వేప పిండి, వేప నూనె, పనిముట్లను 25 శాతం రాయితీతో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి రెండు యూనిట్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులకు సబ్సిడీ సౌకర్యం కూడా ఉంటుంది. ♦ ఆసక్తి ఉన్నవారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉద్యాన శాఖ కార్యాలయంలో పని దినాల్లో సంప్రదించొచ్చు. లభించే విత్తనాలు.. టమాట, వంగ, బెండ, పొట్ల, కాకర, బీర, దోస, గోరు చిక్కుడు, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యారెట్, ఉల్లి, పాలకూర, మెంతికూర, కొతిమీర, చుక్క కూర, గోంగూర, బచ్చలి, తోటకూర, పుదీనా, ముల్లంగి, ఆలుగడ్డ, బీట్రూట్. పండ్లలో అరటి, ఆపిల్, రేగు, సీతాఫలం, బొప్పాయి తదితర అందజేస్తున్నారు. సద్వినియోగం చేసుకోండి... మిద్దె పంటలతో తాజా ఆకు కూరలు, కూరగాయలు పొందొచ్చు. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిద్దె పంటల సాగుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు కావాల్సిన సలహాలు, సూచనలు, మెలకువలు మేం అందజేస్తాం. – ఎల్.వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్ -
స్కూల్లో డ్యాన్సర్లు.. మండుటెండలో విద్యార్థులు!
సాక్షి, భోపాల్: ఓ పాఠశాలలో స్థానిక నేత డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విద్యార్థులను స్కూలు టెర్రస్ మీద మండుటెండలో కూర్చోబెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలగుచూసింది. ప్రోగ్రామ్‌కు పర్మిషన్ ఇచ్చిన స్కూలు యాజమాన్యంతో పాటు ఇలా పాఠశాలలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించిన నేతపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన తికమ్‌గఢ్‌లో ఓ స్కూల్లో పరీక్షలు జరుగున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే స్మారక ట్రోఫిని ప్రతి ఏడాది నిర్వహించేవారు. ఈ క్రమంలో ఓ స్థానిక నేత స్కూల్లో ఎమ్మెల్యే కప్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు డ్యాన్సర్లను పిలిపించి స్కూలు గ్రౌండ్లో పెద్దగా సౌండ్ సిస్టమ్ పెట్టి మరీ డ్యాన్సులు చేయించారు. ఈ ఫొటోలో పసుపు రంగు చీరలో కనిపిస్తున్న యువతి పాటలకు డ్యాన్స్ చేస్తుండగా మరో యువతి ఆమెతో కలిసి స్టెప్పులేసింది. ఇంతవరకూ బాగానే ఉంది, కానీ స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను పరీక్ష రాయించేందుకు స్కూలు టెర్రస్ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టగా, వాళ్లు మండుటెండలో చెమటలు కక్కుతూ ఎంతో శ్రమపడి పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు చెప్పడం గమనార్హం. -
అత్తను టెర్రస్ మీద నుంచి తోసేసింది..
ఇటాహ్: ఉత్తరప్రదేశ్‌లో ఆస్తి కోసం ఓ కోడలు దాష్టికానికి ఒడిగట్టింది. బంధుత్వాన్ని మరవడమే కాకుండా, వృద్ధురాలు (85) అని కూడా కనికరం లేకుండా కోడలు దారుణంగా ప్రవర్తించింది. ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రర్ చేయలేదన్న అక్కసుతో ...అత్తగారిని టెర్రర్ మీద నుంచి బయటకు తోసేసింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఇంటిని తమ పేరు మీద రాయాలని అత్తను వేధింపులకు గురి చేస్తున్నప్పటికీ, ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఇటాహ్ పోలీసులు వెల్లడించారు. కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ శాడిస్ట్ ఓ మెడికో!
తన ఇంటి టెర్రస్ పై నిలబడి, కుక్కను పిట్టగోడపై నిలబెట్టి, నవ్వుతూ వీడియోకి పోజివ్వడమే కాదు.. దాన్ని మేడపైనుంచి విసిరేసి దారుణంగా ప్రవర్తించిన సదరువ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలోని కుక్కను టెర్రస్ పై నుంచి దూరంగా విసిరేసిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సదరు శాడిస్ట్ ఓ వైద్యవిద్యార్థి! కుక్కను కిందపడేసిన శాడిస్టును చెన్నైకి చెందిన మెడికో గౌతమ్ గా చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇతను చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన తమకు గౌతమ్ స్నేహితుడొకరు ఇచ్చిన సమాచారం కీలకంగా మారిందని పేర్కొన్నారు. బిల్డింగ్ పై నుంచి కుక్కను కిందికి తోసేసిన వీడియో వైరల్ కావడంతో అందులో ఉన్న గౌతమ్ ను అతని క్లాస్ మేట్ గుర్తుపట్టి పోలీసులకు ఉప్పందించడంతో శాడిస్ట్ జాడ తెలిసినట్లయింది. గౌతమ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో చిత్రీకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. చేస్తున్నది రాక్షస క్రీడ అయినా ఎంతో ఆనందంగా నవ్వుతూ గౌతమ్ కెమెరాకు పోజిచ్చిన తీరు అందర్నీ విస్మయపరుస్తోంది. ఆ మూగ జంతువు ప్రాణ భయంతో అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్టో మోషన్ లో వీడియో తీసి ప్రకృతికి విరుద్ధంగా అతడు ప్రవర్తించిన తీరు... చూపరులను అందోళన పరుస్తోంది. ఓ మూగ ప్రాణం పట్ల అతడు చూపించిన కర్కశత్వానికి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలోని శాడిస్టు ఎవరో తెలుసుకొని, తగిన శిక్ష విధించాలని ఫేస్ బుక్ వినియోగదారులతోపాటు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మనుషుల మనోభావాలు, ప్రవర్తన.. ఒక్కోరివీ ఒక్కోలా ఉంటాయి. అయితే అవి ఇతరులకు ఎలాంటి హాని తలపించనివైతే నష్టంలేదు. వారి ప్రవర్తన తేడాగా ఉన్నపుడు మాత్రం సమాజానికి, ఇతరులకు ఎంతో నష్టాన్ని చేస్తుంది. అటువంటి వారిపట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మెడికో గౌతమ్ అదే కోవకు చెందిన వ్యక్తి అని కాదనగలమా!