ప్రజల అవసరాల దృష్ట రోజు రోజుకు కాంక్రీట్ మయంగా మారుతున్నాయి పట్టణాలు. పట్టణ ప్రజలకు సరిపడా కూరగాయలు లభించడం లేదు అని చెప్పవచ్చు. దింతో ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టడంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం...
సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సిద్దిపేటలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దింతో పట్టణంలో బహుళ అంతస్తుల బిల్డింగుల నిర్మాణం కావడంతో, పట్టణం కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పచ్చదనం వైపు అడుగులు వేస్తూ, తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో రోజురోజుకు మిద్దె తోటల పెంపకం కల్చర్ పెరిగిపోతుంది. కరోనా మానవుని జీవితంలో పెను మార్పులకు కారణమయ్యింది. పట్టణ ప్రజలలో తమ ఆరోగ్యాల పై శ్రద్ధ పెరగటంతో, ఫ్రెష్ గా దొరికే కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో కాముని అశోక్, రాజేశ్వరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు , మిద్దె తోటను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అశోక్ ఇల్లు పచ్చని చెట్లతో ఒక పొదరిల్లుగా దర్శనమిస్తుంది. కరోనా సమయంలో యూట్యూబ్ లో చూసి మిద్దె తోటను పెంచడం జరిగిందని కాముని అశోక్ తెలిపారు. ఇండ్లలో పాడైన, పనికిరాని వస్తువుల తో తక్కువ ఖర్చులోనే మిద్దే తోటను ఏర్పాటు చేయడం జరిగిందని అశోక్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్, నూనె క్యాన్లు,పాడైన వస్తువులలో మట్టిని నింపి కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని అశోక్ తెలిపారు. మిద్దె తోటలో పాలకూర, కొత్తిమీర, మెంతం, పుదీనా, చుక్కకూర, తోటకూర, ఎర్ర బచ్చలి, టమాట, వంకాయ, బెండకాయ, మిర్చి, క్యాబేజీ, క్వాలి ఫ్లవర్, వంటి అన్ని రకాల కూరగాయలు పండించడం తో పాటు మునిగే చెట్టు, కరివేపాకు చెట్టు, నిమ్మచెట్టు పెంచడం జరుగుతుందని అశోక్ దంపతులు తెలిపారు.
శ్రీనివాస్ అనే మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిద్దె తోటను పెంచుతున్నారు. తమ మిద్దే తోటలో అన్ని రకాల కూరగాయలు పండించడంతో, తమ ఇంటి అవసరాలకు సరిపోవుగా, ఇరుగుపొరుగు వారి కూడా కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ బడి పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్చ్ బడిలో తయారైన, వర్మి కంపోస్టు ఎరువును కూరగాయల మొక్కలకు వేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, మిద్దె తోటల పెంపకం పై కూడా స్వచ్ఛ బడిలో అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు.
మేమంతా ప్రభుత్వ ఉపాధ్యాయులం కావడంతో, సాయంకాలం వేళ మిద్దె తోటలో ఒక గంటసేపు గడపడంతో స్వచ్ఛమైన గాలితో పాటు ప్రకృతి వనంలో ఉన్నట్టు అనిపిస్తుందని ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. వర్మి కంపోస్ట్ తో పండించిన కూరగాయలు ఫ్రెష్‌గా, ఎంతో రుచికరంగా ఉంటాయని ఆమె అన్నారు. స్వచ్ఛమైన కూరగాయలు తినడంతో తాను 6 నెలలకు ఒక్కసారి కూడా టాబ్లెట్ వాడడం చాలా తక్కువ అని రాజేశ్వరి తెలిపారు. మనసుంటే మార్గం ఉన్నట్లు,పట్టణ ప్రజలు తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కూరగాయ మొక్కలు పెంచుకోవాలని రాజేశ్వరి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment