ఇంటిపంటల్లో విలక్షణ పండ్ల రకాలను పెంచటంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇంటిపంటల సాగుదారు వి.ఎం. నళినికి ఆసక్తి మెండు. 300 పైచిలుకు కుండీలతో కళకళలాడుతూ ఉండే ఆమె టెర్రస్ కిచెన్ గార్డెన్‌లో అరుదైన పండ్ల మొక్కల్లో రెడ్ మలేసియన్ జామ ఒకటి. ఈ మొక్కను ఆరేళ్ల క్రితం కొని, అడుగున్నర చుట్టుకొలత, అడుగున్నర ఎత్తు గల సిల్పాలిన్ గ్రోబాగ్‌లో నాటారు. కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు, ఎర్రమట్టిని సమపాళ్లలో కలిపిన మట్టిమిశ్రమంలో మొక్క నాటారు. ఎండు గడ్డిను మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన చేశారు. 15–20 రోజులకోసారి జీవామృతం లేదా కంపోస్టు లేదా పశువుల ఎరువు రెండు గుప్పిళ్లు తప్పకుండా వేస్తూ పోషకాల లోపం రాకుండా చూసుకుంటారు. చీడపీడల జాడ లేదు. చక్కగా కాస్తున్నది. కాయలో గుజ్జు ఎక్కువ. గింజల సంఖ్య తక్కువే. అవి కూడా మెత్తగా ఉంటాయి. రుచి సూపర్‌గా ఉందని నళిని తెలిపారు. తమ కుటుంబానికి అవసరమైన పండ్లు, కూరగాయలను చాలా వరకూ ఆమె స్వయంగా సాగు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment