ప్రకృతి/ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు, మిద్దె తోటల సాగుపై నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఊపందుకుంటున్నది. మిద్దె తోటల నిర్మాణంపై మౌలిక అవగాహన కల్పించడంతోపాటు రోజువారీ నిర్వహణ, చీడపీడల సమస్యలపై సందేహాలు తీర్చుకునేందుకు మాటసాయం కల్పిస్తే సేంద్రియ ఆహారాన్ని ఉన్నంతలో స్వయంగా పండించుకోవటం నేర్చుకునే పట్టణ ప్రాంతీయులకు మేలు జరుగుతుంది. ఈ లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోని 46 జిల్లాలు, దేశంలోని ఆరు మెట్రో నగరాలలో నివాసం ఉండే తెలుగు వారి సౌకర్యార్థం మిద్దె తోటల నిపుణుడు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటయ్యాయి.
ప్రతి జిల్లాకూ ఒక గ్రూపు ఏర్పాటైంది. కృష్ణా జిల్లాకు రెండు గ్రూపులు అదనంగా ఏర్పాటు చేసినట్లు తుమ్మేటి తెలిపారు. ఏ జిల్లాలో నివాసం ఉండే వారు ఆ జిల్లా వాట్సప్ గ్రూపులో చేరవచ్చు. సేంద్రియ ఇంటిపంటలు, మిద్దెతోటల సాగు తప్ప ఇతర విషయాలకు ఈ గ్రూపులలో తావుండదు. ప్రభుత్వాల నుంచి, స్థానిక సంస్థల నుంచి రాయితీలు పొందడానికి సమష్టి గొంతుకను వినిపించడానికీ ఈ గ్రూపులు వేదికగా ఉపకరిస్తాయి. ఫేస్‌బుక్‌లోని తన వాల్‌పై అన్ని జిల్లాల గ్రూపు అడ్మిన్ల నంబర్లను తుమ్మేటి పేర్కొన్నారు.
https://facebook.com/ragotamareddy.tummeti
చాలా గ్రూపులకు రఘు అడ్మిన్‌గా ఉన్నారు. ఆయన మొబైల్ నంబరు 90001 84107. గ్రూపులో చేరే ఆసక్తిగల వారు ఏ జిల్లావారైనా ఆయనను వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment