
సుకుమారి సమంత తన సున్నితమైన వేళ్లతో చక్కగా మట్టిలో విత్తనాలను నాటుతున్నారు. ఇది ఏ సినిమాలోని పాత్ర కోసమో కాదు.. నిజ జీవితంలోనే. ఇంతకీ విషయం ఏంటంటే...సమంత తన ఇంటి టెర్రస్‌పై ఓ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు. ‘‘హ్యాపీ ప్లేస్. ఇలా మట్టిలో విత్తనాలు నాటడం నా హృదయాన్ని సంతోషంతో నింపివేసింది. మా టెర్రస్‌పై గార్డెనింగ్ చేయడానికి సాయం చేసినవారికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు సమంత.
Comments
Please login to add a commentAdd a comment