
సీసీటీవీ ఫుటేజీ ఘటనలు వైరల్ అవ్వడం షరామాములు అయ్యింది.
వైరల్: సీసీటీవీ ఫుటేజీ ఘటనలు వైరల్ అవ్వడం షరామాములు అయ్యింది. మీడియా కంటే సోషల్ మీడియాలోనే వాటికి క్రేజ్ ఎక్కువగా ఉంటోంది. అందునా రెప్పపాటు ఘటనలు శరవేగంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతుంటాయి కూడా.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి కేరళ మలప్పురంలో జరిగింది. ఓ వ్యక్తి ఇంటిపైన భాగంలో శుభ్రం చేస్తుండగా.. పట్టుతప్పి కిందపడిపోయాడు. ఆ సమయంలో అతని సోదరుడు కింద ఉన్నాడు.
టెర్రెస్ పైనుంచి కింద పడిపోతున్న సోదరుడిని గమనించి.. అతను క్యాచ్ పట్టేశాడు. ఈ ఘటనలో పైనుంచి పడిన వ్యక్తి పైకిలేచి మాములుగా కనిపించగా.. అతని అన్న మాత్రం కాసేపటికి పైకి లేచాడు. ఆ అన్న గమనించకపోయినా.. స్పందించకపోయినా ఆ తమ్ముడికి కచ్చితంగా ఏదో ఒకగాయం అయ్యి ఉండేది. జులై 31న ఈ ఘటన జరిగినట్లు సీసీఫుటేజీ ద్వారా తెలుస్తోంది.
— Vishal Dharm (@VishalDharm1) August 3, 2022