ఇంట్లో పెళ్లి.. డాబాపై రిసెప్షన్‌ | Group 1 Officers Marriage in Home Reception on Terrace in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంట్లో పెళ్లి.. డాబాపై రిసెప్షన్‌

May 30 2020 7:38 AM | Updated on May 30 2020 7:38 AM

Group 1 Officers Marriage in Home Reception on Terrace in Hyderabad - Sakshi

రిసెప్షన్‌ వేడుక

లాలాపేట:  పెళ్లి కుమారుడు వంశీకృష్ణ గ్రూప్‌–1 అధికారి, పెళ్లి కూతురు హర్షవర్థిని గ్రూప్‌–2 ఆఫీసర్‌. వీరిద్దరి వివాహం శుక్రవారం తార్నాక విజయపురి కాలనీలోని వధువు నివాసంలో ఇరు కుటుంబాలు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది. ఇంట్లో పెళ్లి జరిగిన అనంతరం ఇంటి డాబాపై రిసెప్షన్‌ వేడుకలను నిర్వహించారు. వధూవరులను కలిసే వారు తప్పకుండా చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు హాజరైన కొద్దిమంది సన్నిహితులు ముఖానికి మాస్కులు ధరించారు. దీనికి తోడు పెళ్లికి హాజరైన వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేశారు.గంటగంటకు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. (ఇక వేసవిలో మూడు ముహూర్తాలే..)

మాస్కులు ధరించి పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement