కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనను ఉల్లఘించి వివాహం చేసుకున్న దక్షిణాఫ్రికా వధువరులను మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జబులని జులు(48), నొమ్తాండాజో మెక్‌జీ(38)లు ఆదివారం విహహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వధువరులతో సహా కుటుంబ సభ్యులను, బంధువులను సైతం అరెస్టు చేసి తీసుకెళ్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (మరింత కాలం లాక్‌డౌన్: ప్రధాని మోదీ)
కాగా దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కోరలు చాస్తున్నందున అక్కడ లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో బహిరంగ సమావేశాలు, వివాహా వేడుకలు, ఇతరత్రా కార్యక్రమాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో రిచర్డ్స్‌లో వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్థానికుల సమాచారం అందించడంతో పోలీసుల హుటాహుటిన అక్కడి చేరుకున్నారు. నూతన వధువరులతో పాటు పెళ్లికి హజరైనా 50 మంది బంధువులను పోలీసులు అరెస్టు చేసి రిజర్డ్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా సోమవారం వారందరిని కోర్టుకు తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు. అంతేగాక వారిని విచారించిన కోర్టు రూ. 4100(ఇండియన్ కరెన్సీ) జరిమాన విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. (మాస్క్ లేకుంటే అరెస్ట్..)
#CityOfuMhlathuze More than 50 people arrested in a wedding at Nseleni outside Richards Bay today for contravening the #COVID2019 #lockdown regulations @ZOPublications @GCIS_KZN @ecr9495 @ukhozi_fm @eNCA @SAPoliceService @Sandford_Police @SALGA_Gov l pic.twitter.com/NaMagUWpUg
— uMhlathuze (@UmhlathuzeM) April 5, 2020
Comments
Please login to add a commentAdd a comment