స్కూల్లో డ్యాన్సర్లు, పక్కన టెర్రస్‌పై మండుటెండలో విద్యార్థులు
సాక్షి, భోపాల్: ఓ పాఠశాలలో స్థానిక నేత డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విద్యార్థులను స్కూలు టెర్రస్ మీద మండుటెండలో కూర్చోబెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలగుచూసింది. ప్రోగ్రామ్‌కు పర్మిషన్ ఇచ్చిన స్కూలు యాజమాన్యంతో పాటు ఇలా పాఠశాలలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించిన నేతపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన తికమ్‌గఢ్‌లో ఓ స్కూల్లో పరీక్షలు జరుగున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే స్మారక ట్రోఫిని ప్రతి ఏడాది నిర్వహించేవారు. ఈ క్రమంలో ఓ స్థానిక నేత స్కూల్లో ఎమ్మెల్యే కప్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు డ్యాన్సర్లను పిలిపించి స్కూలు గ్రౌండ్‌లో పెద్దగా సౌండ్ సిస్టమ్ పెట్టి మరీ డ్యాన్సులు చేయించారు. ఈ ఫొటోలో పసుపు రంగు చీరలో కనిపిస్తున్న యువతి పాటలకు డ్యాన్స్ చేస్తుండగా మరో యువతి ఆమెతో కలిసి స్టెప్పులేసింది. ఇంతవరకూ బాగానే ఉంది, కానీ స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులను పరీక్ష రాయించేందుకు స్కూలు టెర్రస్ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టగా, వాళ్లు మండుటెండలో చెమటలు కక్కుతూ ఎంతో శ్రమపడి పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment