United States: స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి | Minneapolis Catholic School Shooting: 2 Children Dead, 17 Injured | Sakshi
Sakshi News home page

United States: స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

Aug 28 2025 6:57 AM | Updated on Aug 28 2025 11:50 AM

Shooting at School in us Minneapolis

వాషింగ్టన్‌: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన కలకలం రేపింది.మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్‌లోని ఒక క్యాథలిక్‌ స్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
 

ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు ప్రకటించారు. మినియాపొలిస్‌ పోలీస్‌ చీఫ్‌ బ్రియాన్‌ ఓహారా వెల్లడించిన వివరాల ప్రకారం విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పలు ఆయుధాలతో స్కూలుకు వచ్చిన నిందితుడు కిటికీల గుండా పిల్లలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తరువాత అనంతరం ఆ నిందితుడు కూడా మృతిచెందాడని, అతని వయసు 20 ఏళ్లు ఉండవచ్చన్నారు. ఈ సంఘటనపై మిన్నెసోటా గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.    ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement