పటియాలా: పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూను పటియాలా సెంట్రల్ జైలు నుంచి రాజేంద్ర ఆసుపత్రికి అధికారులు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా జైల్లో సిద్ధూకు స్పెషల్ డైట్ కావాలని ఆయన తరపు లాయర్ కోర్టులో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే వైద్యుల బోర్డు ఆయనకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించింది. ఎలాంటి ఎటువంటి ప్రత్యేక ఆహారం అవసరమో బోర్డు నిర్ణయించనుంది. అనంతరం సంబంధిత నివేదికను స్థానిక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పిస్తుంది. 1988 నాటి రోడ్‌ర్యాడ్ కేసులో ఏడాది జైలుశిక్ష పడిన నేపథ్యంలో.. గత శుక్రవారం పటియాలా కోర్టులో సిద్ధూ లొంగిపోయారు.
చదవండి: జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ
సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment