గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి, మాజీ మోడల్ దివ్యా పహుజా మృతదేహాం లభించింది.హర్యానాలోని పటియాలో భాక్రా కెనాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. భాక్రా కాలువ నుంచి గురుగ్రామ్, తోహ్నా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. ఆమెను గుర్తించేందుకు తన ఫోటోలను పహుజా కుటుంబ సభ్యులకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కాగా జనవరి 1న దివ్యా పహుజా గురుగ్రామ్‌లోని టీ పాయింట్ హోటల్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. యువతిని అయిదుగురు వ్యక్తులు హోటల్ గదిలోకి తీసుకెళ్లడం, అనంతరం హోటల్ యాజమాని మరికొందరు సాయంతో ఆమెను చంపేసి మృతదేహాన్ని లాక్కెళ్లి కారులోకి ఎక్కంచడం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది.
అయితే హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను దివ్య తన వద్ద ఉంచుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్లు తేలింది. వాటిని డిలీట్ చేయాలని కోరినా.. దివ్య అంగీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమెను తలపై కాల్చి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా నిందితుల్లో ఒకరైన బాల్‌రాజ్ గిల్ విదేశాలకు పారిపోతుంటే కలకత్తా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. ఇది హత్య జరిగిన గురుగ్రామ్‌లో 270 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముంబై పోలీసులు దివ్యా పాహుజాతోపాటు ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment