Divya Pahuja
-
Divya Pahuja: ఎట్టకేలకు కాలువలో మృతదేహం లభ్యం
గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి, మాజీ మోడల్ దివ్యా పహుజా మృతదేహాం లభించింది.హర్యానాలోని పటియాలో భాక్రా కెనాలో ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం కనుగొన్నారు. భాక్రా కాలువ నుంచి గురుగ్రామ్, తోహ్నా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. ఆమెను గుర్తించేందుకు తన ఫోటోలను పహుజా కుటుంబ సభ్యులకు పంపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా జనవరి 1న దివ్యా పహుజా గురుగ్రామ్‌లోని టీ పాయింట్ హోటల్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. యువతిని అయిదుగురు వ్యక్తులు హోటల్ గదిలోకి తీసుకెళ్లడం, అనంతరం హోటల్ యాజమాని మరికొందరు సాయంతో ఆమెను చంపేసి మృతదేహాన్ని లాక్కెళ్లి కారులోకి ఎక్కంచడం అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. అయితే హోటల్ ఓనర్ అభిజిత్ సింగ్‌కు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను దివ్య తన వద్ద ఉంచుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసినట్లు తేలింది. వాటిని డిలీట్ చేయాలని కోరినా.. దివ్య అంగీకరించలేదని, ఈ క్రమంలోనే ఆమెను తలపై కాల్చి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. కాగా నిందితుల్లో ఒకరైన బాల్‌రాజ్ గిల్ విదేశాలకు పారిపోతుంటే కలకత్తా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. మృతదేహాన్ని పటియాలాలోని భాక్రా కాలువలో పడేసినట్లు అంగీకరించాడు. ఇది హత్య జరిగిన గురుగ్రామ్‌లో 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ముంబై పోలీసులు దివ్యా పాహుజాతోపాటు ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది. -
గ్యాంగ్‌స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య
గురుగ్రామ్: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్ దివ్యా పహుజాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్ గదిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి ఆమెను హోటల్ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కారులో బయటకు తరలిస్తుండగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గడోలీ హత్య కేసులో నిందితురాలైన దివ్యా పహుజాకు గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉత్తరాదిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ 2016 ఫిబ్రవరి 7న ముంబైలో హత్యకు గురయ్యాడు. నకిలీ ఎన్కౌంటర్లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. గడోలీ ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ వీరేంద్ర కుమార్ అలియాస్ బిందర్ గుజ్జర్ హరియాణా పోలీసులతో చేతులు కలిపి ఈ ఎన్కౌంటర్ చేయించినట్లు వెల్లడయ్యింది. గడోలీని ముంబైకి రప్పించడానికి హరియాణా పోలీసులు అతడి ప్రియురాలు దివ్యా పహుజాను పావుగా వాడుకున్నారు. ఆమె ద్వారా అతడిని హనీట్రాప్ చేశారు. -
Ex-Model Divya Pahuja: గురుగ్రామ్‌లోని హోటల్లో మాజీ మోడల్ దారుణ హత్య
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘోరం జరిగింది. ఓ హోటల్లో గదిలో 27 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలని మాజీ మోడల్ దివ్య పహుజాగా గుర్తించారు. నిందితుడిని సిటీ పాయింట్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్‌గా తేల్చారు. అబిజిత్తోపాటు అతడి హోటల్లో పనిచేసే మరో ఇద్దరు ప్రకాశ్, ఇంద్రజ్లను గురుగ్రామ్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దివ్య హత్యకు స్కెచ్ వేసిన అభిజిత్ ఆమె మృతదేహాన్ని ఎవరికి దొరకకుండా పడేసేదుకు తన ఉద్యోగులకు పది లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. హత్య ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అభిజిత్, యువతి, మరో వ్యక్తి జనవరి రెండో తేదిన హోల్ రిసెప్షన్ వద్దకు రావడం కనిపిస్తుంది. అక్కడి నుంచి రూమ్ నెంబర్111కు వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ రాత్రి అభిజిత్ మరికొంతమంది దివ్య మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి రూమ్ నుంచి బయటకు లాక్కెళ్లడం కనిపిస్తోంది. హోటల్ నుంచి బీఎండబ్ల్యూ కారులో పారిపోవడం రికార్డయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పంజాబ్, ఇతర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2016లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ఎన్కౌంటర్ కేసులో దివ్య పహుజా కూడా ప్రధాన నిందితురాలు. అయితే గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ సోదరి సుదేష్ కటారియా, అతని సోదరుడు బ్రహ్మ ప్రకాష్, అభిజీత్‌తో కలిసి దివ్య హత్యకు కుట్ర పన్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హోటల్ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. కాగా 2016 ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గురుగ్రామ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి గర్ల్‌ఫ్రెండ్ అయిన దివ్య పహుజా.. సందీప్ వివరాలను పోలీసులకు చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దాదాపు ఏడేళ్లపాటు జైలు శిక్షను అనుభవించిన దివ్య.. గతేడాది జూన్‌లో బెయిల్‌పై విడుదలైంది. -
గ్యాంగ్‌స్టర్ అని ఎప్పుడూ చెప్పలేదు
హరియాణా పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలి గ్యాంగ్‌స్టర్ అన్న విషయం అంతకుముందు తనకు తెలియదని అతని గాళ్‌ఫ్రెండ్ దివ్యా పాహుజ చెప్పింది. సందీప్ ఎన్కౌంటర్ కేసులో తనకు సంబంధంలేదని కోర్టులో వెల్లడించింది. గత ఫిబ్రవరిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో ఉన్న సందీప్‌ను గుర్గావ్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ పేరుతో చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో హోటల్ గదిలో దివ్య కూడా ఉందని, సందీప్ వివరాలను ఆమే గుర్గావ్ పోలీసులకు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ముంబై పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తోంది. ముంబై పోలీసులు.. గుర్గావ్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు దివ్యా పాహుజ, ఆమె తల్లి సోనియాను అరెస్ట్ చేశారు. దివ్యను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సందీప్ తన పేరు రిషబ్ అని పరిచయం చేసుకున్నాడని, గ్యాంగ్‌స్టర్ అనే విషయం ఎప్పుడూ చెప్పలేదని దివ్య కోర్టులో చెప్పింది. ఈ కేసులో తన పేరును ఇరికించాక తన జీవితం నాశనమైందని, తన స్నేహితులు దూరమయ్యారని, ఎవరూ మాట్లాడటం లేదని, ఉద్యోగం కోల్పోయానని, జైలు జీవితం అనుభవిస్తున్నానంటూ దివ్య కోర్టులో విలపించింది. ఇద్దరికీ స్నేహితుడైన మనీష్ ద్వారా సందీప్ పరిచయమయ్యాడని, ఓ రోజు ఫోన్ చేస్తే వెళ్లి కలిశానని అంతకుమించి తనకు ఏమీ తెలియదని కోర్టుకు విన్నవించింది. సందీప్ ఉన్న హోటల్ పేరు, గది నెంబర్ పోలీసులకు చెప్పలేదని, అతను వేరే పేరుమీద హోటల్ గది తీసుకున్నాడని, అతను గ్యాంగ్‌స్టర్ అని, నేరచరిత్ర ఉన్నట్టు తనకు ఏమాత్రం తెలియదని దివ్య చెప్పింది. తన వాళ్లు ఎవరూ ఇక్కడలేరని, సాయం చేసేవాళ్లు కూడా లేరని విలపించింది.