![Punjab Patiala Woman Shot Dead Drinking Alcohol Gurudwara - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/15/Punjab-Patiala.jpg.webp?itok=VfW0lLR6)
చండీగఢ్: పంజాబ్ పాటియాలలో షాకింగ్ ఘటన జరిగింది. దుక్నివరణ్ సాహిబ్ గురుద్వారా కాంప్లెక్స్‌లో మద్యం సేవిస్తున్న ఓ మహిళపై అక్కడి సేవాదార్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఐదు రౌండ్లు షూట్ చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
మృతురాలిని పర్మీందర్ కౌర్‌గా గుర్తించారు పోలీసులు. ఆమె వయసు 32 ఏళ్లు. పెళ్లికాలేదు. గురుబక్ష్ కాలనీలో నివాసముంటోంది. ఆదివారం సాయంత్రం గురుద్వారా ఆవరణలో మద్యం సేవించింది. ఈ సమయంలో ఆమెను చూసిన సాగర్ మల్హోత్రా అనే సేవాదార్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో అతనితో ఆమె వాగ్వాదానికి దిగింది. అనంతరం పర్మీందర్ కౌర్‌ను గురుద్వారా మేనేజర్ దగ్గరకు తీసుకెళ్తుండగా.. ఈ సమయంలో అక్కడున్న మరో సేవాదార్ మహిళ తీరుపై ఆగ్రహంతో ఆమెపై కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో సాగర్ మల్హోత్రాకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను రాజేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చదవండి: హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..
Comments
Please login to add a commentAdd a comment