
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో నలుగురు పదో తరగతి విద్యార్థినులు అదృశమయ్యారు. వన్‌టౌన్ సమీపంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ స్కూల్లో వీరంతా చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూల్ పూర్తయిన తర్వాత ట్యూషన్‌కి వెళ్తాం అని చెప్పి.. తిరిగి కనిపించలేదు. కుటుంబ సభ్యులు రాత్రి అంతా గాలించారు. చివరికి గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోలీసులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అదృశ్యమైన నలుగురు విద్యార్థులు తమ గురించి వెతకవద్దని లేఖను కూడా తల్లిదండ్రులను ఉద్దేశించి రాశారు. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో ఉంటారనే వాదన వినిపిస్తుంది. విద్యార్థులు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. లక్ష్మీ, రేణుక, హన్సిక, యమున అనే ఈ నలుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment