ఏకంగా పాఠశాల ఆవరణలోనే విద్యార్థినులతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కేరళలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మలయాళ సీనియర్ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కారులో ఉన్న ఓ వ్యక్తి నగ్నంగా తమవైపు చూస్తూ వెకిలి హావభావాలకు పాల్పడ్డాడని, తమ ఫొటోలను తీసుకున్నాడని కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథిరిపాలెంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.