లక్నో : యువకుల ఎగతాళి మాటలతో భయాందోళనకు గురైన ఇద్దరు కాలేజీ విద్యార్ధినులు రన్నింగ్‌లో ఉన్న బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రన్‌హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధినులు సొంత గ్రామానికి వెళ్లటానికి గురువారం పది గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు ఎక్కారు. బస్సు ముందు సీట్లలో యువకులు కూర్చుని ఉండటంతో వారి వెనకాల సీట్లలో యువతులు కూర్చున్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి.. ఊరు రాగానే బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు. ( ఆమె అలా చేస్తే అత్యాచారం తప్పేది!)
దానికి తోడు ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు ‘‘ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు. ఇక చూడు! భలే సరదా ఉంటుంది’’ అనటం ప్రారంభించారు. దీంతో భయాందోళనకు గురైన యువతులు మరోసారి డ్రైవర్‌ను ప్రాథేయపడుతున్నట్లు అడిగారు. అతడు ఒప్పుకోలేదు. ఆ యువకులు కేకలు వేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు విద్యార్ధినులు ఒకరి తర్వాత ఒకరు బస్సులోనుంచి కిందకు దూకేశారు. ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. బాధిత యువతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే డ్రైవర్ సదరు యువతుల కుటుంబాలతో రాజీ పడటంతో గొడవ సద్దుమణిగింది. ( 'దొంగ' పనిమనిషి అరెస్ట్ )
Comments
Please login to add a commentAdd a comment