VIRAL VIDEO: Tamilnadu Girls Drinking Beers at New Year Party - Sakshi Telugu
Sakshi News home page

వీడియో వైరల్‌.. విద్యార్థినుల బహిష్కరణ

Published Tue, Dec 31 2019 5:03 PM | Last Updated on Thu, Jan 2 2020 1:31 PM

Tamil Nadu College Expels Four Girls After Drinking Video Goes Viral - Sakshi

చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఓ కాలేజ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. కాలేజ్‌ నుంచి వారిని బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. నలుగురు విద్యార్థినులు, వారి స్నేహితులతో కలిసి ఆరు వారాల కిందట ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అబ్బాయిలతో పాటు వారు కూడా మద్యం సేవించారు. విద్యార్థినులు బీర్‌ తాగుతున్న దృశ్యాలను అందులోని ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినులు తీరును తప్పుబడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఈ విషయం డిసెంబర్‌ 24వ తేదీన కాలేజ్‌ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కాలేజ్‌ ప్రిన్సిపల్‌.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే విద్యార్థినుల చర్య కాలేజ్‌కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండటంతో.. వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణ 2020 జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే తమిళనాడులో 21 ఏళ్లు పైబడ్డవారు మద్యం సేవించడం చట్టబద్ధం కాగా, ఆ నలుగురు విద్యార్థినుల వయసు​ అంతకన్నా తక్కువగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement