వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండాపోయారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
కుషాయిగూడ : వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్థినులు కనిపించకుండాపోయారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు... అల్వాల్, వెంకటాపురానికి చెందిన సౌమ్య(18) ఈసీఐఎల్‌లోని విశ్వ చైతన్య డీగ్రీ కళాశాలలో డీగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది.
అయితే ఈ నెల 14న ఆమె తండ్రి లక్ష్మీనర్సింహ బైక్‌పై కళాశాలలో వదిలి వెళ్లాడు. సాయంత్రం పొద్దు పోయే వరకు ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో సంఘటనలో...
కీసర మండలం రాంపల్లికి చెందిన ఎం.శివానీ(17) మహేశ్‌నగర్‌లోని ఓమెగా డీగ్రీ కళాశాలలో చదువుకుంటుంది. బుధవారం కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.