కర్నూలు: విద్యాబుధ్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయిలే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలో చదువుకోనేందుకు వచ్చిన విద్యార్థినులపై కీచక టీచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కీచక టీచర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోని ఉన్నతపాఠశాలలో చోటుచేసుకుంది.
హెచ్ఎమ్ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు కన్నీరు పెట్టుకున్నారు. టీచర్ వేదింపులు తాళ లేక హెచ్ఎమ్పై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హెచ్ఎమ్ను సస్పెండ్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.