Misbehaviour of Teacher
-
ప్రభుత్వ స్కూల్లో టీచర్ కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
-
లైంగిక వేధింపుల ఆరోపణలపై హెచ్ ఎం సస్పెన్షన్
కర్నూలు: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదోని హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. విద్యార్థినులను తరచు లైంగికంగా వేధిస్తున్నాడంటూ 'సాక్షి' కథనంపై డీఈవో స్పందించారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడ్నివిధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలలో చదువుకోనేందుకు వచ్చిన విద్యార్థినులపై లైంగికంగా వేధిస్తున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. హెచ్ఎమ్ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు ఆరోపించారు. హెచ్ ఎం ప్రవర్తన బాగోలేదంటూ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను సాక్షి టీవీ ప్రసారం చేయడంతో మహిళా సంఘాలు కూడా గళం కలిపాయి. దీంతో ఆ కీచక టీచర్ పై వేటుపడక తప్పలేదు. -
విద్యార్ధినులపై కీచక టీచర్ వెకిలిచెష్టలు
కర్నూలు: విద్యాబుధ్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయిలే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలో చదువుకోనేందుకు వచ్చిన విద్యార్థినులపై కీచక టీచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కీచక టీచర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లాలోని ఆదోని ఉన్నతపాఠశాలలో చోటుచేసుకుంది. హెచ్ఎమ్ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్ధినులు కన్నీరు పెట్టుకున్నారు. టీచర్ వేదింపులు తాళ లేక హెచ్ఎమ్పై విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, హెచ్ఎమ్ను సస్పెండ్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.