అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ | Judo-karate training for UP girls | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ

Published Wed, Oct 8 2014 10:04 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ - Sakshi

అమ్మాయిలకు జూడో, కరాటేలో శిక్షణ

ఆత్మరక్షణ కోసం ఉత్తరప్రదేశ్లోని 90 వేల మంది అమ్మాయిలకు జూడో, కరాటేలలో శిక్షణ ఇవ్వనున్నట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు అక్కడి మాధ్యమిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఈ శిక్షణ ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇప్పించడం వెంటనే మొదలుపెట్టాలని మాధ్యమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఆదేశించారు.

2014-15 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాలతో పాటు ఈ శిక్షణను కూడా ఒక భాగంగా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొన్ని నెలల క్రితమే ఈ విషయమై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ జూడో సమాఖ్య ప్రధాన కార్యదర్శి మునవ్వర్ అంజార్ను సలహాదారుగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement