
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న దృశ్యం
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకు వేతనాలు చెల్లించినప్పటికీ చెల్లించలేదంటూ అధికారులను, పోలీసులను తప్పదోవ పట్టిస్తున్న కొమర భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డిని న్యూ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చెరుకూరి వెంకటరమణ కోరారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీ స్పం దన కార్యక్రమంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇచ్చిన శిక్షకులకు ఇప్పటికే తమ అసోసియేషన్ నుంచి వేతనాలు అందజేశామని, ఇంకా ఎవరిౖMðనా చెల్లించనట్లయితే వారు తమను నేరుగా సంప్రదిస్తే వారి అకౌంట్‌కు డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.
ఇదివరకే భాస్కర్‌ను సస్పెండ్ చేశాం
గతంలో నిధులు దుర్వినియోగం చేసిన కొమర భాస్కర్‌ను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సస్పెండ్ చేయడం జరిగిందని తెలియజేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చి విచారణకు హాజరై వివరాలను సమర్పించాలని కోరినప్పటికీ ఆయన అందజేయలేదన్న విషయాన్ని ఎస్పీకి వివరించారు. అప్పట్లో శిక్షకులకు భాస్కర్ జీతాలు చెల్లించలేదన్న విషయం తెలుసుకొని రాష్ట్ర అసోసియేషన్ నేరుగా జిల్లాకు విచ్చేసి శిక్షకులకు వేతనాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కానీ భాస్కర్ మాత్రం తాము వేతనాలు బకాయి పడ్డామని, శిక్షకులకు చెల్లించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని వివరించారు. కొమర భాస్కర్‌ను ఇప్పటికే సస్పెండ్ చేసినా ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్, టీఎఫ్‌ఐ, డబ్ల్యూటీఎఫ్ పేరు, లోగోలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దానిపై అసోసియేషన్ పరంగా చర్యలకు సిద్ధమైనట్లుగా ఎస్పీకి వివరించారు.
నేరుగా సంప్రదించండి
ఇప్పటివరకు తమను సంప్రదించిన 114 ప్రభుత్వ స్కూల్స్, 4 కేజీబీవీ స్కూళ్లలో శిక్షణ ఇచ్చిన శిక్షకులకు వేతనాలు అందజేసినట్లుగా ఆయన వివరించారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే 7702234995 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. శిక్షకులకు వేతనాలు చెల్లించిన విషయాన్ని పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment