క్రికెట్‌ను క్రీడా నియమావళిలో చేర్చుతాం: గోయెల్‌ | Cricket should be included in the sports code: Goel | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ను క్రీడా నియమావళిలో చేర్చుతాం: గోయెల్‌

Published Wed, May 10 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

క్రికెట్‌ను క్రీడా నియమావళిలో చేర్చుతాం: గోయెల్‌

క్రికెట్‌ను క్రీడా నియమావళిలో చేర్చుతాం: గోయెల్‌

దేశంలోని అన్ని క్రీడల్లాగే క్రికెట్‌ కూడా ప్రభుత్వ క్రీడా నియమావళి పరిధిలోకి రావాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ అన్నారు. బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ అయినప్పటికీ క్రికెట్‌ను స్పోర్ట్స్‌ కోడ్‌లో చేర్చడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ‘క్రికెట్‌ను కూడా క్రీడా నియమావళిలో చేర్చుతాం.

అన్ని క్రీడల్లాగే క్రికెట్‌ ఈ జాబితాలో ఉండాలనుకుంటున్నాం. లోధా కమిటీ నిబంధనల మేరకు స్పోర్ట్స్‌ కోడ్‌ను పునరుద్దరిస్తున్నాం. త్వరలో ప్రకటించబోయే ఈ జాబితాలో క్రికెట్‌ను చేరుస్తాం. త్వరలోనే దీనిపై స్పష్టతనిస్తాం’ అని గోయెల్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement