యాడ్ షూట్‌తో మొదలై హాలీవుడ్ స్థాయికి చేరిన తార బనితా సంధూ. ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్ఫామెన్స్ ప్రాధాన్యంగా వరుస సినీ, సిరీస్‌లతో దూసుకెళ్తున్న ఆమె గురించి కొన్ని విషయాలు..
బనితాది బ్రిటన్‌లో స్థిరపడిన సిక్కు కుటుంబం. పుట్టింది, పెరిగింది వేల్స్‌లో. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది.
తొలిసారి ‘అక్టోబర్’ హిందీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అది ఆమెకెలాంటి గుర్తింపునివ్వలేదు. తర్వాత చేసిన ‘సర్దార్ ఉధమ్’ కూడా అంతే.
బాలీవుడ్ ఇవ్వలేని గుర్తింపు తమిళ సినిమా ‘ఆదిత్య వర్మ’ ఇచ్చింది. దాంతో ఏకంగా ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘పండోరా’లో నటించే అవకాశాన్ని అందుకుంది. తర్వాత ‘ఎటర్నల్ బ్యూటీ’ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది.
‘బిడ్జర్టన్’తో వెబ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. అది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగు తెరకూ పరిచయం కానుంది.. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’తో.
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ
దృష్టి పెడతా!
– బనితా సంధూ
చదవండి: నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment