Banita Sandhu
-
బాలీవుడ్ పట్టించుకోలేదు.. మరి టాలీవుడ్?
యాడ్ షూట్‌తో మొదలై హాలీవుడ్ స్థాయికి చేరిన తార బనితా సంధూ. ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్ఫామెన్స్ ప్రాధాన్యంగా వరుస సినీ, సిరీస్‌లతో దూసుకెళ్తున్న ఆమె గురించి కొన్ని విషయాలు.. బనితాది బ్రిటన్‌లో స్థిరపడిన సిక్కు కుటుంబం. పుట్టింది, పెరిగింది వేల్స్లో. లండన్, కింగ్స్ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది.తొలిసారి ‘అక్టోబర్’ హిందీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. అది ఆమెకెలాంటి గుర్తింపునివ్వలేదు. తర్వాత చేసిన ‘సర్దార్ ఉధమ్’ కూడా అంతే.బాలీవుడ్ ఇవ్వలేని గుర్తింపు తమిళ సినిమా ‘ఆదిత్య వర్మ’ ఇచ్చింది. దాంతో ఏకంగా ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘పండోరా’లో నటించే అవకాశాన్ని అందుకుంది. తర్వాత ‘ఎటర్నల్ బ్యూటీ’ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించింది.‘బిడ్జర్టన్’తో వెబ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. అది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగు తెరకూ పరిచయం కానుంది.. ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’తో.విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూచదవండి: నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు -
పాజిటివ్ ఎనర్జీనిచ్చే డెకరేషన్
శ్రావ్యమైన సవ్వడి.. గాలి వీచినప్పుడల్లా అలవోకగా మోగే హ్యాంగింగ్ బెల్స్ ఇంటికి పాజిటివ్ పవనాలను మోసుకొస్తాయి. ప్రధాన ద్వారం ముందు గానీ, బాల్కనీల్లో గానీ వీటిని వేలాడదీసినప్పుడు ఆ సన్నని శ్రావ్యమైన సవ్వడి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సువాసనల కాంతిడెకరేటివ్ వస్తువుల్లో క్యాండిల్స్కున్న ప్రత్యేకతే వేరు! రాత్రి వేళల్లో కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్‌పై సుగంధాల కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఆ సువాసన మదిని ఉల్లాసçపరుస్తుంది. లావెండర్, లైమ్ గ్రాస్, వెనీలా, జాస్మిన్, దాల్చినచెక్క పరిమళాలు కాంతితో కలిసి ప్రయాణం చేస్తూ ఉత్తేజాన్నిస్తాయి.ధూపం కూడా..ధూపం వేయడమూ పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్‌లో భాగమైందిప్పుడు. ధూపానికి వైద్యం చేసే శక్తి ఉంటుందనేది ఓ విశ్వాసం. సాంబ్రాణి, గంధపు చెక్క, బంతి, జాస్మిన్, రోజ్, లావెండర్, లెమన్ గ్రాస్ వంటి పరిమళాల ధూప్ స్టిక్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. శ్రేయస్సుకు..శాంతి, సానుకూలతలో బుద్ధ విగ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది జ్ఞానం, బాధ్యత, కరుణ, విశ్వాసానికి సూచిక. లాఫింగ్ బుద్ధ సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్‌లో బుద్ధుడి విగ్రహాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెమలి ఈకలునెమలి ఈకలు ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను పెంచే చక్కటి అలంకరణ. నెమలి ఈకలను గాజు సీసాలో లేదా జార్లో ఉంచవచ్చు. లేదంటే గోడకు అలంకరించవచ్చు. గదిలో ఎక్కడ పెట్టినా అందంగా కనిపించడమే కాదు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయివి. – ఎన్.ఆర్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూ. -
Banita Sandhu: ‘గూఢచారి’తో యాక్షన్‌కి సిద్ధమైన బనితా సంధు!
‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి హిందీ చిత్రాలతో, తమిళ చిత్రం ‘ఆదిత్య వర్మ’తో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బనితా సంధు. ఈ బ్యూటీ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అడివి శేష్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ ఫిల్మ్ (2018) ‘గూఢచారి’కి సీక్వెల్‌గా పాన్ ఇండియా స్థాయిలో ‘జీ 2’ తెరకెక్కుతోంది. గూఢచారిగా హీరో అడివి శేష్ నటిస్తున్నారు. ఈ స్పై సరసన బనితా సంధు హీరోయిన్గా నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో బనితా జాయిన్ అయిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘శేష్, బనితాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. తెరపై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. హై ఆక్టేన్ యాక్షన్ మూవీగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘‘ఈ చిత్రంలో నటించడం క్రియేటివ్‌గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను’’ అని బనితా సంధు అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu)