పాజిటివ్‌ ఎనర్జీనిచ్చే డెకరేషన్‌ | special story On Banita Sandhu | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌ ఎనర్జీనిచ్చే డెకరేషన్‌

Published Sun, Jan 12 2025 10:38 AM | Last Updated on Sun, Jan 12 2025 10:38 AM

special story On Banita Sandhu

శ్రావ్యమైన సవ్వడి.. 
గాలి వీచినప్పుడల్లా అలవోకగా మోగే హ్యాంగింగ్‌ బెల్స్‌ ఇంటికి పాజిటివ్‌ పవనాలను మోసుకొస్తాయి. ప్రధాన ద్వారం ముందు గానీ, బాల్కనీల్లో గానీ వీటిని వేలాడదీసినప్పుడు ఆ సన్నని శ్రావ్యమైన సవ్వడి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

సువాసనల కాంతి
డెకరేటివ్‌ వస్తువుల్లో క్యాండిల్స్‌కున్న ప్రత్యేకతే వేరు! రాత్రి వేళల్లో కాఫీ టేబుల్, డైనింగ్‌ టేబుల్‌పై సుగంధాల కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఆ సువాసన మదిని ఉల్లాసçపరుస్తుంది. లావెండర్, లైమ్‌ గ్రాస్, వెనీలా, జాస్మిన్, దాల్చినచెక్క పరిమళాలు కాంతితో కలిసి ప్రయాణం చేస్తూ ఉత్తేజాన్నిస్తాయి.

ధూపం కూడా..
ధూపం వేయడమూ పాజిటివ్‌ ఎనర్జీ హోమ్‌ డెకర్‌లో భాగమైందిప్పుడు. ధూపానికి వైద్యం చేసే శక్తి ఉంటుందనేది ఓ విశ్వాసం. సాంబ్రాణి, గంధపు చెక్క, బంతి, జాస్మిన్, రోజ్, లావెండర్, లెమన్‌ గ్రాస్‌ వంటి పరిమళాల ధూప్‌ స్టిక్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. 

శ్రేయస్సుకు..
శాంతి, సానుకూలతలో బుద్ధ విగ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది జ్ఞానం, బాధ్యత, కరుణ, విశ్వాసానికి సూచిక. లాఫింగ్‌ బుద్ధ సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పుడు పాజిటివ్‌ ఎనర్జీ హోమ్‌ డెకర్‌లో బుద్ధుడి విగ్రహాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

నెమలి ఈకలు
నెమలి ఈకలు ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను పెంచే చక్కటి అలంకరణ. నెమలి ఈకలను గాజు సీసాలో లేదా జార్‌లో ఉంచవచ్చు. లేదంటే గోడకు అలంకరించవచ్చు. గదిలో ఎక్కడ పెట్టినా అందంగా కనిపించడమే కాదు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయివి. 
– ఎన్‌.ఆర్‌ 

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్‌ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ 
దృష్టి పెడతా! 
– బనితా సంధూ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement