నిహారికతో బ్రేకప్.. ప్రముఖ సింగర్ క్లారిటీ | Singer Prateek Kuhad CONFIRMS breakup with Niharika Thakur Goes Viral | Sakshi
Sakshi News home page

Singer Prateek Kuhad: ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నా.. నిహారికతో బ్రేకప్‌పై సింగర్

Published Sun, Nov 27 2022 3:59 PM | Last Updated on Sun, Nov 27 2022 4:16 PM

Singer Prateek Kuhad CONFIRMS breakup with Niharika Thakur Goes Viral - Sakshi

ప్రముఖ బాలీవుడ్ సింగర్, గేయ రచయిత ప్రతీక్ కుహద్ ప్రియురాలితో బ్రేకప్ అయినట్లు స్పష్టం చేశారు. నిహారిక ఠాకూర్‌తో బంధం తెంచుకున్నట్లు వివరించారు. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సింగర్ కొద్ది రోజుల క్రితమే తాము విడిపోయామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రతీక్ కుహాద్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భారీసంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అతని స్నేహితురాలు నిహారిక ఠాకూర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే నిహారికతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు ప్రతీక్.

 ప్రతీక్ మాట్లాడుతూ..' నేను ప్రస్తుతం ఎవరితో రిలేషన్‌లో లేను. కొంత కాలంగా దీని గురించి పెద్దగా మాట్లాడలేదు. కొంతమంది ఇప్పటికీ రిలేషన్‌లో ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే చెబుతున్నా నేను ఎలాంటి రిలేషన్‌లో లేను. కొంతకాలం క్రితమే మా బంధం ముగిసింది. తాను ఇప్పుడిప్పుడే సంగీతంపై దృష్టి పెట్టానని చెప్పాడు. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నా. చాలా షోలు జరుగుతున్నాయి. ఇప్పుడే మ్యూజిక్ చేస్తున్నా.' అని అన్నారు.

ప్రతీక్ కుహద్ ‘కోల్డ్/మెస్’ పాటకు బాగా పేరు సంపాదించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, బరాక్ ఒబామా తన 'ఫేవరేట్ మ్యూజిక్ ఆఫ్ 2019' జాబితాలో అతనికి 'కోల్డ్/మెస్' అని పేరు పెట్టారు. అతను బార్ బార్ దేఖో చిత్రంలోని 'ఖో గయే హమ్ కహాన్', కార్వాన్ చిత్రంలోని  సాన్సేన్ అనే సాంగ్ కూడా ఆలపించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement