Arijit Singh
-
సింగర్ అర్జిత్ సింగ్ ఇంట విషాదం
కోల్‌కతా: బాలీవుడ్ ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ ఇంట విషాదం నెలకొంది. అర్జిత్‌సింగ్ తల్లి కోవిడ్‌తో గురువారం కన్నుమూశారు. ఇటీవల ఆమెకు కరోనా సోకింది. దీంతో కోల్‌కతాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే రోజురోజుకీ ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నేడు ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా రెండు వారాల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరిన విషయాన్ని మొదట నటి స్వస్తిక ముఖర్జీ, నిర్మాత శ్రీజిత్ ముఖర్జీ వెల్లడించారు. అర్జిత్ తల్లికి ఏ నెగటీవ్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉందని ఇటీవల తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక ఆషికి 2 సినిమాలోని పాటలు అర్జిత్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా అర్జిత్ పాడిన ‘తుమ్ హి హో’ అనే పాట అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఇవే కాక ఎన్నో పాటలకు తన మధుర గాత్రాన్ని అందించాడు. చదవండి: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ భన్సాలీతో ఎన్టీఆర్32వ సినిమా? -
కోహ్లి: ఆయన ఫ్యాన్‌గా ఉబ్బితబ్బిబ్బయ్యాడు!
ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి తిరుగులేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత అంతటి భారీ అభిమానగణం కోహ్లికి సొంతం అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. తనకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా.. తాను కూడా ఎవరికో ఒకరికి అభిమాని అయి ఉంటాడు. తనకు ఇష్టమైన స్టార్‌ను చూసి ఉబ్బితబ్బిబ్బవుతాడు కదా! అదే విషయాన్ని కోహ్లి తాజాగా బయటపెట్టాడు. హృదయాన్ని హత్తుకునేలా పాడి.. సంగీతంలో ఓలలాడించే ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ అంటే తనకు చాలా ఇష్టమట. అతనికి కోహ్లి వీరాభిమాని అట.. అదే విషయాన్ని కోహ్లి తాజాగా ట్వీట్ చేశాడు. 'నిజమైన అభిమాన సందర్భం ఇది నాకు. ఎంత అద్భుతమైన వ్యక్తి ఇతను. ఇతనిలా మరెవరి స్వరమూ నన్ను కట్టిపడేయలేదు. గాడ్ బ్లెస్ యూ అర్జిత్' అంటూ కోహ్లి అర్జిత్ సింగ్‌తో దిగిన ఫొటో పెట్టి కామెంట్ పెట్టాడు. బాలీవుడ్ తార అనుష్కతో ప్రస్తుతం సహజీవనం చేస్తున్న విరాట్ కోహ్లికి బాలీవుడ్ నటులంటే చాలా ఇష్టం. ఆమీర్ ఖాన్‌తో ఓ టీవీ కార్యక్రమంలో ముచ్చటించిన కోహ్లి ఈ విషయాన్ని బయటపెట్టాడు. బాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా ఆమీర్ ఖాన్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. అన్నట్టు దీపావళి పండుగ సందర్భంగా తన అభిమానులకు కానుక ఇస్తూ.. అనుష్కతో కోహ్లి దిగిన ఓ స్పెషల్ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది Pure fanboy moment for me. What an amazing person he is. No one has captivated me with their voice like this man. God bless you Arijit. 🙏😊 pic.twitter.com/aQMeGjQP8y — Virat Kohli (@imVkohli) 17 October 2017 Hayee😭❤Main maari jawan😩💜 The way they look each other!💋😻 The way virat holded anu's hand🙈👫 They are giving us some major couple goals!❤💍 May god bless them. The only couple whom I adore the most😍 Love you virushka.💍💘 Keep slaying together! - @anushkasharma #anushkasharma #dishapatani #priyankachopra #deepikapadukone #kareenakapoor #katrinakaif #aliabhatt #aishwaryarai #anushkasharma #sunnyleone #shraddhakapoor #kritisanon #sonamkapoor #sonakshisinha #jacquelinefernandez #nidhhiagerwal #shahrukhkhan #viratkohli #hrithikroshan #akshaykumar #ranveersingh #varundhawan #tigershroff #ranbirkapoor #sidharthmalhotra #kapilsharma #arijitsingh #hollywood #bollywood A post shared by Anushka Sharma (@anushkaswonder) on Oct 16, 2017 at 2:44am PDT -
ప్రియమైన సల్మాన్‌కు వ్రాయునది ఏమనగా..
ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆయన ట్విట్టర్లో ఒక పెద్ద లేఖను పోస్ట్ చేశారు. తాను సార్టీ చెప్పేందుకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అవకాశం ఇవ్వకపోవడంతో చివరి ప్రయత్నంగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అర్జిత్ చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సల్మాన్‌ను అవమానించారనే కారణంగా తన చిత్రం సుల్తాన్‌లో అర్జిత్ పాడిన ఓ గీతాన్ని తొలగించి దానిని వేరొకరితో వేరే స్టైల్లో పాడిస్తున్నారని తెలిసింది. అయితే, తానేమీ అలా అవమానించలేదని, నిజాలేమిటో తెలుసుకోవాలని అర్జిత్ లేఖలో రాశాడు. ఆ లేఖలో ఏం ఉందంటే.. 'ప్రియమైన సల్మాన్ ఖాన్ మీతో మాట్లాడేందుకు నాకున్న ఏకైక మార్గం ఇదే అనుకుంటున్నాను. మిమ్మల్ని అవమానించానని వచ్చిన వదంతులు పూర్తిగా అవాస్తవాలని చెప్పేందుకు ఎస్సెమ్మెస్ ల ద్వారా కాల్స్ ద్వారా ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాను. నేను మిమ్మల్ని అవమానించలేదు. ఎప్పటి నుంచో నేను మా కుటుంబం మీకు పెద్ద అభిమానులం. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎన్నో సార్లు చెప్పేందుకు ప్రయత్నించాను. ఎన్నిసార్లు ప్రయత్నించానో మీకు తెలుసు.. ఈ రోజు బహిరంగంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మీకోసం నేను పాడిన పాటను తొలగించకండి. కనీసం ఆ వర్షన్ అయినా ఉంచండి.. అంటూ ఆయన లేఖను కొనసాగిస్తూ నేను ఎప్పటికీ మీ ఫ్యాన్నే అంటూ లేఖ ముగించాడు. -
సింగర్‌కు మాఫియా బెదిరింపులు...
ముంబై: అండర్ వరల్డ్ మాఫియాకు, బాలీవుడ్‌కు మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా మాఫియా డాన్ రవి పూజారి.. ఓ బాలీవుడ్ గాయకుడిని టార్గెట్ చేశాడు. బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్‌ను సుమారు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడట. అయితే అంత పెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని అనడంతో మరో బేరానికి దిగాడు రవి పూజారి. తమ కోసం ఉచితంగా కొన్ని షోలు చేసి పెట్టాలని అడిగాడట. అయితే దీనికి సంబంధించి అరిజీత్ సింగ్ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. కానీ స్థానిక పోలీసులకు ఈ విషయమై అరిజీత్ సింగ్ మేనేజర్ ఫోన్ ద్వారా మౌఖిక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కాగా రవి పూజారికి బాలీవుడ్ సెలబ్రిటీలను బెదిరించడం, ఇలాంటి కాల్స్ చేయడం అలవాటే. గతంలో షారూఖ్ ఖాన్, ప్రీతిజింతాలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.