ప్రియమైన సల్మాన్‌కు వ్రాయునది ఏమనగా.. | Arijit Singh's public apology to Salman Khan! | Sakshi
Sakshi News home page

ప్రియమైన సల్మాన్‌కు వ్రాయునది ఏమనగా..

Published Wed, May 25 2016 11:08 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ప్రియమైన సల్మాన్‌కు వ్రాయునది ఏమనగా..

ప్రియమైన సల్మాన్‌కు వ్రాయునది ఏమనగా..

ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆయన ట్విట్టర్లో ఒక పెద్ద లేఖను పోస్ట్ చేశారు. తాను సార్టీ చెప్పేందుకు  ఎస్సెమ్మెస్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అవకాశం ఇవ్వకపోవడంతో చివరి ప్రయత్నంగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అర్జిత్ చెప్పారు.

ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సల్మాన్ను అవమానించారనే కారణంగా తన చిత్రం సుల్తాన్లో అర్జిత్ పాడిన ఓ గీతాన్ని తొలగించి దానిని వేరొకరితో వేరే స్టైల్లో పాడిస్తున్నారని తెలిసింది. అయితే, తానేమీ అలా అవమానించలేదని, నిజాలేమిటో తెలుసుకోవాలని అర్జిత్ లేఖలో రాశాడు. ఆ లేఖలో ఏం ఉందంటే..

'ప్రియమైన సల్మాన్ ఖాన్
మీతో మాట్లాడేందుకు నాకున్న ఏకైక మార్గం ఇదే అనుకుంటున్నాను. మిమ్మల్ని అవమానించానని వచ్చిన వదంతులు పూర్తిగా అవాస్తవాలని చెప్పేందుకు ఎస్సెమ్మెస్ ల ద్వారా కాల్స్ ద్వారా ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాను. నేను మిమ్మల్ని అవమానించలేదు. ఎప్పటి నుంచో నేను మా కుటుంబం మీకు పెద్ద అభిమానులం. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎన్నో సార్లు చెప్పేందుకు ప్రయత్నించాను. ఎన్నిసార్లు ప్రయత్నించానో మీకు తెలుసు.. ఈ రోజు బహిరంగంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మీకోసం నేను పాడిన పాటను తొలగించకండి. కనీసం ఆ వర్షన్ అయినా ఉంచండి.. అంటూ ఆయన లేఖను కొనసాగిస్తూ నేను ఎప్పటికీ మీ ఫ్యాన్నే అంటూ లేఖ ముగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement