public apology
-
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
గొణుగుడు ఎందుకు: పొరపాటు జరిగింది, క్షమించండి!
అహ్మదాబాద్: ఇద్దరు న్యాయమూర్తుల వాగ్వాదానికి గుజరాత్ హైకోర్టు వేదికైంది. న్యాయమూర్తులు జస్టిస్ బీరేన్ వైష్ణవ్, జస్టిస్ మౌనా భట్ ధర్మాసనం సోమవారం ఓ కేసును విచారిస్తున్న సందర్భంగా ఈ ఉదంతం జరిగింది. కేసుకు సంబంధించిన కొన్ని అంశాలపై వారిద్దరూ విభేదించారు. అనంతరం జస్టిస్ వైష్ణవ్ వెలువరించిన తీర్పుతో జస్టిస్ భట్ ఏకీభవించలేదు. దాంతో, ‘కావాలంటే మీరు విభేదించండి. ఇప్పటికే ఒక కేసులో మనం విభేదించాం. ఇందులోనూ అలాగే చేయవచ్చు’ అని జస్టిస్ వైష్ణవ్ అన్నారు. ఇది కేవలం విభేదించడానికి సంబంధించిన విషయం కాదంటూ జస్టిస్ భట్ ఏదో చెప్పబోగా, ‘మరైతే గొణగకండి. విడి తీర్పు వెలువరించండి. మనమిక తదుపరి కేసులు చేపట్టబోవడం లేదు’ అంటూ తన స్థానం నుంచి లేచారు. ధర్మాసనం తదుపరి కేసులు ఆలకించబోదని చెబుతూ కోర్టు రూమ్ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కోర్టు రూములోని సీసీ కెమెరాలో రికార్డయింది. గుజరాత్ హైకోర్టులో అన్ని బెంచ్‌లు జరిపే విచారణలూ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. జడ్జిల వాగ్వాదానికి సంబంధించిన వీడియోను కాసేపటికే యూట్యూబ్ నుంచి తొలగించారు. కానీ ఆ వీడియో అప్పటికే సామాజిక మాధ్యమాల వేదికనెక్కి తెగ చక్కర్లు కొడుతోంది. (మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!) అయితే గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి వైష్ణవ్ బుధవారం బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సోమవారం నాటి సంఘటనలు జరగ కూడదు తప్పును అంగీకరిస్తున్నాను అంటూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడి ఉండాల్సింది, పొరబడ్డాను అంటూ జస్టిస్ వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా 2016, జనవరిలో సుప్రీంకోర్టులో దాదాపు ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఎంవై ఎక్బాల్ , అరుణ్ మిశ్రా మధ్య జరిగిన వాగ్వాదానికి విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) -
Will Smith: చెంప దెబ్బపై బహిరంగ క్షమాపణలు
94వ ఆస్కార్ అవార్డుల ఈవెంట్ వేదికగా కమెడియన్ క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పాడు స్టార్ నటుడు విల్ స్మిత్. ఈ ఘటనపై బహిరంగంగా స్మిత్ స్పందించడం ఇదే మొదటిసారి. ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో.. వేదికపైకి వెళ్లి మరీ హోస్ట్‌గా వ్యవహరించిన క్రిస్ రాక్ చెంప పగలకొట్టాడు విల్ స్మిత్. అయితే క్రిస్ నవ్వులతో అప్పటికప్పుడు ఆ ఘటన ఒక సరదా విషయంగా అంతా అనుకున్నారు. కానీ, కొన్ని గంటల్లోనే అదొక సంచలనం అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి.. అకాడమీకి, ఆస్కార్ నామినీలకు మాత్రమే ప్రత్యేకంగా విల్ స్మిత్ క్షమాపణలు తెలియజేసిన విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత క్రిస్ రాక్ పేరును ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో బహిరంగ క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్ ఉంచాడు. అయితే.. ఇప్పుడు నేరుగా క్రిస్ రాక్‌కు క్షమాపణలు చెప్తూ ఒక వీడియోనే ఉంచాడు. ఆస్కార్ స్పీచ్‌లో చెంప దెబ్బ ఘటనపై ఎందుకు స్పందించలేదు అని ఓ ప్రశ్న ఎదురైంది స్మిత్‌కు. దానికి స్పందించిన విల్ స్మిత్.. ఘటన తర్వాత క్రిస్ రాక్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, కానీ, అతను మాట్లాడేందుకు ఇంకా సుముఖత వ్యక్తం చేయలేదని విల్ స్మిత్ తాజా వీడియోలో వివరించాడు. క్రిస్ రాక్ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నా. నీకు నా క్షమాపణలు. ఇది చాలదని నాకు తెలుసు. నువ్వు ఎక్కడంటే అక్కడ నీతో మాట్లాడడానికి నేను రెడీ. ఐ యాస్ సారీ. నీకే కాదు నీకుటుంబానికి, ఆస్కార్ కమిటీకి, నామినీలకు, నా వల్ల ఇబ్బంది పడ్డా నా కుటుంబానికి కూడా క్షమాపణలు అని విల్ స్మిత్ తెలిపాడు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ ‘షేవ్తల’ను ఉద్దేశించి.. జీఐ జేన్ అంటూ జోక్ చేశాడు క్రిస్ రాక్. దీంతో మండిపోయిన విల్ స్మిత్.. ఊగిపోతూ స్టేజ్ మీదకు వెళ్లి క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. ఈ ఘటన విమర్శలకు దారి తీయడంతో ఆస్కార్ కమిటీలో తన సభ్యత్వానికి విల్ స్మిత్ రాజీనామా చేయగా.. మరోవైపు వేడుకలకు హాజరు కాకుండా అతనిపై నిషేధం(కొన్నేళ్లైనా) దిశగా ఆలోచనలు చేస్తోంది అకాడమీ కమిటీ. నటుడు విల్ స్మిత్(53) 94వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్ రిచర్డ్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Will Smith (@willsmith) -
‘క్షమాపణ చెప్పినా హైపర్ ఆదిని వదలం.. బుద్ధి చెప్తాం’
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీలో ప్రసారమైన షోలో జబర్దస్త్ నటుడు హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తాజాగా హైపర్ ఆది ఆ వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. హైపర్ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్ ఆది అనడం సిగ్గుచేటు అని నవీన్ గౌడ్ తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏదో అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదు అని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది చదవండి: నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజల్లోకి చేరనివ్వకుండా ఆయన కుటుంబ సభ్యులు దాని స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. నోరు జారి మాట్లాడారన్న ఎంపీ కవిత వ్యాఖ్యలను స్వాగతిస్తూనే.. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా, ప్రధాని పదవిని అవమానించేలా ఉన్నాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర సాయం లభిస్తోందంటూ శాసన సభలో పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయలను వాడు, వీడు అంటూ వ్యాఖ్యానించడం కేసీఆర్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో లబ్ధిపొందుతూ రాష్ట్ర పథకాలుగా మార్చి వాటికి కేసీఆర్ కిట్ అంటూ నామకరణం చేసుకున్న చరిత్ర కేసీఆర్‌దని నిప్పులు చెరిగారు. రైతాంగానికి బీజేపీ ఏమి చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం చేయూతను ఇచ్చినట్లు వివరించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మీ చేతగాని తనాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. రైతుల రుణమాఫీ ఎందుకు పూర్తిగా చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. బీజేపీని ఒవైసీ అంతం చేస్తాడట! దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తోందని దాన్ని అంతం చేయడం ఎంఐఎం నేత అసదుద్దీన్ తరం కాదన్నారు. ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్లుగా ఒవైసీ ప్రవర్తన ఉందన్నారు. సికింద్రాబాద్‌లో పాగా వేస్తాం.. అంబర్‌పేటలో గెలుస్తామంటూ గతంలో అసదుద్దీన్ అనేకమార్లు సవాల్ విసిరారని, ఎక్కడా గెలువలేకపోయారన్నారు. ఒవైసీకి దమ్మూ ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్లోనూ బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒవైసీ సోదరులు ఎలా చెప్తే కేసీఆర్ అలా నడుచుకుంటున్నారన్నారు. ఒవైసీ, కేసీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
ప్రియమైన సల్మాన్‌కు వ్రాయునది ఏమనగా..
ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆయన ట్విట్టర్లో ఒక పెద్ద లేఖను పోస్ట్ చేశారు. తాను సార్టీ చెప్పేందుకు ఎస్సెమ్మెస్‌ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అవకాశం ఇవ్వకపోవడంతో చివరి ప్రయత్నంగా తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అర్జిత్ చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో సల్మాన్‌ను అవమానించారనే కారణంగా తన చిత్రం సుల్తాన్‌లో అర్జిత్ పాడిన ఓ గీతాన్ని తొలగించి దానిని వేరొకరితో వేరే స్టైల్లో పాడిస్తున్నారని తెలిసింది. అయితే, తానేమీ అలా అవమానించలేదని, నిజాలేమిటో తెలుసుకోవాలని అర్జిత్ లేఖలో రాశాడు. ఆ లేఖలో ఏం ఉందంటే.. 'ప్రియమైన సల్మాన్ ఖాన్ మీతో మాట్లాడేందుకు నాకున్న ఏకైక మార్గం ఇదే అనుకుంటున్నాను. మిమ్మల్ని అవమానించానని వచ్చిన వదంతులు పూర్తిగా అవాస్తవాలని చెప్పేందుకు ఎస్సెమ్మెస్ ల ద్వారా కాల్స్ ద్వారా ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాను. నేను మిమ్మల్ని అవమానించలేదు. ఎప్పటి నుంచో నేను మా కుటుంబం మీకు పెద్ద అభిమానులం. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను ఎన్నో సార్లు చెప్పేందుకు ప్రయత్నించాను. ఎన్నిసార్లు ప్రయత్నించానో మీకు తెలుసు.. ఈ రోజు బహిరంగంగా మీకు క్షమాపణలు చెబుతున్నాను. దయచేసి మీకోసం నేను పాడిన పాటను తొలగించకండి. కనీసం ఆ వర్షన్ అయినా ఉంచండి.. అంటూ ఆయన లేఖను కొనసాగిస్తూ నేను ఎప్పటికీ మీ ఫ్యాన్నే అంటూ లేఖ ముగించాడు. -
వకార్ బహిరంగ క్షమాపణ; సీనియర్ల ఫైర్
కరాచీ: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరాజయానికి బాధ్యత వహిస్తూ కోచ్ వకార్ యూనిస్ బహిరంగ క్షమాపణ చెప్పడంపై మాజీ కెప్టెన్లు భిన్నంగా స్పందించారు. క్షమాపణ చిన్న విషయమని, ఇప్పటికే ఆలస్యం చేశారని మాజీ కెప్టెన్లు రమీజ్ రాజా, మహ్మద్ యూసఫ్ వ్యాఖ్యానించారు. మీడియా ముందు వకార్ క్షమాపణ చెప్పడం బాధ కలిగించిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వకార్ గొప్ప బౌలర్ అని, అతడు క్షమాపణ చెప్పే పరిస్థితి రావడం బాధాకమని పేర్కొన్నాడు. జట్టు ఓటమికి ఒక్కరే బాధ్యులు కారని, పాక్ క్రికెట్ టీమ్ లో చాలా అంశాలు మెరుగుపరచాల్సిన అవసరముందన్నాడు. బోర్డు ఇచ్చిన స్వేచ్ఛను వకార్ ఉపయోగించుకోలేకపోయారని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రమీజ్ రాజా అన్నాడు. మూడేళ్ల నుంచి జట్టు ఆటతీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. కోచ్ గా వకార్ విఫలమయ్యారని విమర్శించారు. జట్టుకు నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా వకార్ క్షమాపణ చెప్పారని మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ ధ్వజమెత్తారు. రాహుల్ ద్రావిడ్ ను భారత జూనియర్ టీమ్ కు కోచ్ గా నియమించినట్టుగానే.. పాక్ జూనియర్ టీమ్ కు వకార్ ను కోచ్ నియమించాల్సిందని సూచించారు. పాకిస్థాన్ జట్టును సంస్కరించేందుకు విప్లవాత్మక, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.