D-Company
-
ఇది నా కలల ప్రాజెక్ట్
అండర్ వరల్డ్ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సినిమా ‘డి–కంపెనీ’. ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అన్నది ఉపశీర్షిక. స్పార్క్ కంపెనీ ప్రొడక్షన్స్, రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘దావూద్ ఇబ్రహీం ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా అండర్ వరల్డ్‌ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్నది మా చిత్రంలో చూపించబోతున్నాం. గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికీ ‘డి–కంపెనీ’ తల్లి లాంటిది.. ఇది నా కలల ప్రాజెక్ట్. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌గా దావూద్ ఎలా మార్చాడనేది ఈ సినిమాలో కీలకం. ఈ మూవీని ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం’’ అన్నారు. కాగా ఈ సినిమా టీజర్‌ని బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా తన ట్విట్టర్లో షేర్ చేయడం విశేషం. -
భారత్‌కు షాకిచ్చిన యూఏఈ ప్రభుత్వం
అబుదాబీ : భారత్‌లో అక్రమ కార్యకలాపాలకు పాల్పడి విదేశాల్లో తల దాచుకుంటున్న నేరస్తులను, వివాదాస్పద వ్యక్తులను తిరిగి అప్పగించాల్సిందిగా వివిధ దేశాల ప్రభుత్వాలను కోరుతున్న భారత్‌కు నిరాశే మిగులుతోంది. వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్ నాయక్‌ను అప్పగించే ప్రసక్తే లేదంటూ మలేషియా ప్రభుత్వం ఇటీవలే తేల్చి చెప్పింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించి భారత్‌కు షాక్ ఇచ్చింది. 17 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ఏటీఎస్)కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రవాది ఫారూఖ్ డేవిడ్‌వాలాను అప్పగించాలంటూ భారత్ యూఏఈని కోరింది. అయితే డేవిడ్‌వాలా తమ దేశ పౌరుడంటూ పాకిస్తాన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న యూఏఈ ప్రభుత్వం అతడిని అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు అతడిని ఇస్లామాబాద్ పంపించనున్నట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. పలు నేరాల్లో కీలక భాగస్వామి.... దావూద్ ఇబ్రహీం డీ- కంపెనీలో కీలక సభ్యుడిగా వ్యవహరించిన డేవిడ్‌వాలాకు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉంది. గుజరాత్‌లోని డీ- కంపెనీ వ్యవహారాలన్ని చూసుకునే డేవిడ్‌కు చోటా షకీల్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. ఇండియన్ ముజాహిద్దీన్, ఐఎస్ఐల ప్రోద్బలంతో ఫైజల్ మీర్జా, అల్లాహర్కా మన్సూరీ అనే ఇద్దరు వ్యక్తులను సంప్రదించి, పలువురికి ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ ఇచ్చేలా ప్రోత్సహించాడు. ప్రస్తుతం వారిద్దరు మహారాష్ట్ర ఏటీఎస్ అదుపులో ఉన్నారు. గుజరాత్‌లోని పలు పట్టణాల్లో జరిగిన పేలుళ్లు, గుజరాత్ మాజీ హోం మంత్రి పాండ్యా హత్య కేసులోనూ డేవిడ్‌వాలా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాగా 17 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డేవిడ్‌వాలా దుబాయ్ ఉన్నట్లు మే 12న సమాచారం అందడంతో గుజరాత్ పోలీసులు భద్రతా బలగాలకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అతడిని అప్పగించాల్సిందిగా యూఏఈ ప్రభుత్వాన్ని కోరింది. అయితే అతడు భారత్‌కు చెందిన వాడు కాదని, తమ దేశ పౌరుడని పాకిస్తాన్ తెలిపింది. డేవిడ్‌వాలా ప్రస్తుతం పాకిస్తానీ పాస్పోర్టుతో దుబాయ్‌లో నివసిస్తూ ఉండటంతో అతడిని ఇస్లామాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం. -
దావూద్ ఒకడే.. అడ్రస్‌లు ఎన్నో!
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీ ప్రస్తుతం పాకిస్థాన్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు సాగిస్తోందన్నది బహిరంగ రహస్యమే. అయితే అందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంపాదించింది. కరాచీలో కూడా డి కంపెనీకి వ్యాపారాలు ఉన్నాయంటూ తాను దాఖలుచేసిన చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, కేష్ ఈక్వినాక్స్ లు దావూద్ భాయ్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా కుటుంబం నడుపుతున్నట్లు అందులో పేర్కొంది. భారుచ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిక్నా పాకిస్తాన్ లోని తన రెండు అడ్రస్‌లను పేర్కొన్నారు. వీటిలో ఒకటి కరాచీలోని బాగ్ ఇబ్నే ఖాసీం వద్ద కాగా.. మరొకటి డీ5, మయన్మార్ ఆర్కేడ్, గుల్షన్-ఈ-ఇక్బాల్, గుల్షన్ సైక్రియాట్రిక్ ఆసుపత్రి, కరాచీగా పేర్కొన్నాడు. 2002 గుజరాత్ అల్లర్లలో యాంటీ ముస్లిం సపోర్టర్లుగా పేరొందిన శిరీష్ బన్ గాలీ (ఆర్ఎస్ఎస్), విరాళ్ దేశాయ్ (వీహెచ్ పీ), జయకర్ మహారాజ్ (బజరంగ్ దళ్)లను కుట్రపన్ని చంపినట్లు జావేద్ పై కేసు నమోదయింది. ఐఎస్ఐ సంస్థ నుంచి ఒత్తిళ్ల కారణంగానే జావేద్ ఈ కుట్రకు పాల్పడ్డాడని కరాచీలోని కేఫ్ ఇతని కుటుంబానికి కచ్చితమైన ఆధార వనరా? లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. చార్జీషీటులో వివరాల ప్రకారం జావేద్ భారుచ్ హత్యల కోసం ఆయుధాలు సమకూర్చుకున్నట్లు ఉంది. మొదట ముంబై ఆ తర్వాత సూరత్ లను టార్గెట్‌గా పెట్టుకోగా.. ముంబైలో బుల్లెట్ల మ్యాగజైన్ పోవడంతో సూరత్‌లో దాడి చేసినట్లు ఎన్ఐఏ చార్జ్ షీటులో పేర్కొంది. తనతో పాటు దాడిలో పాల్గొన్న వారికోసం జావేద్ రూ.5 లక్షలను వారికి ఇచ్చేందుకు హవాలా మార్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపింది. జావేద్ తల్లిని నేపాల్‌లో అరెస్టుచేసిన ఎన్ఐఏ అధికారులు ఆమె నివాసం ఉండే ప్రాంతాలు దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్, ముంబైలోని మహీమ్ లుగా పేర్కొన్నారు.