దావూద్ ఒకడే.. అడ్రస్‌లు ఎన్నో! | Dawood's man owns food joint in Karachi, says NIA | Sakshi
Sakshi News home page

దావూద్ ఒకడే.. అడ్రస్‌లు ఎన్నో!

Published Wed, May 18 2016 12:18 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

Dawood's man owns food joint in Karachi, says NIA

న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీ ప్రస్తుతం పాకిస్థాన్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు సాగిస్తోందన్నది బహిరంగ రహస్యమే. అయితే అందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంపాదించింది. కరాచీలో కూడా డి కంపెనీకి వ్యాపారాలు ఉన్నాయంటూ తాను దాఖలుచేసిన చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, కేష్ ఈక్వినాక్స్ లు దావూద్ భాయ్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా కుటుంబం నడుపుతున్నట్లు అందులో పేర్కొంది. భారుచ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిక్నా పాకిస్తాన్ లోని తన రెండు అడ్రస్‌లను పేర్కొన్నారు. వీటిలో ఒకటి కరాచీలోని బాగ్ ఇబ్నే ఖాసీం వద్ద కాగా.. మరొకటి డీ5, మయన్మార్ ఆర్కేడ్, గుల్షన్-ఈ-ఇక్బాల్, గుల్షన్ సైక్రియాట్రిక్ ఆసుపత్రి, కరాచీగా పేర్కొన్నాడు.

2002 గుజరాత్ అల్లర్లలో యాంటీ ముస్లిం సపోర్టర్లుగా పేరొందిన శిరీష్ బన్ గాలీ (ఆర్ఎస్ఎస్), విరాళ్ దేశాయ్ (వీహెచ్ పీ), జయకర్ మహారాజ్ (బజరంగ్ దళ్)లను కుట్రపన్ని చంపినట్లు జావేద్ పై కేసు నమోదయింది. ఐఎస్ఐ సంస్థ నుంచి ఒత్తిళ్ల కారణంగానే జావేద్ ఈ కుట్రకు పాల్పడ్డాడని కరాచీలోని కేఫ్ ఇతని కుటుంబానికి కచ్చితమైన ఆధార వనరా? లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. చార్జీషీటులో వివరాల ప్రకారం జావేద్ భారుచ్ హత్యల కోసం ఆయుధాలు సమకూర్చుకున్నట్లు ఉంది. మొదట ముంబై ఆ తర్వాత సూరత్ లను టార్గెట్‌గా పెట్టుకోగా.. ముంబైలో బుల్లెట్ల మ్యాగజైన్ పోవడంతో సూరత్‌లో దాడి చేసినట్లు ఎన్ఐఏ చార్జ్ షీటులో పేర్కొంది. తనతో పాటు దాడిలో పాల్గొన్న వారికోసం జావేద్ రూ.5 లక్షలను వారికి ఇచ్చేందుకు హవాలా మార్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపింది.

జావేద్ తల్లిని నేపాల్లో అరెస్టుచేసిన ఎన్ఐఏ అధికారులు ఆమె నివాసం ఉండే ప్రాంతాలు దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్, ముంబైలోని మహీమ్ లుగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement