ముంబై: వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌పై జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఐఏ) ముంబైలోని ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో దేశంలోని కొన్ని వర్గాల మధ్య విభేదాలు పెంచిపోషించటం, యువతను ఉగ్రవాదంలోకి తీసుకురావటం వంటి అభియోగాలతో నాలుగు వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు గురువారం విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న జకీర్ నాయక్‌పై ఎన్‌ఐఏ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తుండటంతోపాటు మనీల్యాండరింగ్ ఆరోపణలతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. జకీర్ నాయక్ ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన ఉగ్రవాదులు గత ఏడాది జూలైలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉగ్రదాడికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment