Dawood
-
ముంబయ్ పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పరిస్థితి విషమం
-
న్యూమరాలజీ ప్రకారం పేర్లు ఎలా పెడతారంటే?
-
నగరంలో డీ–గ్యాంగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో ‘డీ–గ్యాంగ్’కలకలం! అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన నేర సామ్రాజ్యాన్ని ఇక్కడికీ విస్తరించాడు. ముంబైకి చెందిన ఓ న్యాయవాదిని హతమార్చేందుకు డీ–కంపెనీ చేసిన కుట్రలో హైదరాబాద్ లింకులు బయటపడ్డాయి. ‘బిగ్ బాస్’షో గొడవ నేపథ్యంలో ఆ లాయర్‌ను చంపే పనిని నగరానికి చెందిన రోహుల్ అమీన్ షంషుల్ ఇస్లాంకు అప్పగించింది గ్యాంగ్! ఇందుకు దావూద్ కుడి భుజం అయిన ఫహీమ్ మచ్మచ్.. అమీన్‌తో రూ.25 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. చివరికి న్యాయవాది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు.. అమీన్‌తోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. గతనెల చివరి వారం హైదరాబాద్ వచ్చిన ముంబై క్రైం బ్రాంచ్ ప్రత్యేక విభాగం అధికారులు.. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సాయంతో ఈ అరెస్టులు చేయడంతోపాటు ఓ పిస్టల్, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నగర పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఉగ్రవాదుల మాదిరి ‘డీ–కంపెనీ’సైతం సామాజిక మాధ్యమాల ద్వారా నియామకాలు చేసుకుంటున్నట్లు ఈ ఉదంతంతో తేలింది. ‘బిగ్‌బాస్’తో మొదలైన వివాదం బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కలర్స్ టీవీ చానల్లో ‘బిగ్‌బాస్–11’షో నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఇందులో ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి చెందిన జుబేర్ ఖాన్ పాల్గొన్నాడు. దావూద్ ఇబ్రహీం స్వస్థలం కూడా డోంగ్రీనే కావడం గమనార్హం. కొద్దిరోజుల తర్వాత షో నుంచి జుబేర్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. తనను షో నుంచి అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ అతడు బాంద్రా ప్రాంతానికి చెందిన న్యాయవాది షబ్నమ్‌ను ఆశ్రయించాడు. దీంతో ఆమె సల్మాన్‌తోపాటు ఆ టీవీ చానల్‌పై ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత నిబంధనలకు అనుగుణంగానే ఎలిమినేషన్ జరిగిందని తెలుసుకొని ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే దీని వెనుక భారీ మొత్తం చేతులు మారినట్లు, షబ్నమ్‌కు రూ.5 కోట్ల వరకు ముట్టినట్లు జుబేర్ అనుమానించాడు. ఆ మొత్తంలో తనకు రూ.3 కోట్లు ఇవ్వాలంటూ ఆమెతో వాదనకు దిగాడు. చివరికి డోంగ్రీ ప్రాంతంలో తనకున్న పరిచయాలతో ‘డీ–కంపెనీ’కి చెందిన ఫహీమ్ మచ్‌మచ్‌ను సంప్రదించాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంటున్న ఇతడు దావూద్ ఇబ్రహీంకు కుడి భుజంగా ఉన్నాడు. బెదిరింపు వ్యవహాలన్నింటినీ ఇతడే డీల్ చేస్తుంటాడు. ఎవరీ అమీన్.. ఏంటి ఆ డీల్? పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లోని కిషన్‌గంజ్ ప్రాంతానికి చెందిన అమీన్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి ఓల్డ్ మలక్‌పేట వహీద్నగర్ ప్రాంతంలో నివసిస్తోంది. బీకాం కంప్యూటర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఇతడు మాదాపూర్‌లోని 100 ఫీడ్ రోడ్ ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి ఓ కార్ల షెడ్ నిర్వహించాడు. ఇతడికి బంజారాహిల్స్ రోడ్ నం.4కు చెందిన మీర్జా మహ్మద్ ముఫకమ్ బేగ్‌తో పరిచయం ఏర్పడింది. ఇతడు కుటుంబంతో సహా చాలాకాలం దుబాయ్‌లో ఉండి 2004లో ఇక్కడకు వచ్చాడు. మాదాపూర్‌లోని అమీన్ షెడ్‌కు తరచూ వెళ్తుండటంతో అతడితో గతేడాది పరిచయం ఏర్పడింది. దుబాయ్‌లో ఉండగా అక్కడున్న ‘డీ–కంపెనీ’అనుచరులతో ముఫకమ్తో పరిచయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముఫకమ్, అమీన్లు తరచూ తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాల గురించి చర్చించేవారు. ఈ నేపథ్యంలోనే ముఫకమ్ తనకు ‘డీ–కంపెనీ’తో పరిచయాలు ఉన్నాయని, వారికోసం పని చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కుడ డబ్బు సంపాదించవచ్చని అమీన్‌తో చెప్పాడు. ఇందుకు అమీన్ అంగీకరించడంతో దుబాయ్ ‘లింకుల్ని’పరిచయం చేశాడు. వీరి ద్వారా అమీన్... పాకిస్తాన్లో ఉన్న ఫహీమ్ మచ్మచ్తో టచ్‌లోకి వెళ్లాడు. కేవలం వాట్సాప్ లేదా మెసెంబర్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరిపే ఫహీమ్.. షబ్నమ్‌ను బెదిరించి డబ్బు వసూలు చేసే బాధ్యతల్ని అమీన్‌కు అప్పగించాడు. పని పూర్తి చేస్తే రూ.25 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫేస్బుక్ ద్వారా మరో ఇద్దరిని.. ఫహీమ్ మచ్మచ్ ఫేస్బుక్ ద్వారా ఢిల్లీకి చెందిన హరీష్ యాదవ్, పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన జస్వీందర్సింగ్లను డీ–కంపెనీ కోసం రిక్రూట్ చేసుకున్నాడు. వీరిద్దరినీ వాట్సాప్ ద్వారా అమీన్‌కు పరిచయం చేసిన ‘ఆపరేషన్’పూర్తి చేయాలని ఆదేశించాడు. దుబాయ్, పాకిస్తాన్‌లతోపాటు హైదరాబాద్ నుంచి షబ్నమ్‌కు బెదిరింపు ఫోన్లు చేయించాడు. అయినా ఆమె లొంగకపోవడంతో హతమార్చాలని ఫహీమ్ నిర్ణయించుని, ఆ పనిని అమీన్‌కు అప్పగించాడు. అయితే తనకు తుపాకీ కాల్చడం రాదని చెప్పిన అమీన్.. హరీష్‌తో పని చేయిస్తానని తెలిపాడు. బిహార్ నుంచి వచ్చి మంగళ్‌హాట్ ప్రాంతంలో నివసిస్తున్న తన స్నేహితుడైన మహ్మద్ అబ్రార్ అహ్మద్‌ను ఆయుధం కోసం అమీన్ సంప్రదించాడు. దీంతో అహ్మద్ బిహార్‌లో ఉంటున్న తన బావ ఇమ్రాన్ ద్వారా రూ.34 వేలు వెచ్చించి .9ఎంఎం పిస్టల్, 10 తూటాలు తెప్పించి అమీన్‌కు అందించాడు. షబ్నమ్‌ను హతమార్చడానికి ఢిల్లీ నుంచి హరీష్ యాదవ్‌ను ముంబై రమ్మని చెప్పిన అమీన్ తానూ అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈలోపు షబ్నమ్ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 30న కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు... క్రైమ్ బ్రాంచ్ ఆధీనంలోని యాంటీ ఎక్స్టార్షన్ సెల్‌ను రంగంలోకి దింపారు. గతంలోనూ దందాలు చేశారా? కేసును దర్యాప్తు చేసిన యాంటీ ఎక్స్టార్షన్ సెల్ పోలీసులు ముంబైలోనే జుబేర్‌ను, హరీష్‌లను పట్టుకున్నారు. అమృత్‌సర్‌కు చెందిన జస్వీందర్‌ను సైతం అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో గతనెల చివర్లో హైదరాబాద్ వచ్చి టాస్క్‌ఫోర్స్ అధికారుల్ని కలిశారు. డీ–కంపెనీకి చెందిన వారిని అరెస్టు చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతూ వారి వివరాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అమీన్, ముఫకమ్, అబ్రార్‌లను పట్టుకుంది. వీరి నుంచి పిస్టల్, 10 తూటాలు, ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకుంది. ముంబై తీసుకువెళ్లి నిందితుల్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇక్కడ్నుంచే బెదిరించారు: ముంబై క్రైం బ్రాంచ్ అధికారి ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అత్యంత గోప్యంగా ఉంచాల్సి వచ్చిందని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. ‘‘అమీన్‌తోపాటు ఈ కేసులో అరెస్టు చేసిన ఇతర నిందితులను లోతుగా విచారించాల్సి ఉంది. అమీన్ నేరుగా పాకిస్తాన్లో ఉన్న డీ–కంపెనీ క్యాడర్‌తో సంప్రదింపులు జరిపినట్లు నిర్ధారణ అయింది. మిగిలిన ఇద్దరు ఇతడికి సహకరించారు. ఓ సందర్భంలో అమీన్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి షబ్నమ్‌ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడు. ఇతడు గతంలోనూ ఈ తరహా బెదిరింపులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు. -
మరో మారణహోమానికి దావూద్ గ్యాంగ్ కుట్ర..!
-
పాకిస్ధాన్లో దావూద్ ఇబ్రహీం
-
దావూద్ కాల్స్ వివాదం: ఆ నంబర్ నాదే!
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం నుంచి తనకు నిత్యం ఫోన్ కాల్స్ వస్తున్నట్టు వచ్చిన ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే తోసిపుచ్చారు. దావూద్ భారత్‌కు తరచూ కాల్స్ చేసే జాబితాలో ఉన్న ఫోన్ నంబర్ తనదేనని, అయితే తనకు దావూద్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ భారత్‌లో అధికంగా కాల్ చేసిన ఫోన్ నంబర్లు తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో బీజేపీ నేత ఖడ్సే పేరు ఉండటం కలకలం రేపుతోంది. ఈ వివాదంపై ఖడ్సే స్పందిస్తూ 'వారికి దావూద్ ఫోన్ నంబర్ తెలిస్తే మొదట పోలీసులకు ఆ విషయం ఎందుకు తెలియజేయలేదు. ఎందులో ఏదో గూడుపుఠాణి ఉన్నట్టు కనిపిస్తోంది. నా మీద ఆరోపణలు చేసిన వారికి దావూద్ నంబర్ ఎలా తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపాలి. గత ఏడాది కాలంలో నా ఫోన్‌కు విదేశీ కాల్స్ రావడం, విదేశాలకు ఫోన్ చేయడంగానీ చేయలేదు' అని చెప్పారు. దావూద్ భారత్‌కు తరచూ కాల్ చేస్తున్న నాలుగు ఫోన్ నంబర్ల ఖడ్సే పేరు మీద తీసుకున్న నంబర్ కూడా ఉందని వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్ మనీష్ భంగాలే హ్యాకింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దావూద్ నంబర్ ను హ్యాక్ చేయడం ద్వారా ఈ వివరాలు బయటపెట్టారు. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్ చేస్తున్న ఫోన్ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. -
టాప్ పొలిటిషన్‌కు నిత్యం దావూద్ కాల్స్!
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం నిత్యం ఫోన్‌కాల్స్ చేసేవాడా? అంటే తాజాగా కథనం ఔననే అంటున్నది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ భారత్‌లో అధికంగా కాల్ చేసిన ఫోన్ నంబర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో బీజేపీ నేత ఖడ్సే పేరు ఉండటం కలకలం రేపుతోంది. దావూద్ భారత్‌కు తరచూ కాల్ చేస్తున్న నాలుగు ఫోన్ నంబర్ల ఖడ్సే పేరు మీద తీసుకున్న నంబర్ కూడా ఉంది. వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్ మనీష్ భంగాలే హ్యాకింగ్ చేయడం ద్వారా ఈ నాలుగు నంబర్లు బయటపెట్టారు. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్ చేస్తున్న ఫోన్ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. -
దావూద్ ఒకడే.. అడ్రస్‌లు ఎన్నో!
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీ ప్రస్తుతం పాకిస్థాన్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు సాగిస్తోందన్నది బహిరంగ రహస్యమే. అయితే అందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంపాదించింది. కరాచీలో కూడా డి కంపెనీకి వ్యాపారాలు ఉన్నాయంటూ తాను దాఖలుచేసిన చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, కేష్ ఈక్వినాక్స్ లు దావూద్ భాయ్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా కుటుంబం నడుపుతున్నట్లు అందులో పేర్కొంది. భారుచ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిక్నా పాకిస్తాన్ లోని తన రెండు అడ్రస్‌లను పేర్కొన్నారు. వీటిలో ఒకటి కరాచీలోని బాగ్ ఇబ్నే ఖాసీం వద్ద కాగా.. మరొకటి డీ5, మయన్మార్ ఆర్కేడ్, గుల్షన్-ఈ-ఇక్బాల్, గుల్షన్ సైక్రియాట్రిక్ ఆసుపత్రి, కరాచీగా పేర్కొన్నాడు. 2002 గుజరాత్ అల్లర్లలో యాంటీ ముస్లిం సపోర్టర్లుగా పేరొందిన శిరీష్ బన్ గాలీ (ఆర్ఎస్ఎస్), విరాళ్ దేశాయ్ (వీహెచ్ పీ), జయకర్ మహారాజ్ (బజరంగ్ దళ్)లను కుట్రపన్ని చంపినట్లు జావేద్ పై కేసు నమోదయింది. ఐఎస్ఐ సంస్థ నుంచి ఒత్తిళ్ల కారణంగానే జావేద్ ఈ కుట్రకు పాల్పడ్డాడని కరాచీలోని కేఫ్ ఇతని కుటుంబానికి కచ్చితమైన ఆధార వనరా? లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. చార్జీషీటులో వివరాల ప్రకారం జావేద్ భారుచ్ హత్యల కోసం ఆయుధాలు సమకూర్చుకున్నట్లు ఉంది. మొదట ముంబై ఆ తర్వాత సూరత్ లను టార్గెట్‌గా పెట్టుకోగా.. ముంబైలో బుల్లెట్ల మ్యాగజైన్ పోవడంతో సూరత్‌లో దాడి చేసినట్లు ఎన్ఐఏ చార్జ్ షీటులో పేర్కొంది. తనతో పాటు దాడిలో పాల్గొన్న వారికోసం జావేద్ రూ.5 లక్షలను వారికి ఇచ్చేందుకు హవాలా మార్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపింది. జావేద్ తల్లిని నేపాల్‌లో అరెస్టుచేసిన ఎన్ఐఏ అధికారులు ఆమె నివాసం ఉండే ప్రాంతాలు దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్, ముంబైలోని మహీమ్ లుగా పేర్కొన్నారు. -
గోవిందా, దావుద్ మంచి స్నేహితులు: గవర్నర్
లక్నో: తన పై విజయం సాధించడానికి నటుడు గోవిందా అండర్ వరల్డ్ సహాయం తీసుకున్నాడని ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ పేర్కొన్నారు. 1999 నుంచి 2004 వరకు రామ్ నాయక్ కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో ఉత్తర ముంబై లోక్ సభ నియోజకవర్గం నుంచి రామ్ నాయక్(బీజేపీ)పై పోటీ చేసి గోవిందా(కాంగ్రెస్) 11 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించడానికి గోవిందా అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, బిల్డర్ హితేన్ థాకూర్ల సహాయం తీసుకున్నాడని తాను రాసిన ఓ పుస్తకంలో వెల్లడించారు. తాను ఇటీవల మరాఠీలో రాసిన స్వీయ చరిత్ర చైర్వేతీ, చైర్వేతీ(ముందుకు సాగూ) ఏప్రిల్ 25న ఆవిష్కరించారు. మూడు సార్లు ఎంపీగా గెలుపొందిన తాను ముంబై అభివృద్ధికి ఎంతగానో కృషిచేశానని తెలిపారు. అయినా స్వల్ప ఓట్ల తేడాతో ఆ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. తన ఓటమికి కారణాలను ఆ పుస్తకంలో ప్రస్తావించారు. గోవిందాకు దావుద్, థాకూర్ మంచి స్నేహితులు అని పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొందడానికి వారి సహాయం తీసుకున్నాడని రామ్ నాయక్ ఆరోపించారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న రామ్ నాయక్ ఇలాంటి ఆరోపణలు చేస్తారని తాను ఊహించలేదని గోవిందా అన్నారు.'నన్పు నమ్మి నాకు విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల్లో విజయానికి నేనెవరి సహాయం తీసుకోలేదు' అని తన పై వచ్చిన ఆరోపణలపై గోవిందా వివరణ ఇచ్చుకున్నారు. అండర్ వరల్డ్‌కు అమ్ముడుపోయే వారిలా నియోజక వర్గ ప్రజలు కనిపిస్తున్నారా అని రామ్ నాయక్ పై మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలతో ప్రజలను అవమానపరచకండి అన్నారు. -
'ఇద్దరు ప్రధానులతో దావూద్ ఇబ్రహీం'
లక్నో: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం, ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ఒకే చోట కలుసుకున్నారని బాంబు పేల్చారు. ఇటీవల మోదీ, నవాజ్ షరీఫ్‌లు కలుసుకున్న సమయంలో దావూద్ కూడా అక్కడే ఉన్నాడని ఆజంఖాన్ ఆరోపించారు. 'దీనికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మోదీని కాదని చెప్పమనండి' అంటూ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ.. పొరుగు దేశం ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన కానుకగా.. ఆయన మనవరాలు మెహరున్నిసా పెళ్లికి అనుకోని అతిథిగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన, ప్రచారం లేకుండా.. ప్రధాని నరేంద్రమోదీ అకస్మాత్తుగా పాక్ గడ్డపై గత ఏడాది అడుగుపెట్టిన విషయం తెలిసిందే. లాహోర్ శివార్లలోని షరీఫ్ రాజ ప్రసాదంలో రెండున్నర గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన భారత్‌కు వచ్చారు. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
-
దావూద్ ముంబై ఆస్తులు వేలం
-
ఛోటారాజన్ ల్యాప్‌టాప్‌లో దావూద్ గుట్టు!
-
లొంగిపోయాడా?
చోటా రాజన్ అరెస్టుపై సందేహాలు (సెంట్రల్ డెస్క్): ఇరవై ఏళ్లుగా భారత చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న చోటా రాజన్ నిజంగానే అరెస్టయ్యాడా? లేక తనకు తానుగా లొంగిపోయాడా? కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రాజన్ అనుచరవర్గాన్ని దాదాపుగా కోల్పోయాడని, దావూద్ కుడిభుజం చోటా షకీల్ నుంచి ప్రాణహాని పొంచివుండటంతో భారత్‌లోని జైళ్లే తనకు సురక్షితమని భావించి లొంగిపోయాడనే వాదన వినిపిస్తోంది. చోటుచేసుకున్న పరిణామాలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి. ఒంటరి ప్రయాణం... ముఖం నిండా నవ్వు మోహన్‌కుమార్ అనే మారుపేరుతో జి9273860 నంబరుతో రాజన్‌కు 2008లో సిడ్నీలో భారత పాస్‌పోర్ట్ మంజూరు అయ్యింది. ఉన్నతస్థాయిలో సహకారం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనేది కొందరి వాదన. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చోటారాజన్ ప్రాణహానిని తప్పించుకోవడానికి లొంగిపోవడమే మేలనే నిర్ణయానికి వచ్చి ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లోని ఉన్నతాధికారులకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఒకప్పటి ఐబీ అధినేత, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అరెస్టు అనబడే లొంగుబాటు వ్యవహారాన్ని డీల్ చేశారని, ఎప్పుడు, ఎలా జరగాలనేది ప్లాన్ చేసి... ఆదివారం సిడ్నీ నుంచి బాలిలో దిగగానే ఇండోనేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. గత ఏడాది చివరి నాటికే అనుచరగణాన్ని దాదాపుగా కోల్పోయిన రాజన్ ప్రాణభయంతో వణికిపోయాడని, పోలీసులకు చిక్కగానే రిలీఫ్‌గా ఫీలయ్యాడని, అతని ముఖంలో చిరునవ్వు దీని ఫలితమేనని పరిశీలకుల విశ్లేషణ. మాఫియా డాన్ అయిన రాజన్ సురక్షితమని భావించకపోతే... ఎందుకు ఒంటరి ప్రయాణం చేస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే ఎలాంటి ప్రతిఘటనా లేకుండా అతను లొంగిపోవడం కూడా గమనార్హం. బంధం గట్టిదే...! దావూద్ గ్యాంగ్ సభ్యులను, ఐఎస్ఐ తరఫున పనిచేస్తున్న వారిని ఏరిపారేయడానికి రాజన్‌ను భారత ఏజెన్సీలు వాడుకున్నాయి. పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఎస్ మాస్టర్‌మైండ్ ఖాలిద్ మసూద్, నేపాల్ చట్టసభల సభ్యుడు దిల్షాద్ మీర్జా బేగ్, పర్వేజ్ టాండాలను ఐబీ సహకారంతోనే రాజన్ ముఠా మట్టుబెట్టింది. దావూద్‌కు సన్నిహితులుగా భావించే తకీయుద్దీన్ వాహిద్‌ఖాన్ (ఈస్ట్‌కోస్ట్ ఎయిర్‌లైన్స్) జమీమ్ షా (నేపాల్ కేబుల్ ఆపరేటర్)లను హతమార్చడంలోనూ రాజన్ గ్యాంగ్ హస్తముందని భావిస్తారు. 1998 తప్పుడు పాస్‌పోర్ట్‌పై ప్రయాణిస్తూ థాయ్‌లాండ్‌లో చోటా రాజన్ దొరికిపోయాడు. ఇంటర్‌పోల్ నోటీసు ఉన్నప్పటికీ అప్పుడు భారత్ అతనికోసం పెద్దగా ఆసక్తి చూపలేదట. ఒక్కరోజులోనే విడుదలయ్యాడు. తర్వాత 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లోనే డి గ్యాంగ్ అతనిపై దాడి చేసినపుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో థాయ్ పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రశ్నించడానికి భారత్ నుంచి ఐదుగురు పోలీసులు బృందం బ్యాంకాక్‌కు బయలుదేరింది. ఈలోపే అనుచరులు విజయ్ షెట్టి, సంతోష్ షెట్టిలు రాజన్‌ను ఆసుపత్రి నుంచి తప్పించారు. ఇక్కడా భారత ఏజెన్సీల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముంబై పోలీసులకు సమాచారం లేదు చోటా రాజన్‌పై ఉన్న కేసుల్లో సింహభాగం ముంబైలో నమోదైనవే. అయితే అతని అరెస్టు లేదా లొంగుబాటుకు సంబంధించి ముంబై పోలీసులకు ఎలాంటి సమాచారమూ లేదట. 2005లో దావూద్ పెద్ద కూతురు మహ్రూక్‌ను జావిద్ మియాందాద్ కుమారుడు జునైద్‌కు ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. అప్పుడు ఐబీ చీఫ్‌గా ఉన్న అజయ్ దోవల్... ఈ పెళ్లి వేడుకలో దావూద్‌ను టార్గెట్ చేయాలని ప్లాన్ వేశారు. రాజన్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ వికీ మల్హోత్రా, ఫరీద్ తనాషాలను ఈ పనిమీద కరాచీకి పంపాలని నిర్ణయించారు. వేడుక జరిగే మండపంలోకి దావూద్ రాగానే వికీ అతన్ని కాల్చాలనేది పథకం. వీరిద్దరూ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా... దోవల్ ప్లాన్ గురించి తెలియని ముంబై పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ తలకిందులైంది. ఈ విషయాన్ని హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ఆగష్టులో ఒక టీవీ చానల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు కూడా. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదని భావించారేమో... రాజన్ వ్యవహారాన్ని ఈసారి ముంబై పోలీసులకు తెలియకుండా గుట్టుగా ఉంచారు. మంచి బాలుడు గిర్వి.. పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఫల్తాన్ తెహసీల్‌లో ఓ చిన్న గ్రామం. గతంలో అక్కడ ఒక గుడిసె ఉండేది. ఆ తర్వాత అది ఓ పెద్ద భవంతిగా అవతరించింది. ఆ భవంతి పేరు సదాలక్ష్మి. ఆ చుట్టుపక్కల దాన్ని మించిన కట్టడం లేదని ఆ గ్రామస్తులు చెబుతారు. 20 ఏళ్లుగా పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ రాజేంద్ర సదాశివ్ నికల్జే అలియాస్ చోటా రాజన్ తన చిన్నప్పుడు అక్కడ ఎక్కువ కాలం గడిపాడు. రాతి గోడలతో, ఇనుపగేట్లతో పకడ్బందీగా నిర్మించిన ఆ ప్యాలెస్‌లో అందమైన లాన్లు కూడా ఉన్నాయి. 50ల్లో ముంబైకి వలసవెళ్లిన రాజన్ తండ్రి సదాశివ్ సఖరాం నికల్జే విగ్రహమూ అక్కడ ఉంది. రాజన్ చిన్నప్పుడు తమ దుకాణానికి తరచుగా వచ్చేవాడని, అతడు మంచి బాలుడని ఓ గ్రామస్తుడు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ముంబైలోపుట్టిన రాజన్ వేసవి సెలవుల్లో, దీపావళి సెలవుల్లో గిర్వి గ్రామానికి వచ్చేవాడన్నారు. ముంబైలో అండర్ వరల్డ్ డాన్‌గా మారిన తర్వాత ఇక్కడికి రావడం మానేశాడని చెప్పారు. అయితే కుటుంబ శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రం రాజన్ భార్య, సోదరులు ఇక్కడికి వస్తుంటారని మరో గ్రామస్తుడు చెప్పారు. 1976లో తండ్రి మరణానంతరం రాజన్ సొంత గ్రామానికి రావడం మానేశాడ న్నారు. రాజన్ నేర కార్యకలాపాల్లో పాలుపంచుకునేవాడని అంగీకరించిన గ్రామస్తులు.. దావూద్ ఇబ్రహీంకు విరోధిగా మారడాన్ని మాత్రం స్వాగతించడం గమనార్హం. -
దావూద్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న భారత్
-
దావూద్ పాక్‌లోనే ఉన్నాడు
కేంద్రం స్పష్టీకరణ ఆధారాలను పాక్‌కు ఇచ్చాం భారత్‌కు తీసుకొచ్చి కోర్టులో నిలబెడతాం: రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంటులో స్పష్టంచేసింది. ముంబై దాడుల సూత్రధారి అయిన దావూద్‌ను పాక్ నుంచి భారత్‌కు రప్పించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇక్కడి న్యాయస్థానం ముందు నిలబెడతామని పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి తెలియదంటూ గతవారం హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరీ లోక్‌సభలో ప్రకటన చేయడంపై విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగడంతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం లోక్‌సభలో దావూద్ సమాచారంపై ప్రకటన చేశారు. ‘దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నట్లు మా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. దీనిపై పాక్‌కు అన్నిరకాల సాక్ష్యాధారాలను ఇచ్చాం.అని రాజ్‌నాథ్ చెప్పారు. మా దగ్గర లేడు: పాక్ హై కమిషనర్ లక్నో: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో లేడని భారత్‌లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సోమవారం స్పష్టం చేశారు. -
రమేష్‌కు మాఫియా డాన్ సోదరుడి బెదిరింపు
బెంగ ళూరు (బనశంకరి) : బహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) చోటు చేసుకున్న అక్రమాలపై పోరాటం చేస్తున్న పాలికె అధికార పక్ష నేత ఎన్.ఆర్.రమేష్‌కు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడి నుంచి బెదిరింపులు వచ్చాయి. అనవసరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మంచిదని హెచ్చరించినట్లు సమాచారం. అజ్ఞాతంలో ఉంటునే బెంగళూరులో వ్యవహారాలను దావూద్ నడిపిస్తున్నారు. వంద ఎకరాల డీ నోటిఫికేషన్ గోల్మాల్ను రమేష్ వెలుగులోకి తీసుకువచ్చిన వైనం విదితమే. నిబంధనలను తుంగలో తొక్కి వంద ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ సంస్థ వశం చేసుకుంది. దీనికి సంబందించి 97.26 ఎకరాలకు ఒకే ఖాతా ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై విచారణకు చేపట్టాలని బీఎంటీఎఫ్కు రమేష్ ఫిర్యాదు చేశారు. ఈ చర్య అనంతరమే రమేష్‌కు బెదిరింపులు రావడం గమనార్హం. డీ నోటిఫికేషన్ అయిన స్థలం దావుద్ ఇబ్రహీం సోదరుడిదని అనవసరంగా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలుస్తోంది. -
హఫీజ్, దావుద్లను భారత్‌కు అప్పగించండి
న్యూఢిల్లీ : కరడు గట్టిన తీవ్రవాది హఫిజ్, మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంలకు భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌ను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. పెషావర్ ఘటనతో ఉగ్రవాదంపై పోరును తీవ్రంగా పరిగణిస్తే... ఆ ఇద్దరిని అప్పగించాలని సూచించారు. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వెంకయ్య పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు హితవు పలికారు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో ఆర్మి పాఠశాల్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 148 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఒక్క ఫోన్ కాల్‌తో దావూద్‌ను వదిలేశారు!
-
‘దవూద్’ మూవీ ప్రస్ మీట్
-
దాwood