టాప్ పొలిటిషన్‌కు నిత్యం దావూద్‌ కాల్స్‌! | BJP leader Eknath Khadse on Dawood's most-dialled list, Maharashtra govt orders probe | Sakshi
Sakshi News home page

టాప్ పొలిటిషన్‌కు నిత్యం దావూద్‌ కాల్స్‌!

Published Sat, May 21 2016 7:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టాప్ పొలిటిషన్‌కు నిత్యం దావూద్‌ కాల్స్‌! - Sakshi

టాప్ పొలిటిషన్‌కు నిత్యం దావూద్‌ కాల్స్‌!

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సేకు అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం నిత్యం ఫోన్‌కాల్స్ చేసేవాడా? అంటే తాజాగా కథనం ఔననే అంటున్నది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న దావూద్‌ భారత్‌లో అధికంగా కాల్‌ చేసిన ఫోన్‌ నంబర్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో బీజేపీ నేత ఖడ్సే పేరు ఉండటం కలకలం రేపుతోంది.

దావూద్ భారత్‌కు తరచూ కాల్‌ చేస్తున్న నాలుగు ఫోన్‌ నంబర్ల ఖడ్సే పేరు మీద తీసుకున్న నంబర్‌ కూడా ఉంది. వడోదరకు చెందిన ఎథికల్ హ్యాకర్‌ మనీష్‌ భంగాలే హ్యాకింగ్ చేయడం ద్వారా ఈ నాలుగు నంబర్లు బయటపెట్టారు. ఈ నంబర్ల గురించి జాతీయ చానెళ్లలో కథనాలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దావూద్ నిత్యం కాల్‌ చేస్తున్న ఫోన్‌ నంబర్లపై దర్యాప్తు జరుపుతామని బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement