హఫీజ్, దావుద్లను భారత్కు అప్పగించండి | India asks pakistan to handover Dawood, Hafiz Muhammad Saeed | Sakshi
Sakshi News home page

హఫీజ్, దావుద్లను భారత్కు అప్పగించండి

Published Thu, Dec 18 2014 11:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

హఫీజ్, దావుద్లను భారత్కు అప్పగించండి

హఫీజ్, దావుద్లను భారత్కు అప్పగించండి

న్యూఢిల్లీ : కరడు గట్టిన తీవ్రవాది హఫిజ్, మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంలకు భారత్కు అప్పగించాలని పాకిస్థాన్ను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. గురువారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. పెషావర్ ఘటనతో ఉగ్రవాదంపై పోరును తీవ్రంగా పరిగణిస్తే... ఆ ఇద్దరిని అప్పగించాలని సూచించారు.

ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని వెంకయ్య పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు హితవు పలికారు. పాకిస్థాన్లోని పెషావర్లో తాలిబన్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో ఆర్మి పాఠశాల్లోకి ప్రవేశించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 148 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement