'దావూద్ ను అప్పగించాలి' | Pakistan must handover Dawood Ibrahim: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'దావూద్ ను అప్పగించాలి'

Published Sat, Aug 22 2015 3:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

'దావూద్ ను అప్పగించాలి'

'దావూద్ ను అప్పగించాలి'

హైదరాబాద్: :పాకిస్థాన్ లో తలదాచుకుంటున్నఅండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్ కు అప్పగించాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.  ముంబైలో (26/11) జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి అయిన దావూద్ ను అప్పగించాల్సిన అవసరముందన్నారు. దావూద్ కు పాకిస్థాన్ అండగా నిలుస్తూ అతనికి సహకారం అందిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే దావూద్ ను తప్పకుండా భారత్ కు అప్పగించాల్సేందనని వెంకయ్య పేర్కొన్నారు. దావూద్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ ఎన్నిసార్లు చెప్పినా.. అక్కడే ఉన్నాడనేందుకు చాలా సాక్ష్యాలున్నాయని వెంకయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement