బహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) చోటు చేసుకున్న అక్రమాలపై పోరాటం చేస్తున్న పాలికె ....
బెంగ ళూరు (బనశంకరి) : బహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) చోటు చేసుకున్న అక్రమాలపై పోరాటం చేస్తున్న పాలికె అధికార పక్ష నేత ఎన్.ఆర్.రమేష్‌కు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడి నుంచి బెదిరింపులు వచ్చాయి. అనవసరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మంచిదని హెచ్చరించినట్లు సమాచారం.
అజ్ఞాతంలో ఉంటునే బెంగళూరులో వ్యవహారాలను దావూద్ నడిపిస్తున్నారు. వంద ఎకరాల డీ నోటిఫికేషన్ గోల్‌మాల్‌ను రమేష్ వెలుగులోకి తీసుకువచ్చిన వైనం విదితమే. నిబంధనలను తుంగలో తొక్కి వంద ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ సంస్థ వశం చేసుకుంది. దీనికి సంబందించి 97.26 ఎకరాలకు ఒకే ఖాతా ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై విచారణకు చేపట్టాలని బీఎంటీఎఫ్‌కు రమేష్ ఫిర్యాదు చేశారు.
ఈ చర్య అనంతరమే రమేష్‌కు బెదిరింపులు రావడం గమనార్హం. డీ నోటిఫికేషన్ అయిన స్థలం దావుద్ ఇబ్రహీం సోదరుడిదని అనవసరంగా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలుస్తోంది.