
కామారెడ్డి: రాజంపేట మండలంలోని శేర్‌శంకర్‌తండాకు చెందిన భార్యభర్తలు ముద్రిచ్చ రమేష్, నీలాలు బధవారం అర్ధరాత్రి పాముకాటుకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన భార్యభర్తలు వారి సొంత వాహనంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలివెళ్లారు.
సమయానికి ఆస్పత్రికి చేరడంతో వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడారు. ప్రసుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు తండావాసులు పేర్కోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment