మహిళా రేషన్‌ డీలర్‌ హత్య! వివాహేతర సంబంధమే కారణమా? | Female Ration Dealer Murdered In Karimnagar, Is Extramarital Affair The Cause? - Sakshi

Karimnagar Ration Dealer Death: మహిళా రేషన్‌ డీలర్‌ హత్య! వివాహేతర సంబంధమే కారణమా?

Oct 12 2023 5:00 AM | Updated on Oct 12 2023 10:25 AM

- - Sakshi

కరీంనగర్: మంథనిలోని హనుమాన్‌నగర్‌లో మహిళా రేషన్‌ డీలర్‌ హత్య కలకలం రేపింది. మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన బందెల రాజమణి(37) ఈ నెల 9న రాత్రి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఆటో డ్రైవర్‌ పైడాకుల సంతోష్‌ ఇంట్లో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముత్తారం మండలానికి చెందిన రాజమణికి లక్ష్మీపూర్‌కు చెందిన బందెల రమేశ్‌కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.

వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. రమేశ్‌ నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. రాజమణి గ్రామంలో రేషన్‌ డీలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రేషన్‌ సరుకులు తెచ్చే సందర్భంలో ఆటో డైవర్‌ సంతోష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సంతోష్‌ తరచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు.

కొంతకాలంగా అతడితో విభేదాలు రావడంతో ఇంటికి రావడం లేదు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం సరుకుల కోసం వెళ్తున్నానని రాజమణి ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది. ఆ రోజు తన చిన్న కూతురుతో ఫోన్‌లో మాట్లాడింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత పిల్లలు ఫోన్‌ చేయగా స్పందించలేదు.

ఆమె ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం రాత్రి మంథనిలోని ఎరుకల గూడెంలో పైడాకుల సంతోష్‌ అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతిచెంది ఉంది. ఆమె నుదుటిపై, గొంతుపై బలమైన గాయాలున్నాయి. రాజమణిని సంతోష్‌ వేధించడంతో అతడ్ని తిరస్కరించినందుకు కోపంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతురాలి సోదరుడు కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement