‘ధురంధర్‌’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి.. | D-Company Alarms Intelligence Agencies After Dhurandhar Film Sparks Fresh Activity Claims, More Details Inside | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌’ దెబ్బకు దావూద్ ముఠాలో కలకలం.. మన దేశంలోకి..

Jun 1 2026 8:29 PM | Updated on Jun 2 2026 2:51 PM

 Dhurandhar Angered D Company Then Dawood Gang Made A Mumbai Move

ముంబై: డీ-కంపెనీని బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో ఉంటూ అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నడిపిస్తున్న ఈ ముఠా ధురంధర్‌ సినిమా విజయానంతరం ముంబైలో తన గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ను యాక్టివేట్‌ చేసినట్లు సోర్సెస్‌ తెలిపాయి.

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్‌ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో బడే సాహెబ్ అనే పాత్ర కనిపిస్తుంది. మరణశయ్యపై ఉన్న ఆ పాత్రను దావూద్‌ను పోలి ఉన్నట్లు చూపించారు. దీనివల్ల దావూద్ ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రజలను నమ్మించాల్సిన అత్యవసర పరిస్థితి డీ-కంపెనీకి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

షకీల్‌ ముఠాకు నియామకాల బాధ్యత 
కొత్త ఉగ్ర కుట్రలో భాగంగా కొత్త సభ్యులను సమీకరించడం ముఠా ముందున్న తొలి సవాలు. నియామక ప్రక్రియ బాధ్యతను షకీల్ ముఠాకు అప్పగించినట్లు సోర్సులు తెలిపాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐకి ఈ కొత్త సభ్యులకు శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు అందించడం వంటివి చేయనుందని చెప్పాయి. ఉగ్ర ప్రణాళిక అమలు బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు తెలిపాయి.

ఈ ఆపరేషన్ వెనుక అసలు కారణాన్ని కొత్త సభ్యులకు చెప్పలేదని సోర్సెస్‌ తెలిపాయి. ముంబై నుంచి జాగ్రత్తగా ఎంపిక చేసిన వీరిని, బాంద్రా గరీబ్ నగర్‌లో అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి రెచ్చగొట్టినట్లు వెల్లడించాయి.

ఇటీవల ఢిల్లీ పోలీసులు ఒక ఉగ్ర ప్రణాళికను భగ్నం చేసి, ఐఎస్‌ఐకి ముంబై అండర్‌వరల్డ్‌తో ఉన్న సంబంధాన్ని బయటపెట్టిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, వసూళ్ల వ్యవహారాల్లో ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ, డీ-కంపెనీ ఆకస్మిక కదలికలు మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

తమ ప్రభావాన్ని మళ్లీ పెంచుకునేందుకు, ఐఎస్‌ఐ సాయంతో భారతదేశంలో భారీ దాడి చేయాలని లేదా ఓ వీఐపీని లక్ష్యంగా చేసుకోవాలని దావూద్ ముఠా ప్రణాళికలు రచిస్తున్నట్లు సోర్సెస్‌ తెలిపాయి.

ఇలాంటి ఉగ్ర ప్రణాళికలకు ఆశ్రయం ఇవ్వడంలో పాకిస్థాన్ పాత్ర నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నాయి. అయితే కీలక అరెస్టులు సకాలంలో జరుపుతూ భారత దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను భగ్నం చేస్తున్నాయని సోర్సెస్‌ తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement