addresses
-
2022 సెకండ్ ఆఫ్‌కి అందరికీ టీకాలు: ఆర్బీఐ గవర్నర్
సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో ప్రసంగిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని గవర్నర్ చెప్పారు.అయితే కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుందన్నారు. బలమైన ఆర్థిక పునరుద్ధరణవైపు సాగుతున్న తరుణంలో తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనే స్థితికి మారిందని, ప్రస్తుతం మనం సెకండ్‌వేవ్ తో పోరాడుతున్నామన్నారు. ఈ క్రమంలో వ్యాపారులతో సహా ఇండస్ట్రీలోఅన్ని వర్గాల వారిని ఆదుకునున్నామని శక్తికాంత్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా కోవిడ్ హెల్త్‌కేర్ ఇన్ఫ్రా వసతులు కల్పించేందుకు రూ.50వేల కోట్ల మేరు నిధులను బ్యాంకుల వద్ద రెపోరేటు వడ్డీతో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 588 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఫారెక్స్ నిధులు, జి-సెక్ ఆప్షన్లు వినియోగంలోకి వస్తాయన్నారు. అలాగు 2022 సెకండ్ ఆఫ్‌కల్లా అందరికీ టీకాలు లభిస్తాయి. ఆర్బీఐ గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► మే 20 న రెండోసారి 35 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు ► బ్యాంకులకు కోవిడ్ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స సంస్థలకు గుర్తింపు ► సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు. ప్రస్తుత రెపో రేటుకు 10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ .10 లక్షల వరకు తాజా రుణాలు. అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం ► మార్చి 2022 వరకు ఎన్‌పిఎల కోసం నిర్దిష్ట కేటాయింపు ► అత్యవసర ఆరోగ్య సంరక్షణ నిమ్తిం మూడేళ్ల కాలానికిగాను వన్‌టైం లిక్విడిటీ మద్దతు కింద 50 వేల కోట్ల రూపాయలు ►ప్రస్తుత సంక్షోభ సమయంలోవీడియో ద్వారా వినియోగదారుల కేవైసీ అప్డేట్ సౌకర్యం. కేవైపీ అప్డేట్ కాని యూజర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలుండవు. ►రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడీ ఉపశమనం.. 36 రోజుల నుంచి 50 రోజులకు గడువు పెంపు కరోనా నివారణ చర్యలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చని అంచనా వేశారు.అలాగే ఫిబ్రవరిలో 5శాతంగా సీసీఐ ఇన్ఫ్లేషన్ మార్చి నెలలో 5.5శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. అయితే సాధారణ వర్షపాతం నమోదు కానుందన్న వాతావరణ శాఖ అంచనాలతో పప్పు దినుసులు, వంటనూనెల ధరలనుంచి ఉపశమం లభించనుందనే ఆశాభావం శక్తికాంతదాస్. వ్యక్తం చేశారు మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,82,315 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,780 మరణాలు సంభవించాయి. 3,38,439 డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో మొత్తం కేసులు 2,06,65,148కి చేరాయి. మొత్తం రికవరీలు: 1,69,51,731, మొత్తం మరణాల సంఖ్య: 2,26,188 కి చేరింది.క్రి అలాగే మొత్తం టీకాలు స్వీకరించిన వారి సంఖ్య 16,04,94,188గా ఉంది. -
10కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా రైతులకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలను ఆయన గట్టిగా సమర్థించారు. వీటి అమలుతో 10 కోట్ల మంది సన్నకారు రైతులు తక్షణమే ప్రయోజనం పొందుతారని తెలి పారు. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రా జధాని ఢిల్లీలో హింస చోటుచేసుకోవడం, రై తుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరగడం చా లా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రా రంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏ సీ) వద్ద శాంతికి పొరుగు దేశం విఘాతం కలి గిస్తోందంటూ పరోక్షంగా చైనాపై మండిపడ్డా రు. కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ► సరిహద్దులో యథాతథ స్థితిని మార్చడానికి కొన్ని దేశాలు చేస్తున్న కుట్రలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. ►పేదలు, సన్నకారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల పురోగతికి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ► కొత్త సాగు చట్టాలతో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. గతంలో వివిధ పార్టీలు ఈ చట్టాలకు మద్దతునిచ్చాయి. ► రాజ్యాంగం మనకు భావప్రకటనా స్వేచ్ఛను ఇచ్చింది. అదే సమయంలో చట్టాలను గౌరవించాలని, రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించాలని రాజ్యాంగం బోధించిందన్న సంగతి మరచిపోవద్దు. ► మూడు కొత్త సాగు చట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా గౌరవిస్తుంది. కోర్టు ఆదేశాలతో ఈ చట్టాల అమలును ప్రభుత్వం నిలిపివేసింది. ► సన్న, చిన్నకారు రైతుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.13 లక్షల కోట్లను బదిలీ చేసింది. ► కరోనా వ్యాప్తి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు 8 నెలలపాటు ఉచి తంగా నిత్యావసరాలను సరఫరా చేసింది. ► కరోనా కల్లోల సమయంలోనూ భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 36 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. బహిష్కరించిన ప్రతిపక్షాలు రాష్ట్రపతి తన ప్రసంగంలో గత ఏడాది మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తదితరులకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 20 ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగానే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్లో రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతుండగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. -
'ఈ దశాబ్ధం భారత్‌కు ఎంతో కీలకం'
న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని,ఈ దశాబ్దం భారత్‌కు ఎంతో కీలకంగా మారనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందని వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం దేశ ప్రజలు ఐక్యతగా వ్యవహరించడం హర్షణీయమని పేర్కొన్నారు.హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు.(కొనుగోలు శక్తి పెంపే బడ్జెట్ లక్ష్యం) ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ నిర్ణయం వల్ల జమ్మూ, కశ్మీర్, లఢక్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని, దేశంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు కశ్మీర్‌కు కూడా వర్తిస్తున్నాయని వెల్లడించారు. సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతుందని, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు భారీగా కేటాయించారని, అక్కడ రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే బోడో సమస్యను పరిస్కరించారని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించారని రాష్ట్రపతి వివరించారు. గత ఐదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, బ్యాంకింగ్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించిందని పేర్నొన్నారు. (అన్ని వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం: మోదీ) సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదు పౌరసత్వ సవరణ చట్టంపై మాట్లాడుతూ.. గాంధీ స్పూర్తితో పాకిస్తాన్లో ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తున్నామని, ఇది మన కర్తవ్యమని తెలిపారు. సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని, అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కోవింద్ వెల్లడించారు. పాలనా విభాగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రభుత్వ సేవలను వేగవంతంగా ప్రజలకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందని కోవింద్ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి భారీగా నిధులు వెచ్చించారని తెలిపారు.దేశంలో 27వేల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గంగా ప్రక్షాలన మంచి ఫలితాన్నిస్తోందన్నారు. భారత్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిందని, గుజరాత్లో ఏర్పాటు చేసిన స్టాట్యు ఆఫ్ యునిటీని(సర్దార్ వల్లబాయ్‌పటేల్ విగ్రహం) చూసేందుకు వేల సంఖ్యంలో విదేశీయులు వస్తున్నారని కోవింద్ తెలిపారు. విదేశీ పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగింది జీఎస్టీ విధానం వల్ల ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఈ విధానం అమలు వల్ల రాష్ట్రాలు కూడా పలు ప్రయోజనాలు పొందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ బలంగానే ఉందని, దేశంలో విదేశీ పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగిందని రామ్‌నాథ్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కోవింద్ వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనల్లో గణనీయమైన ప్రగతి సాధించామని కోవింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైనా అంతరిక్షంపై దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, చంద్రయాన్-3కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తుచేశారు.దేశ అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు. ఇతర దేశాలతో సత్సంభాదాలు కొనసాగిస్తూనే దేశ సైనిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు సైనిక విభాగంలో భారీ మార్పులు తీసుకొచ్చామని, వారికి అత్యాధునిక ఆయుధాలను అందించామని రామ్‌నాథ్ కోవింద్ వెల్లడించారు రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.కాగా నల్ల బ్యాడ్జీలు ధరించి విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. -
అద్దె భవనాల్లో కార్యాలయాలు
బోధన్‌టౌన్ : పట్టణంలోని వివిధ కాలనీల్లో అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండటంతో అడ్రస్ దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో అధికారులు సైతం అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు. అద్దె భవనాలకు ప్రతినెల రూ.3 నుంచి రూ.4 వేల అద్దె చెల్లిస్తున్నారు. పట్టణంలోని రాకాసీపేట్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఐసీడీఎస్, తూనికలు కొలతలు కొనసాగాయి. డివిజనల్ లేబర్ అధికారి కార్యాలయంలో గతంలో శక్కర్‌నగర్ చౌరస్తాలో ఉండేది. ప్రస్తుతం ఐసీడీఎస్ కార్యాలయంలో శక్కర్‌నగర్‌లోని కమ్యూనిటీ భవనంలోకి మార్చారు. లేబర్ అధికారి కార్యాయలాన్ని రాకాసీపేట్‌కు మార్చారు. తూనికలు కొలతల కార్యాలయం సరస్వతి నగర్ కాలనీకి మార్చారు. దీంతో కార్యాలయ అడ్రస్‌లు దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో ఎక్సైజ్, తూనికలు కొలతలు, లేబర్, డివిజనల్ సహకార అధికారి కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ఐసీడీఎస్, బీసీ సంక్షేమ, డివిజనల్ సహకార అధికారి శాఖ కార్యాలయాలు కమ్యూనిటీ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాలకు సొంత భవనాలు లేక పోవడంతలో ఇళ్ల మధ్య ఉండడంతో ప్రజలు కార్యాలయాలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేబర్ అధికారి కార్యాలయం అడ్రస్ దొరకదు పట్టణంలోని లేబర్ అధికారి కార్యాలయం శక్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన ఉండేది. కార్యాలయం అడ్రస్ ఎవరిని అడిగినా చెప్పేవారు. లేబర్ డివిజనల్ అధికారి కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో రాకాసీపేట్‌లోని ఓ ఇంటిలో ఏర్పాటు చేశారు. అడ్రస్ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. –ఖలీమ్, పట్టణ వాసి కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే వద్ద ఉండేలా చూడాలి. అద్దె భవనాలు కాకుండ శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బి. మల్లేశ్, కార్మిక సంఘం నాయకుడు -
చిరునామాకు కేరాఫ్ మెట్రో పిల్లర్లు...
-
దావూద్ ఒకడే.. అడ్రస్‌లు ఎన్నో!
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీ ప్రస్తుతం పాకిస్థాన్ కేంద్రంగానే అన్ని వ్యవహారాలు సాగిస్తోందన్నది బహిరంగ రహస్యమే. అయితే అందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సంపాదించింది. కరాచీలో కూడా డి కంపెనీకి వ్యాపారాలు ఉన్నాయంటూ తాను దాఖలుచేసిన చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది. ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్, కేష్ ఈక్వినాక్స్ లు దావూద్ భాయ్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా కుటుంబం నడుపుతున్నట్లు అందులో పేర్కొంది. భారుచ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చిక్నా పాకిస్తాన్ లోని తన రెండు అడ్రస్‌లను పేర్కొన్నారు. వీటిలో ఒకటి కరాచీలోని బాగ్ ఇబ్నే ఖాసీం వద్ద కాగా.. మరొకటి డీ5, మయన్మార్ ఆర్కేడ్, గుల్షన్-ఈ-ఇక్బాల్, గుల్షన్ సైక్రియాట్రిక్ ఆసుపత్రి, కరాచీగా పేర్కొన్నాడు. 2002 గుజరాత్ అల్లర్లలో యాంటీ ముస్లిం సపోర్టర్లుగా పేరొందిన శిరీష్ బన్ గాలీ (ఆర్ఎస్ఎస్), విరాళ్ దేశాయ్ (వీహెచ్ పీ), జయకర్ మహారాజ్ (బజరంగ్ దళ్)లను కుట్రపన్ని చంపినట్లు జావేద్ పై కేసు నమోదయింది. ఐఎస్ఐ సంస్థ నుంచి ఒత్తిళ్ల కారణంగానే జావేద్ ఈ కుట్రకు పాల్పడ్డాడని కరాచీలోని కేఫ్ ఇతని కుటుంబానికి కచ్చితమైన ఆధార వనరా? లేదా ? అన్న సందేహాలు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. చార్జీషీటులో వివరాల ప్రకారం జావేద్ భారుచ్ హత్యల కోసం ఆయుధాలు సమకూర్చుకున్నట్లు ఉంది. మొదట ముంబై ఆ తర్వాత సూరత్ లను టార్గెట్‌గా పెట్టుకోగా.. ముంబైలో బుల్లెట్ల మ్యాగజైన్ పోవడంతో సూరత్‌లో దాడి చేసినట్లు ఎన్ఐఏ చార్జ్ షీటులో పేర్కొంది. తనతో పాటు దాడిలో పాల్గొన్న వారికోసం జావేద్ రూ.5 లక్షలను వారికి ఇచ్చేందుకు హవాలా మార్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపింది. జావేద్ తల్లిని నేపాల్‌లో అరెస్టుచేసిన ఎన్ఐఏ అధికారులు ఆమె నివాసం ఉండే ప్రాంతాలు దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్, ముంబైలోని మహీమ్ లుగా పేర్కొన్నారు. -
భారత్‌లోనే కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి
-
కరో.. కరో.. జర జల్సా
విలాసాల కోసం యువత పెడదారి దొంగతనాలు, నేరాల బాట పోలీసుల విచారణలో వెల్లడి నిందితులలో ఉద్యోగులు, విద్యావంతులు విలాసాలు... జల్సాలకు అలవాటు పడడం... విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం... కార్లు... విందు వినోదాలు... పబ్‌లు...ఇవన్నీ నగరంలోని యువతను అడ్డదార్లు తొక్కిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు... బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉన్న వారు సైతం పెడదారి పడుతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులం కావాలనే అత్యాశతో దొంగతనాలు... కిడ్నాప్‌లు... మర్డర్ల వంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కష్టపడి సంపాదించే కంటే... అడ్డదారిలో ముందుకు వెళ్లాలనే దురాశతో నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు. గ్రేటర్లో ఇటీవల చోటుచేసుకున్న దొంగతనాలు...ఇతర నేరాల్లో పోలీసులకు చిక్కుతున్న నిందితుల్లో అధికశాతం ఈ తరహా వారేనని వెల్లడైంది. మద్యం... అమ్మాయిలను ఆకర్షించడం వంటిప్రయత్నాలు చేసే క్రమంలో వారు నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నగరంలో గత మూడు రోజుల్లో చోటు చేసుకున్న సంఘటనలూ ఈ కోవలోకే వస్తున్నాయి. తాగుడు.... రాసలీలలకు బానిసైన కానిస్టేబుల్ ఓబులేసు ఏకంగా ఏకే-47 చోరీ చేసి...నేరాల బాట పట్టాడు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె.విశ్వనాథ్(25) కూడా ఉన్నత విద్యావంతుడే. జల్సాలకు అలవాటు పడి... డబ్బు కోసం తుపాకీతోజనాలను బెదిరిస్తూ పోలీసులకు చిక్కాడు. అనంతపురం జిల్లాకు చెందిన దేవరాజ్ (28) బీటెక్ పూర్తి చేశాడు. ఆ యువకుడూ విలాసాల కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ సంఘటనలు నగరంలో పెరుగుతున్న విష సంస్కృతికి అద్దం పడుతున్నాయి. క్రమశిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఏపీఎస్పీ బెటాలియన్‌లో శిక్షణ పొందిన ఓబులేసు జల్సాల బాట పట్టి నేరప్రవృత్తికి అలవాటు పడ్డాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలన్న దురాశ... నేరాల వల్ల వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మారడమే అతన్ని కిడ్నాప్ యత్నానికి పురిగొల్పిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చిన్నవయసులోనే కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. వేతనాన్ని విలాసాలకు ఖర్చు చేయడమేకాక.. తల్లిదండ్రులకు తన కష్టార్జితంలో నయాపైసా విదల్చకపోవడం గమనార్హం. అవివాహితుడైన ఓబులేసు అడ్డదారుల్లో సంపాదించిన మొత్తాన్ని రాసలీలలకే ఖర్చు చేసేవాడంటే... ఎంత జల్సారాయుడో అర్థం చేసుకోవచ్చు. గతంలో కిడ్నాప్ యత్నానికి పాల్పడి రూ.లక్షల్లో దండుకొని... కేవలం పబ్‌లు, విందు, వినోదాలు, విలాసాలకే ఖర్చు చేయడం గమనార్హం. విలాసాల బాట పట్టి కటకటాలపాలైన ఈ కానిస్టేబుల్ ఉదంతం పోలీసు అధికారులను నివ్వెరపరిచింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు వెళ్లేవాడని తెలిసింది. ఒక్కసారి పబ్బుకు వెళ్తే కనీసం రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టేవాడని సమాచారం. అమ్మాయిలతో రాసలీలకే ఎక్కువ మొత్తం వెచ్చించేవాడు. నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపి పారిపోయి... కర్నూలులోని లాడ్జిలో పట్టుబడే సమయంలోనూ అమ్మాయిలతో ఉన్నట్టు తెలిసింది. సెలవులో ఉన్నాడంటే అంతే... జల్సాలైనా... నేరాలైనా సెలవు రోజుల్లోనే చేయడం ఓబులేసు హాబీ, గత ఏడాది డిసెంబర్లో గండిపేటలోని గ్రేహౌండ్స్ విభాగం నుంచి ఏకే-47 చోరీ చేసింది తాను సెలవులో ఉన్న సమయంలోనే. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనవడిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు దోచుకున్నప్పుడూ సెలవులోనే ఉన్నాడు. ఇకనిత్యానంద రెడ్డి కిడ్నాప్ యత్నం, కాల్పులకు బరి తెగించింది కూడా తాను సెలవులో ఉన్న రోజే. చివరికి అరెస్టయిందీ సెలవులో ఉన్నప్పుడే. తలకు విగ్‌తో.. నేరానికి పాల్పడే సమయంలో ఓబులేసు తలకు విగ్ వాడేవాడు. కేబీఆర్ పార్కు వద్ద కాల్పుల సంఘటన స్థలంలో విగ్ లభించింది. నిత్యానందరెడ్డి, ప్రసాద్‌రెడ్డిలు ఓబులేసును ప్రతిఘటించే క్రమంలో అతని తలకు ఉన్న విగ్ ఊడి కింద పడింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే విగ్ వాడుతున్నట్లు విచారణలో ఓబులేసు అంగీకరించాడు. తుపాకీతో బెదిరిస్తూ... దత్తాత్రేయనగర్: తుపాకితో సంచరిస్తున్న ఓ విద్యార్థిని టప్పాచబుత్ర పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ బి. రవీందర్ వివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన కె. విశ్వనాథ్(25) ఎంబీఏ విద్యార్థి. జల్సాలకు అలవాటు పడిన విశ్వనాథ్ కొంత మంది బీహారీలతో కలిసి 3 నెలల క్రితం బీహార్‌కు వెళ్లాడు. అక్కడ సింగిల్ బ్యారెల్ తుపాకి, 6 బుల్లెట్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఏకాంతంగా ఎవరైనా కనిపిస్తే బెదిరించి డబ్బులు, వారి వద్ద ఉన్న సొత్తును దోచుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుడిమల్కాపూర్ వెనకాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విశ్వనాథ్ అటుగా వెళ్తున్నాడు. ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా తుపాకి, 6 బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వలస ఓటర్ల కోసం వల
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: హలో బావా... ఎలాగున్నావ్రా.. సెల్లీ,పిల్లలు బాగున్నారట్రా... ఏటీ లేదు కానీ... మన వార్డు ఎలచ్చన్లు ఈ నెల 30న జరుగుతున్నాయి బావా... ఈ సారి నేనే పోటీ చేస్తున్నాను... నువ్వు.. సెల్లి వచ్చి ఓటేసి వెల్లండి బావా..! హలో ... హలో... అన్నయ్య... బాగున్నావా... ఏంటి సంగతులు... పెద్దోడి పెళ్లి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి... మీకేటి అన్నయ్య మంచి కోడలనే పట్టేశారు... ఏం లేదుకానీ... ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో మన వార్డులో నేను పోటీ చేస్తున్నా... నువ్వు, ఒదినా, పెళ్లి కొడుకు ఓటేయటానికి రావాలి... ఇదీ ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆత్రం. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తుండడంతో అభ్యర్థులు కూడా అందుకు తగినట్టుగా వలస ఓటర్లపై ప్రలోభాల వల విసురుతున్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారికి ఫోన్ చేసి... ఊరొచ్చి ఓటేయమని వేడుకుంటున్నారు. వలస ఓటర్ల కరుణ కోసం అన్ని వైపులా ప్రయత్నాలు ప్రారంభించారు. మహిళలకు కానుకలు, మగవారికి మనీ, మందూ సమర్పించుకుంటూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. త్రిముఖ పోటీ అనివార్యమవడంతో ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్క ఓటును కూడా వదులుకోవడానికి సాహసించడంలేదు. తమకు వారి ముఖాలు తెలియకపోయినా అక్కా, బావా అంటూ వరసలు కలుపుతూ ఫోన్లు చేస్తున్నారు. లేని ప్రేమలను ఒలకబోస్తున్నారు. దారిఖర్చులు తామే భరిస్తామని, వచ్చి వెళ్లిన సమయంలో నష్టపోయిన కూలీ డబ్బులకు అదనంగా మరింత సొమ్ము ఇస్తామని, ఇక్కడ ఏ లోటూ లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తూ తమకు ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉన్న.... దూరప్రాంతాకు వలస వెళ్లిన వారికి ఫోన్ ద్వారా తమ అభ్యర్థనను విన్నవించుకుంటున్నారు. విజయనగరం మున్సిపాలిటీ లో 40 వార్డుల్లో లక్షా 76 వేల 931 మంది ఓటర్లు ఉండగా... ఆయా వార్డుల నుంచి 159 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 41 వేల మంది ఓటర్లు ఉండగా ఆయా వార్డుల నుంచి 117 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 32,500 ఓటర్లు ఉండగా 95 మంది అభ్యర్థులు, పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 33,796 ఓటర్లుండగా... 153 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలిచారు. అయితే నాలుగు మున్సిపాల్టీల పరిధిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉపాధి, ఉద్యోగావకాశాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికలు రావటంతో బరిలో ఉన్న అభ్యర్థులు వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించి ఫోన్ చేయడంతో పాటు, నేరుగా అక్కడికి వెళ్లి మరీ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.