సాక్షి, ముంబై: దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో ప్రసంగిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి చాలా తీవ్రంగా ఉందని, గత నెలలో పరిస్థితి తీవ్రంగా మారిందని గవర్నర్ చెప్పారు.అయితే కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుందన్నారు. బలమైన ఆర్థిక పునరుద్ధరణవైపు సాగుతున్న తరుణంలో తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనే స్థితికి మారిందని, ప్రస్తుతం మనం సెకండ్‌వేవ్ తో పోరాడుతున్నామన్నారు. ఈ క్రమంలో వ్యాపారులతో సహా ఇండస్ట్రీలోఅన్ని వర్గాల వారిని ఆదుకునున్నామని శక్తికాంత్ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా కోవిడ్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రా వసతులు కల్పించేందుకు రూ.50వేల కోట్ల మేరు నిధులను బ్యాంకుల వద్ద రెపోరేటు వడ్డీతో అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. 588 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఫారెక్స్ నిధులు, జి-సెక్ ఆప్షన్లు వినియోగంలోకి వస్తాయన్నారు. అలాగు 2022 సెకండ్ ఆఫ్‌కల్లా అందరికీ టీకాలు లభిస్తాయి.
ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
► మే 20 న రెండోసారి 35 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు
► బ్యాంకులకు కోవిడ్ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స సంస్థలకు గుర్తింపు
► సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల కోసం ప్రత్యేక దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు. ప్రస్తుత రెపో రేటుకు 10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ .10 లక్షల వరకు తాజా రుణాలు. అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం
► మార్చి 2022 వరకు ఎన్‌పిఎల కోసం నిర్దిష్ట కేటాయింపు
► అత్యవసర ఆరోగ్య సంరక్షణ నిమ్తిం మూడేళ్ల కాలానికిగాను వన్‌టైం లిక్విడిటీ మద్దతు కింద 50 వేల కోట్ల రూపాయలు
►ప్రస్తుత సంక్షోభ సమయంలోవీడియో ద్వారా వినియోగదారుల కేవైసీ అప్‌డేట్ సౌకర్యం. కేవైపీ అప్‌డేట్ కాని యూజర్లపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలుండవు.
►రాష్ట్ర ప్రభుత్వాలకు ఓడీ ఉపశమనం.. 36 రోజుల నుంచి 50 రోజులకు గడువు పెంపు
కరోనా నివారణ చర్యలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చని అంచనా వేశారు.అలాగే ఫిబ్రవరిలో 5శాతంగా సీసీఐ ఇన్‌ఫ్లేషన్ మార్చి నెలలో 5.5శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. అయితే సాధారణ వర్షపాతం నమోదు కానుందన్న వాతావరణ శాఖ అంచనాలతో పప్పు దినుసులు, వంటనూనెల ధరలనుంచి ఉపశమం లభించనుందనే ఆశాభావం శక్తికాంతదాస్. వ్యక్తం చేశారు మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,82,315 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,780 మరణాలు సంభవించాయి. 3,38,439 డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో మొత్తం కేసులు 2,06,65,148కి చేరాయి. మొత్తం రికవరీలు: 1,69,51,731, మొత్తం మరణాల సంఖ్య: 2,26,188 కి చేరింది.క్రి అలాగే మొత్తం టీకాలు స్వీకరించిన వారి సంఖ్య 16,04,94,188గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment