
బోధన్‌టౌన్ : పట్టణంలోని వివిధ కాలనీల్లో అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండటంతో అడ్రస్ దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో అధికారులు సైతం అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు. అద్దె భవనాలకు ప్రతినెల రూ.3 నుంచి రూ.4 వేల అద్దె చెల్లిస్తున్నారు. పట్టణంలోని రాకాసీపేట్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఐసీడీఎస్, తూనికలు కొలతలు కొనసాగాయి. డివిజనల్ లేబర్ అధికారి కార్యాలయంలో గతంలో శక్కర్‌నగర్ చౌరస్తాలో ఉండేది. ప్రస్తుతం ఐసీడీఎస్ కార్యాలయంలో శక్కర్‌నగర్‌లోని కమ్యూనిటీ భవనంలోకి మార్చారు. లేబర్ అధికారి కార్యాయలాన్ని రాకాసీపేట్‌కు మార్చారు. తూనికలు కొలతల కార్యాలయం సరస్వతి నగర్ కాలనీకి మార్చారు. దీంతో కార్యాలయ అడ్రస్‌లు దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో ఎక్సైజ్, తూనికలు కొలతలు, లేబర్, డివిజనల్ సహకార అధికారి కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ఐసీడీఎస్, బీసీ సంక్షేమ, డివిజనల్ సహకార అధికారి శాఖ కార్యాలయాలు కమ్యూనిటీ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాలకు సొంత భవనాలు లేక పోవడంతలో ఇళ్ల మధ్య ఉండడంతో ప్రజలు కార్యాలయాలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లేబర్ అధికారి కార్యాలయం అడ్రస్ దొరకదు
పట్టణంలోని లేబర్ అధికారి కార్యాలయం శక్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన ఉండేది. కార్యాలయం అడ్రస్ ఎవరిని అడిగినా చెప్పేవారు. లేబర్ డివిజనల్ అధికారి కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో రాకాసీపేట్‌లోని ఓ ఇంటిలో ఏర్పాటు చేశారు. అడ్రస్ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. –ఖలీమ్, పట్టణ వాసి
కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే వద్ద ఉండేలా చూడాలి. అద్దె భవనాలు కాకుండ శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
– బి. మల్లేశ్, కార్మిక సంఘం నాయకుడు