పిచ్చోడి చేతిలో రాయి | psycho Varma movie song released | Sakshi
Sakshi News home page

పిచ్చోడి చేతిలో రాయి

Published Mon, Jan 4 2021 6:26 AM | Last Updated on Mon, Jan 4 2021 6:26 AM

psycho Varma movie song released - Sakshi

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై వస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. నిర్మాతగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించిన నట్టి కుమార్‌ కొంత గ్యాప్‌ తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నట్టి కుమార్‌ తనయుడు నట్టి క్రాంతి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. కృష్ణప్రియ, సంపూర్ణ మలకర్‌ హీరోయిన్లు. శ్రీధర్‌ పొత్తూరి సమర్పణలో నట్టి కరుణ, అనురాగ్‌ కంచర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడిన ప్రత్యేక గీతాన్ని నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నట్టి కుమార్‌ మాట్లాడుతూ– ‘‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి’ అంటూ సాగే ఈ స్పెషల్‌ సాంగ్‌కు  మంచి స్పందన వచ్చింది. ఈ పాటకు క్రాంతి చేసిన డ్యాన్స్‌కి ప్రశంసలు లభిస్తున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్‌.ఎ. ఖుద్దూస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement